AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Video: ఓరి బాబోయ్.. ఇదెక్కడి షాట్ భయ్యా.. కొడితే స్టేడియం పైకప్పు పగిలిపోయిందిగా.. వైరల్ వీడియో

Shamar Joseph: విండీస్ తరుపున 11వ స్థానంలో వచ్చిన జోసెఫ్ 33 పరుగులు చేశాడు. జోసెఫ్ తన ఇన్నింగ్స్‌లో 2 భారీ సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ రెండు సిక్సర్లలో ఒకటి సిక్సర్స్ స్టేడియం పైకప్పు పెంకులను ధ్వంసం చేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Video: ఓరి బాబోయ్.. ఇదెక్కడి షాట్ భయ్యా.. కొడితే స్టేడియం పైకప్పు పగిలిపోయిందిగా.. వైరల్ వీడియో
Shamar Joseph's Breaks Tile
Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 3:38 PM

Share

Shamar Joseph SIX Video: ప్రస్తుతం ఇంగ్లండ్, వెస్టిండీస్ మధ్య మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్ జరుగుతోంది. తొలి మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ విజయం సాధించింది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యం సాధించింది. ఇప్పుడు ఇరు జట్ల మధ్య రెండో టెస్టు మ్యాచ్ జరుగుతోంది. ఇరుజట్లు ఇప్పటికే తొలి ఇన్నింగ్స్‌ను ముగించాయి. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో 416 పరుగులు చేసింది. వెస్టిండీస్ కూడా ఇంగ్లండ్‌పై తొలి ఇన్నింగ్స్‌లో 457 పరుగులు చేసింది. దీంతో పాటు తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. అయితే, మూడో రోజు ముగిసే సరికి ఇంగ్ండ్ జట్టు 3 వికెట్లు కోల్పోయి 248 పరుగులు చేసింది. అయితే, వెస్టిండీస్ ఇన్నింగ్స్‌లో 11వ ర్యాంక్‌లో బ్యాటింగ్‌ చేసిన షమర్‌ జోసెఫ్‌ విండీస్‌ ఇన్నింగ్స్‌ ఆధిక్యాన్ని కాపాడుకోవడంలో కీలక పాత్ర పోషించాడు. చివరి బ్యాటర్‌గా వచ్చిన జోసెఫ్ 33 పరుగులు చేశాడు. జోసెఫ్ తన ఇన్నింగ్స్‌లో 2 భారీ సిక్సర్లు కూడా కొట్టాడు. ఈ రెండు సిక్సర్లలో ఒకటి సిక్సర్ స్టేడియం పైకప్పు పలకలను ధ్వంసం చేసింది. ఇప్పుడు దాని వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

విరిగిపోయిన టైల్స్..

విండీస్‌ ఇన్నింగ్స్‌ 107వ ఓవర్‌లో ఈ సీన్ కనిపించింది. ఇంగ్లండ్ స్టార్ బౌలర్ గుస్ అట్కిన్సన్ వేసిన ఈ ఓవర్ రెండో బంతికి షమర్ జోసెఫ్ అద్భుతమైన సిక్సర్ బాదాడు. తర్వాతి బంతికి పరుగు రాలేదు. కానీ, జోసెఫ్ నాలుగో బంతికి మరో సిక్స్ కొట్టగలిగాడు. బంతి డీప్ బ్యాక్‌వర్డ్ దిశలో బౌన్స్ అయి స్టేడియం పైకప్పుపై పడింది. బంతి పైకప్పుకు తగలడంతో పైకప్పుపై ఉన్న పలకలు శిథిలమయ్యాయి. పల్వరైజ్డ్ టైల్స్ ముక్కలు కింద కూర్చున్న ప్రేక్షకులపై పడ్డాయి. అయితే, లక్ బాగుండడంతో ఎవ్వరికీ ఏం కాలేదు.

అద్భుతంగా బ్యాటింగ్ చేసిన జోసెఫ్..

షమర్ జోసెఫ్ తొలి ఇన్నింగ్స్‌లో భీకరంగా బ్యాటింగ్ చేసి 27 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 122.22 స్ట్రైక్ రేట్‌తో 33 పరుగులు చేశాడు. మరో ఎండ్‌లో జాషువా డిసిల్వా కూడా అద్భుతమైన బ్యాటింగ్‌ను ప్రదర్శించాడు. 122 బంతుల్లో 10 ఫోర్లు, 3 సిక్సర్లతో అజేయంగా 82 పరుగులు చేశాడు. జాషువా, షమర్‌లు 10వ వికెట్‌కు 71 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. దీంతో వెస్టిండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 41 పరుగుల ఆధిక్యం సాధించింది.

రికార్డుల వర్షం..

జాషువా సిల్వా, షమర్ జోసెఫ్ మధ్య 71 పరుగుల భాగస్వామ్యం ఇంగ్లండ్‌పై పదో వికెట్‌కు వెస్టిండీస్ రెండవ అత్యధిక భాగస్వామ్యం. అంతకుముందు 2012లో ఎడ్జ్‌బాస్టన్‌లో దినేష్ రామ్‌దిన్, టినో బెస్ట్ 143 పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..