AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

INDW vs UAEW: 12 ఫోర్లు, 1 సిక్స్.. 220 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగిన రిచాఘోష్.. యూఏఈ ముందు భారీ టార్గెట్..

India Women vs United Arab Emirates Women: మహిళల ఆసియా కప్ 5వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 202 పరుగుల లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకలోని రంగి దంబుల్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్‌ప్లేలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. స్మృతి మంధాన 13 పరుగులు, షెఫాలీ వర్మ 37, దయాళన్ హేమలత 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును 201 పరుగులకు చేర్చింది.

INDW vs UAEW: 12 ఫోర్లు, 1 సిక్స్.. 220 స్ట్రైక్‌రేట్‌తో చెలరేగిన రిచాఘోష్.. యూఏఈ ముందు భారీ టార్గెట్..
Richa Ghosh Indw Vs Uaew
Venkata Chari
|

Updated on: Jul 21, 2024 | 4:25 PM

Share

India Women vs United Arab Emirates Women: మహిళల ఆసియా కప్ 5వ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)కి 202 పరుగుల లక్ష్యాన్ని అందించింది. శ్రీలంకలోని రంగి దంబుల్లా స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు పవర్‌ప్లేలోనే టాప్-3 వికెట్లను కోల్పోయింది. స్మృతి మంధాన 13 పరుగులు, షెఫాలీ వర్మ 37, దయాళన్ హేమలత 2 పరుగులు చేసి పెవిలియన్‌కు చేరుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ 66 పరుగుల ఇన్నింగ్స్ ఆడి జట్టును 201 పరుగులకు చేర్చింది.

జెమిమా రోడ్రిగ్స్ (14 పరుగులు), రిచా ఘోష్‌తో కలిసి హర్మన్ అర్ధ సెంచరీ భాగస్వామ్యాన్ని నెలకొల్సింది. రిచా 220.69 స్ట్రైక్ రేట్‌తో అజేయంగా 64 పరుగులు చేసింది. ఆమె ఇన్నింగ్స్‌లో 12 ఫోర్లు, ఒక సిక్స్ ఉన్నాయి. అలాగే కెప్టెన్ కౌర్ 7 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టింది.

రెండు జట్ల ప్రాబబుల్ ప్లేయింగ్-11 ఇదే..

భారత్: హర్మన్‌ప్రీత్ కౌర్ (కెప్టెన్), స్మృతి మంధాన, షెఫాలీ వర్మ, దయాలాన్ హేమ్లత, జెమిమా రోడ్రిగ్స్, రిచా ఘోష్, పూజా వస్త్రాకర్, దీప్తి శర్మ, రేణుకా సింగ్, రాధా యాదవ్, తనూజా కన్వర్.

యూఏఈ: ఇషా రోహిత్ ఓజా (కెప్టెన్), తీర్థ సతీష్, రినీత రజిత్, సమైరా ధరణిధర్క, కవిషా అగోదాగే, ఖుషీ శర్మ, హీనా హాట్‌చందానీ, వైష్ణవి మహేష్, రితికా రజిత్, లావణ్య కెన్నీ, ఇందుజా నందకుమార్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..