Video: బాబోయ్.. ఇందే సిక్స్ భయ్యా.. స్టేడియం రూఫ్‌కే బొక్కడిందిగా.. తల పట్టుకున్న ఇంగ్లండ్ బౌలర్..
England vs Scotland, 6th Match, Group B: ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లు టీ-20 మ్యాచ్‌లో నేడు తొలిసారి తలపడుతున్నాయి. ఈ క్రమంలో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. ఇంతకు ముందు ఇరుజట్ల మధ్య 5 వన్డేలు మాత్రమే జరిగాయి. టాస్ ముగిసిన తర్వాత బార్బడోస్‌లో వర్షం మొదలైంది.

England vs Scotland, 6th Match, Group B: ఇంగ్లండ్, స్కాట్లాండ్‌లు టీ-20 మ్యాచ్‌లో నేడు తొలిసారి తలపడుతున్నాయి. ఈ క్రమంలో స్కాట్లాండ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈరోజు టీ-20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లో ఇరు జట్లు తొలిసారి తలపడుతున్నాయి. ఇంతకు ముందు ఇరుజట్ల మధ్య 5 వన్డేలు మాత్రమే జరిగాయి. టాస్ ముగిసిన తర్వాత బార్బడోస్‌లో వర్షం మొదలైంది. దీంతో మ్యాచ్ ప్రారంభం కావడంలో జాప్యం జరుగుతోంది. టీ-20 ప్రపంచకప్‌లో నేడు ఇంగ్లండ్, స్కాట్లాండ్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. వర్షం కారణంగా 45 నిమిషాలు ఆలస్యంగా 8:45 నిమిషాలకు మ్యాచ్ ప్రారంభమైనా ఓవర్లను మాత్రం కుదించలేదు.
జోన్స్ బౌలింగ్‌లో భారీ సిక్స్..
పవర్ ప్లే చివరి ఓవర్‌లో ఇంగ్లిష్ బౌలర్ క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌కి సిద్ధమయ్యాడు. స్కాటిష్ బ్యాట్స్‌మెన్ మైఖేల్ జోన్స్ క్రీజులో ఉన్నాడు. జోర్డాన్ వేసిన రెండో బంతికి జోన్స్ సిక్సర్ బాదాడు. అయితే, ఈ బంతి స్టేడియం వెలుపల పడిపోవడంతో అంపైర్లు బంతిని మార్చాల్సి వచ్చింది. కాగా, ఈ బంతి స్టేడియంపై కప్పుపై ఉంచిన సోలార్ ప్యానల్‌ను గట్టిగా తాకి, ఓ రంద్రం చేసింది. దీంతో అంపైర్లు మరో బంతిని బౌలర్‌కు ఇచ్చారు. ఆ తర్వాతి రెండు బంతుల్లో జోన్స్ వరుసగా 2 ఫోర్లు కొట్టాడు. దీంతో పవర్ ప్లే ముగిసే సరికి వికెట్ నష్టపోకుండా 49 పరుగులు చేసింది. జి మున్సే 17 పరుగులు, అలెగ్జాండర్ జోన్స్ 29 పరుగులు చేశారు.
View this post on Instagram
Scotland batter Michael Jones hits Chris Jordan for SIX on the roof 🤯🤯🤯
And now two fours in a row. Scotland are 48/0 in 5.4 overs against England. What a start 🔥🔥🔥#T20WorldCup2024! #ENGvSCO #T20WorldCup #T20WC2024 #T20WorldCup #USA #ENGvsSCO #NEPvNED #NEPvsNED ” pic.twitter.com/9EEVHwdydL
— The sports (@the_sports_x) June 4, 2024
The bill’s in the post, Michael Jones 🤣🚀#BBCCricket #T20WorldCup #ENGvSCO pic.twitter.com/iHmBSefrDW
— Test Match Special (@bbctms) June 4, 2024
Such a brilliant start for Scotland 49/0 6 overs.#EngvSco pic.twitter.com/Oz3fcnqJ4j
— Shakir Khan (@ShakirK07286818) June 4, 2024
మ్యాచ్ కోసం ఇరు జట్ల ప్లేయింగ్ XI ఇదే..
ఇంగ్లాండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), ఫిల్ సాల్ట్, విల్ జాక్వెస్, జానీ బెయిర్‌స్టో, హ్యారీ బ్రూక్, మోయిన్ అలీ, లియామ్ లివింగ్‌స్టోన్, క్రిస్ జోర్డాన్, జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్, మార్క్ వుడ్.
స్కాట్లాండ్: రిచీ బెరింగ్టన్ (కెప్టెన్), జార్జ్ మున్సే, మైఖేల్ జోన్స్, బ్రెండన్ మెక్ముల్లన్, మాథ్యూ క్రాస్ (వికెట్ కీపర్), మైఖేల్ లీస్క్, మార్క్ వాట్, క్రిస్ గ్రీవ్స్, క్రిస్టోఫర్ సోల్, బ్రాడ్ వీల్, బ్రాడ్లీ క్యూరీ.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




