Emerging Asia Cup 2023: సెమీస్‌లో పాక్ జట్టుని చిత్తు చేసిన బంగ్లా.. రేపే టీమిండియాతో టైటిల్ పోరు.. పూర్తి వివరాలివే..
Emerging Asia Cup 2023: హాంకాంగ్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోకి బంగ్లాదేశ్ ప్రవేశించింది. తొలి సెమీఫైనల్ ద్వారా టీమిండియా ఫైనల్ చేరుకోగా.. రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో చిత్తు..
Emerging Asia Cup 2023: హాంకాంగ్ వేదికగా జరుగుతున్న ఎమర్జింగ్ మహిళల ఆసియా కప్ ఫైనల్‌లోకి బంగ్లాదేశ్ ప్రవేశించింది. తొలి సెమీఫైనల్ ద్వారా టీమిండియా ఫైనల్ చేరుకోగా.. రెండో సెమీఫైనల్‌లో పాకిస్థాన్ 6 పరుగుల తేడాతో చిత్తు చేసి బంగ్లాదేశ్ కూడా ఫైనల్ బెర్త్‌ని కన్ఫర్మ్ చేసుకుంది. ఇక తుదిపోరులో భారత్, బంగ్లాదేశ్ మంగళవారం తలపడనున్నాయి.
పాక్, బంగ్లా మధ్య జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్ గురించి చెప్పుకోవాలంటే.. వర్షం కారణంగా మ్యాచ్‌ను 9 ఓవర్లకు కుదించారు. ఈ క్రమంలో ముందుగా బ్యాటింగ్ చేసిన బంగ్లా అమ్మాయిలు 9 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 59 పరుగులు చేశారు. 60 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ నిర్ణీత ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 53 పరుగులే చేయగలిగింది. మ్యాచ్ మొత్తానికి 21 పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచిన నహీదా అక్తర్(బంగ్లాదేశ్) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ గెలుచుకుంది.
Bangladesh A manage 59-7 in their innings in the rain-reduced semi-final ?
3️⃣ wickets for skipper @imfatimasana while Anoosha Nasir accounted for 2️⃣ batters ⚡#BackOurGirls | #WomensEmergingTeamsAsiaCup pic.twitter.com/FNaiOPCog9
— Pakistan Cricket (@TheRealPCB) June 20, 2023
Bangladesh A defeats Pakistan A to book their Final seat against India A.
Who do you think will win this? #CricketTwitter pic.twitter.com/yMZYYK3vsy
— Female Cricket (@imfemalecricket) June 20, 2023
కాగా, ఎమర్జింగ్ మహిళల టీమ్స్ ఆసియా కప్ టోర్నీ టైటిల్ కోసం భారత్, బంగ్లాదేశ్ మధ్య రేపు తుదిపోరు జరగనుంది. అయితే ఫైనల్ మ్యాచ్‌కి కూడా వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. మరి వర్షం పడితే విజేతను ఎలా నిర్ణయిస్తారో ఇంకా తెలియరాలేదు. కానీ బంగ్లాదేశ్(+4.850) కంటే టీమిండియా(+5.425) రన్ రేట్ మెరుగ్గా ఉంది.
మరిన్ని క్రికెట్ సంబంధిత వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..