- Telugu News Photo Gallery Cricket photos Most double Centuries in Test cricket for Team India: check here to Know the top 5 list
Double Century: సచిన్, సెహ్వాగ్, ద్రవిడ్ కానే కాదు.. టీమిండియా టెస్ట్ ‘డబుల్ సెంచరీల కింగ్’ అతనే..
Test Double Hundred: భారత క్రికెట్ జట్టు తరఫున అత్యధిక టెస్టు సెంచరీలు(51) సాధించిన ఆటగాడిగా సచిన్ టెండూల్కర్ రికార్డు సృష్టించాడు. అయితే భారత్ తరఫున అత్యధికంగా టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన బ్యాట్స్‌మ్యాన్‌ల జాబితాలో సచిన్ టెండూల్కర్ 2వ స్థానంలోనే ఉన్నాడు. అది ప్రస్తుతం టీమిండియా తరఫున ఆడుతున్న ఓ ఆటగాడి పేరిట ఉంది. అతనెవరో, అతని తర్వాత ఎవరెవరు ఉన్నారో ఇప్పుడు చూద్దాం..
Updated on: Jun 20, 2023 | 9:55 PM

1. విరాట్ కోహ్లీ: టీమిండియా తరఫున అత్యధిక టెస్ట్ డబుల్ సెంచరీలు చేసిన రికార్డ్ విరాట్ కోహ్లీ పేరిట ఉంది. టెస్టు క్రికెట్‌లో 185 ఇన్నింగ్స్‌లు ఆడిన విరాట్ కోహ్లీ మొత్తం 7 డబుల్ సెంచరీలు సాధించి ఈ రికార్డ్ సాధించాడు.

2. సచిన్ టెండూల్కర్: అంతర్జాతీయ క్రికెట్‌లో 100 సెంచరీలు కొట్టిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ 200 టెస్ట్ మ్యాచ్‌లలో 329 ఇన్నింగ్స్‌లు ఆడాడు. ఈ క్రమంలో సచిన్ 6 డబుల్ సెంచరీలు చేసి, కోహ్లీ తర్వాతి స్థానంలో ఉన్నాడు.

3. వీరేంద్ర సెహ్వాగ్: టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ లేకుండా డబుల్ సెంచరీల లిస్టు అసంపూర్ణం. 178 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన సెహ్వాగ్ కూడా 6 డబుల్ సెంచరీ చేశాడు.

4. రాహుల్ ద్రవిడ్: టీమిండియా వాల్ రాహుల్ ద్రవిడ్ 284 టెస్టు ఇన్నింగ్స్‌ల్లో 5 డబుల్ సెంచరీలు సాధించాడు.

5. సునీల్ గవాస్కర్: లిటిల్ మాస్టర్ సునీల్ గవాస్కర్ టీమిండియా తరఫున 4 సార్లు డబుల్ సెంచరీలు చేశాడు. మొత్తం 214 టెస్టు ఇన్నింగ్స్ ఆడిన సన్నీ ఈ ఘనత సాధించాడు.




