Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Skincare Tips: డార్క్ సర్కిల్స్, వృద్ధాప్య లక్షణాలకు నెయ్యితో చెక్.. ఇలా వాడితే మెరిసే చర్మం కూడా మీ సొంతం..

Skincare Tips: మారిన కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా విపరీతమయ్యాయి. చర్మ సమస్యలు ఇందులో ప్రధానమైనవని చెప్పుకోవాలి. నిత్యం ఉపయోగించే కెమికల్ కాస్మటిక్స్, వాతావరణ పరిస్థితులు చర్మ సంరక్షణకు పెద్ద సవాలుగా..

Skincare Tips: డార్క్ సర్కిల్స్, వృద్ధాప్య లక్షణాలకు నెయ్యితో చెక్.. ఇలా వాడితే మెరిసే చర్మం కూడా మీ సొంతం..
Ghee For Skincare
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Jun 19, 2023 | 7:22 PM

Skincare Tips: మారిన కాలంతో పాటు ఆరోగ్య సమస్యలు కూడా విపరీతమయ్యాయి. చర్మ సమస్యలు ఇందులో ప్రధానమైనవని చెప్పుకోవాలి. నిత్యం ఉపయోగించే కెమికల్ కాస్మటిక్స్, వాతావరణ పరిస్థితులు చర్మ సంరక్షణకు పెద్ద సవాలుగా మారాయి. అయితే రసాయనాలతో చేసిన ఉత్పత్తుల కంటే సహజమైన పద్ధతులతోనే చర్మ సమస్యలను తేలికగా దూరం చేసుకోవచ్చని అటు డెర్మాటలజిస్టులు, ఇటు నిపుణులు చెబుతున్నారు. కొబ్బరినూనె, పాలు, నెయ్యి వంటి ప్రకృతి వర ప్రసాదాలు చర్మ సంరక్షణ కాపాడడంలో ఉపయోగపడతాయని వారు సూచిస్తున్నారు. ఈ నేపథ్యంలో నెయ్యితో చర్మానికి కలిగే ప్రయోజనాలేమిటో ఇప్పుడు చూద్దాం..

హైడ్రేటెడ్ స్కిన్: నెయ్యిలో విటమిన్ ఎ, ఫ్యాటీ యాసిడ్‌ ఉన్నందును ఇది నేచరల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. ఇంకా చర్మాన్ని ఎక్కువ సమయం పాటు తేమగా ఉంచి, పొడి చర్మాన్ని నిరోధిస్తుంది. ఇందు కోసం మీరు స్నానం చేసే ముందు నెయ్యితో  మీ చర్మంపై సున్నితంగా మసాజ్‌ చేయవచ్చు.

పగిలిన పెదాలు: నెయ్యితో పొడి, పగిలిన పెదవులకు కూడా చెక్ పెట్టవచ్చు. ఇందుకోసం మీరు పగిలిన పెదాలను నెయ్యితో రుద్దితే చాలు.. మీ పెదవులు ఫ్రెష్‌గా కనిపిస్తాయి.

ఇవి కూడా చదవండి

డార్క్ సర్కిల్స్: చాలా మందికి నిద్రలేమి కారణంగా కంటి మీద ఏర్పడే డార్క్ సర్కిల్స్ పెద్ద సమస్యగా మారాయి. ఇవి చూడటానికి చాలా అసహ్యంగా ఉంటాయి. అయితే డార్క్ సర్కిల్స్ మీద నెయ్యిని రుద్దడం వల్ల అక్కడి చర్మం కాంతివంతంగా మారుతుంది. ఇంకా మీ ముఖం రిలాక్సింగ్ అనుభూతిని పొందుతుంది. ఇలా వారం రోజుల పాటు నెయ్యి వాడితే డార్క్ సర్కిల్స్ మాయమవుతాయి.

యాంటీ ఏజింగ్: నెయ్యిలోని సహాజ లక్షణాలు చర్మాన్ని కాంతివంతంగా చేయడంతో పాటు వృద్ధాప్య లక్షణాలను నిరోధిస్తాయి. ఇందులో ఉండే ఏ, డీ, ఈ విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు చర్మంపై ముడతలను తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తాయి.

మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్  చేయండి..