- Telugu News Sports News Cricket news ED summons to team india former India cricketer Suresh Raina in connection with betting app
Team India: బెట్టింగ్ యాప్ కేసులో చిక్కుకున్న ధోని క్లోజ్ ఫ్రెండ్.. ఈడీ సమన్లు..
Team India Dormer Player Suresh Raina: ఇప్పటికే, పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, క్రికెటర్లను ఈ కేసులో ఈడీ విచారించింది. ఇటీవల, నటుడు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులను కూడా తెలంగాణ పోలీసులు, ఈడీ విచారణకు పిలిచారు.
Updated on: Aug 13, 2025 | 9:08 AM

భారత మాజీ క్రికెటర్, మిస్టర్ ఐపీఎల్ సురేష్ రైనాకు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) షాకిచ్చింది. అక్రమ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల ప్రచారానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరు కావాలని రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది.

1xBet అనే బెట్టింగ్ యాప్‌తో రైనాకు సంబంధాలు ఉన్నాయని, ఆ యాప్‌కు ప్రచారకర్తగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో, అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్‌పై స్పష్టత కోసం ఈడీ అధికారులు రైనాను ప్రశ్నించనున్నారు. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యాలయంలో ఈ విచారణ జరగనుంది.

నిజానికి, అక్రమ బెట్టింగ్ యాప్‌ల వల్ల దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల మేర మోసాలు జరుగుతున్నాయని ఈడీ గుర్తించింది. ఈ యాప్‌లను ప్రచారం చేస్తున్న సెలబ్రిటీలపై కూడా ఈడీ తన దృష్టిని సారించింది.

ఇప్పటికే, పలువురు సినీ ప్రముఖులు, నటీనటులు, క్రికెటర్లను ఈ కేసులో ఈడీ విచారించింది. ఇటీవల, నటుడు రానా దగ్గుబాటి, ప్రకాష్ రాజ్, మంచు లక్ష్మి వంటి ప్రముఖులను కూడా తెలంగాణ పోలీసులు, ఈడీ విచారణకు పిలిచారు.

సురేష్ రైనా విచారణలో భాగంగా ఈడీ అధికారులు 1xBet యాప్‌తో ఆయనకున్న సంబంధాలను, అందుకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను పరిశీలించనున్నారు. ఈ కేసులో మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. అక్రమ బెట్టింగ్‌లపై ఈడీ చేపట్టిన ఈ ఉక్కుపాదం వల్ల, ఆన్‌లైన్ బెట్టింగ్ మాఫియాకు చెక్ పెట్టవచ్చని నిపుణులు భావిస్తున్నారు.




