Mohammed Siraj: హైదరాబాద్‌లో సిరాజ్‌కు ఇష్టమైన చాయ్ కేఫ్ ఏదో తెలుసా? మనందరికి తెలిసిన టీ స్పాట్.. వీడియో

ఇటీవలే (మార్చి 13) తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు సిరాజ్. ఈ సందర్భంగా తోటి క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ఈ హైదరాబాదీ పేసర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. బీసీసీఐ కూడా ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. సిరాజ్ జీవితంలోని కొన్ని కీలకమైన, ఆసక్తికర సంఘటనలకు సంబంధించి ఒక వీడియోతో స్పీడ్ స్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది.

Mohammed Siraj: హైదరాబాద్‌లో సిరాజ్‌కు ఇష్టమైన చాయ్ కేఫ్ ఏదో తెలుసా? మనందరికి తెలిసిన టీ స్పాట్.. వీడియో
Mohammed Siraj
Follow us
Basha Shek

|

Updated on: Mar 17, 2024 | 11:20 AM

టీమిండియాలోకి అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా అవతరించాడు మహ్మద్ సిరాజ్. హైదరాబాద్ కు చెందిన ఈ ఫాస్ట్ బౌలర్ ప్రస్తుతం ఐపీఎల్ 2024 సీజన్ కోసం సన్నద్ధమవుతున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు. ఇదిలా ఉంటే ఇటీవలే (మార్చి 13) తన పుట్టిన రోజును సెలబ్రేట్ చేసుకున్నాడు సిరాజ్. ఈ సందర్భంగా తోటి క్రికెటర్లు, అభిమానులు, నెటిజన్లు ఈ హైదరాబాదీ పేసర్ కు బర్త్ డే విషెస్ చెప్పింది. బీసీసీఐ కూడా ఒక స్వీట్ సర్ ప్రైజ్ ఇచ్చింది. అదేంటంటే.. సిరాజ్ జీవితంలోని కొన్ని కీలకమైన, ఆసక్తికర సంఘటనలకు సంబంధించి ఒక వీడియోతో స్పీడ్ స్టర్ కు పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పింది. ఈ వీడియోలో కారు డ్రైవ్ చేస్తూ తన జీవితంలో జరిగిన ఇంట్రెస్టింగ్ విషయాలను చెప్పుకొచ్చాడు సిరాజ్‌. తన ఇష్టాయిష్టాలు, అలాగే చిన్నతనంలో పడిన కష్టాల గురించి ఓపెన్ అయ్యాడు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో తనకు ఇష్టమైన ప్రదేశాల గురించి చెప్పుకొచ్చాడు సిరాజ్. నగరంలోని ప్రముఖ ఛాయ్ కేఫ్ నీలోఫర్ అంటే తనకు చాలా ఇష్టమన్నాడీ స్టార్ పేసర్. నగరంలో ఉంటే కచ్చితంగా తన ఫ్రెండ్స్ తో కలిసి నీలోఫర్ కేఫ్ కు వచ్చి టీ ఆస్వాదిస్తానన్నాడు. ఇక్కడి చాయ్ తో పాటు బన్ ముస్కా అంటే తనకు చాలా ఇష్టమన్నాడు సిరాజ్.

ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు ప్రధాన ఫాస్ట్ బౌలర్లలో మహ్మద్ సిరాజ్ ఒకడు. తన ప్రదర్శనతో బీసీసీఐ సెంట్రల్ ‘ఏ’ గ్రేడ్ కూడా సొంతం చేసుకున్నాడు. ఇప్పటివరకు భారత్ తరఫున 27 టెస్టులు, 41 వన్డేలు, 10 టీ20 ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడాడు సిరాజ్ మియా . తన సంచలన బౌలింగ్ తో భారత్ కు ఎన్నో విజయాలు అందించాడు. ఇప్పుడు ఐపీఎల్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తరఫున బరిలోకి దిగనున్నాడు.

ఇవి కూడా చదవండి

సిరాజ్ కు బీసీసీఐ స్పెషల్ బర్త్ డే విషెస్.. ఎమోషనల్ వీడియో..

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..