Ravichandran Ashwin: ధోనికి ఎల్లప్పుడు రుణపడి ఉంటా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ ఎమోషనల్

టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మజీ కెప్టెన్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) శనివారం సన్మాన కార్యక్రమం జరిగింది టీమ్ ఇండియా స్పిన్నర్ ఆర్ అశ్విన్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.

Ravichandran Ashwin: ధోనికి ఎల్లప్పుడు రుణపడి ఉంటా.. టీమిండియా స్పిన్నర్ అశ్విన్ ఎమోషనల్
Follow us
Balu Jajala

|

Updated on: Mar 17, 2024 | 11:41 AM

టీమిండియా స్పిన్నర్ అశ్విన్ మజీ కెప్టెన్ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించాడు. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) శనివారం సన్మాన కార్యక్రమం జరిగింది టీమ్ ఇండియా స్పిన్నర్ ఆర్ అశ్విన్ భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. టెస్ట్ క్రికెట్‌లో 500 వికెట్లు, భారతదేశం తరపున 100 మ్యాచ్‌లు ఆడిన అశ్విన్ అద్భుతమైన ఫీట్‌ అందుకోవడంతో TNCA సత్కరించింది. ఇటీవల స్వదేశంలో భారత్, ఇంగ్లండ్ మధ్య ముగిసిన 5 మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌లో అశ్విన్ ఈ సరికొత్త రికార్డులను సాధించాడు. అనిల్ కుంబ్లే తర్వాత టెస్టు క్రికెట్‌లో భారత్ తరఫున 500 వికెట్లు తీసిన 2వ భారత బౌలర్‌గా అశ్విన్ నిలిచాడు. అతను ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో 5 మ్యాచుల్లో కీలక వికెట్లు తీసి  ప్రధాన వికెట్ టేకర్‌గా నిలిచాడు. అయితే అశ్విన్ తన సత్కార కార్యక్రమంలో మాట్లాడుతున్నప్పుడు ధోని పేరును ప్రస్తావిస్తూ విజయానికి క్రెడిట్ ఇవ్వడం మర్చిపోలేదు.

2010లో భారత్‌కు అరంగేట్రం చేసే ముందు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (CSK) తరఫున ధోనీ ఆధ్వర్యంలో అశ్విన్ తన నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాడు. అయితే అశ్విన్‌కు మద్దతుగా నిలిచి అతని కెరీర్ కు గట్టి పునాది వేశాడు ధోనీ. ఈ సందర్భంగా తాను ధోనితో గడిపిన సమయాన్ని గుర్తుచేసుకుకున్నారు. ధోనీ నుండి అనేక విలువైన పాఠాలు నేర్చుకున్నానని, అతను మద్దతు ఇచ్చినందుకు మాజీ భారత కెప్టెన్‌కు తాను ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. 2008లో ప్రారంభమైన IPL సీజన్‌లో తాను బెంచ్‌పై పరిమితమయ్యానని వెల్లడించాడు. అయితే ధోని కారణంగా మళ్లీ క్రికెట్ కు దగ్గరయ్యాను అని అన్నారు.

“2008లో నేను ( డ్రెస్సింగ్ రూమ్‌లో) మాథ్యూ హేడెన్, ధోనీని కలిశాను. అయితే ముత్తయ్య మురళీధరన్ ఉన్న జట్టులో ఉండటంతో నేను ఆడటం సాధ్యపడలేదు. కానీ ఆ తర్వాత ధోనీ నాకు ఇచ్చిన అవకాశం జీవితాంతం రుణపడి ఉండేలా చేసిందంటూ ధోనిని గుర్తు చేసుకున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్‌తో ఐపీఎల్‌లో అశ్విన్ తన అత్యుత్తమ రోజులను ఆస్వాదించాడు. అతను ధోని ద్వారా కొత్త బంతితో అనేక సందర్భాల్లో క్రిస్ గేల్‌తో పోటీ పడ్డాడు. అనేక విజయాలను అందించాడు. అశ్విన్ 2008, 2015 మధ్య CSK తరపున 120 మ్యాచ్‌లు ఆడి 121 వికెట్లు తీశాడు.

'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
'దమ్ముంటే పట్టుకోరా షెకావత్'.. పుష్ప 2 క్రేజీ సాంగ్ వచ్చేసింది
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
ఏపీ ఫైబర్‌ నెట్‌లో 410 మంది ఉద్యోగుల తొలగింపు
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
వీటిని తిన్నారంటే ఎంత షుగర్ ఉన్నా కంట్రోల్ అవ్వాల్సిందే!
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
ఇదెక్కడి గుడ్డి స్టంట్‌రా బాబూ.. బైక్‌ ఇలా కూడా నడిపిస్తారా..?
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
కొత్త ఏడాది ఆ రాశుల వారికి అరుదైన దిగ్బల రాజయోగం..
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ షెడ్యూల్ వచ్చేసింది.. INDvsPAK మ్యాచ్ డేట్ ఇదే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
42 సెకన్ల పాటు మృత్యువుతో కలిసి ప్రయాణించారు..! వీడియో చూస్తే
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
జీఎస్టీ ఎఫెక్ట్​.. ఏ రేట్లు పెరగనున్నాయి.. ఏవి తగ్గనున్నాయి?
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
మధుమేహానికి చికిత్స ఎందుకు లేదు..? నిపుణులు ఏం చెబుతున్నారంటే..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..
శ్రీతేజ్‌ను పరామర్శించిన దిల్ రాజు.. బన్నీపై కేసు గురించి..