Champions Trophy 2025: టీమిండియా మ్యాచ్‌లన్నీ యూఏఈలోనే.. హైబ్రీడ్ మోడ్‌లోనే ఛాంపియన్స్ ట్రోఫీ
Champions Trophy 2025: గతేడాది కూడా పాకిస్థాన్‌కే ఆసియా కప్ ఆతిథ్యం లభించింది. అప్పుడు కూడా భారత్ అక్కడికి వెళ్లనప్పుడు 'హైబ్రిడ్ మోడల్'లో ఈ టోర్నీ జరిగింది. శ్రీలంకలో భారత్‌తో మ్యాచ్‌లు జరిగాయి. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
Champions Trophy 2025: ఛాంపియన్స్ ట్రోఫీ 2025 పాకిస్థాన్‌లో జరగనుంది. భారత్ ఇక్కడ మ్యాచ్ ఆడడంపై మళ్లీ సందేహం నెలకొంది. ఇంతలో, అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ICC) ఆసియా కప్ వంటి ‘హైబ్రిడ్ మోడల్’లో నిర్వహించవచ్చని ఒక మీడియా నివేదిక పేర్కొంది.
ఐసీసీ ఎగ్జిక్యూటివ్ బోర్డులో సమాచారం మేరకు.. భారత ప్రభుత్వం టీమ్‌ఇండియాను పాకిస్తాన్‌కు పంపకూడదనుకుంటే, ఐసీసీ అక్కడి బోర్డుపై ఒత్తిడి తీసుకురాదు. అందుకు ప్రత్యామ్నాయం వెతకాలి. ప్రస్తుతం ఐసీసీ బోర్డు సభ్యుల సమావేశం దుబాయ్‌లో జరుగుతోంది. ఈ అంశం సమావేశపు ఎజెండాలో చేర్చబడలేదు. అయితే, సమావేశం అక్కడే ఉన్న సభ్యులతో చర్చించవచ్చు అంటూ చెప్పుకొచ్చారు.
భారత్ అభ్యర్థన మేరకు శ్రీలంకలో ఆసియా కప్ మ్యాచ్‌లు..
గతేడాది కూడా పాకిస్థాన్‌కే ఆసియా కప్ ఆతిథ్యం లభించింది. అప్పుడు కూడా భారత్ అక్కడికి వెళ్లనప్పుడు ‘హైబ్రిడ్ మోడల్’లో ఈ టోర్నీ జరిగింది. శ్రీలంకలో భారత్‌తో మ్యాచ్‌లు జరిగాయి. కొలంబో వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో భారత జట్టు 10 వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించి ఛాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకుంది.
షా నుంచి హామీ పొందడానికి పాకిస్థాన్ బోర్డు ప్రయత్నిస్తుంది. ఛాంపియన్స్ ట్రోఫీపై చర్చలు ICC సమావేశం అజెండాలో లేవు. అయితే, కొత్తగా ఎన్నికైన PCB ఛైర్మన్ మొహ్సిన్ నఖ్వీ మాట్లాడుతూ, BCCI సెక్రటరీ జైషా, ICC ఉన్నతాధికారులతో తాను మాట్లాడతానని చెప్పారు.
టోర్నమెంట్ తేదీ దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే భారత బోర్డు నిర్ణయం తీసుకుంటుందని, అయితే, దీనిని యూఏఈలో నిర్వహించే అవకాశాన్ని తోసిపుచ్చలేమని ఐసీసీ బోర్డు సభ్యుడు చెప్పారు. ఇది ఆసియా కప్ వంటి ఉపఖండ టోర్నమెంట్ కాదని, గ్లోబల్ టోర్నమెంట్ అని కూడా మూలం తెలిపింది. అందువల్ల భారత ప్రభుత్వం మెతక వైఖరిని అవలంబించవచ్చు.
భారత బోర్డు అధ్యక్షుడు రోజర్ బిన్నీ, వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్లా ఆసియా కప్ సందర్భంగా పాకిస్థాన్ వెళ్లిన సంగతి తెలిసిందే.
టీం ఇండియా పాకిస్థాన్‌కు వెళ్లే ప్రశ్నపై బీసీసీఐ మాజీ అధికారి మాట్లాడుతూ.. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లేదా ఇంగ్లండ్‌లతో పోలిస్తే భారత క్రికెట్ జట్టు ప్రమాదంలో పడే అవకాశం ఎక్కువగా ఉందని మనం మర్చిపోకూడదని అన్నారు. నిజానికి ప్రస్తుతం భారత్, పాకిస్థాన్‌ల మధ్య సంబంధాలు బాగా లేవు. పాకిస్థాన్‌లో ఉన్న ఉగ్రవాదులు ఎప్పుడూ భారత్‌నే లక్ష్యంగా చేసుకుంటారు. ఇలాంటి పరిస్థితుల్లో పాకిస్థాన్‌లోని ఉగ్రవాదుల నుంచి భారత ఆటగాళ్లు ప్రమాదంలో పడే అవకాశం ఉంది.
పాకిస్థాన్‌లో శ్రీలంక క్రికెట్ జట్టుపై ఉగ్రదాడి జరిగింది. అయితే, ఈ దాడిలో ఏ ఆటగాడు లేదా సహాయక సిబ్బంది గాయపడలేదు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..