AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RCB కప్పు కొడితే DK విర్రవీగడం ఖాయం.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాసెర్ హుస్సేన్

2016 తర్వాత తొలిసారి ఐపీఎల్ ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ అభిమానుల ఆశలను మరింత పెంచింది. డీకే కోచ్‌గా ఉన్న తొలి సీజన్‌లోనే ఫైనల్ చేరడాన్ని నాసెర్ హుస్సేన్, అథర్టన్ సరదాగా స్పందిస్తూ, అతడి హవా గురించి జోకులు వేశారు. ఫైనల్‌లో ఆర్సీబీ ప్రత్యర్థి పంజాబ్ కింగ్స్ లేదా ముంబై ఇండియన్స్ అయి ఉండే అవకాశం ఉంది. జూన్ 3న అహ్మదాబాద్‌లో జరగనున్న టైటిల్ మ్యాచ్‌పై అంతా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

RCB కప్పు కొడితే DK విర్రవీగడం ఖాయం.. షాకింగ్ కామెంట్స్ చేసిన నాసెర్ హుస్సేన్
Dinesh Karthil Rcb
Narsimha
|

Updated on: May 31, 2025 | 9:35 PM

Share

ఐపీఎల్ చరిత్రలో ఇప్పటివరకు మూడు సార్లు ఫైనల్‌కి చేరినప్పటికీ ట్రోఫీ మాత్రం గెలవలేకపోయిన అరుదైన జట్లలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఒకటి. అయితే 2016 తర్వాత తొలిసారిగా ఐపీఎల్ ఫైనల్‌కి ఆర్సీబీ చేరింది. పంజాబ్ కింగ్స్‌పై క్వాలిఫైయర్ 1లో గెలుపుతో ఈ ఘనత సాధించింది. ఈ సీజన్‌లో అత్యుత్తమ జట్లలో ఒకటిగా రాణిస్తున్న ఆర్సీబీ, ఇప్పుడు తమ తొలి టైటిల్ గెలిచే అద్భుత అవకాశాన్ని అందిపుచ్చుకుంది.

డీకే అసహనంగా మారతాడన్న భయం! నాసెర్ హుస్సేన్

ఇంతవరకు అన్నీ బాగానే ఉన్నా, ఇంగ్లాండ్ మాజీ ఆటగాళ్లు నాసెర్ హుస్సేన్, మైకేల్ అథర్టన్ మాత్రం కొంత భయపడుతున్నారు. అది ఆర్సీబీ విజయం వల్ల కాదు.. డీకే అంటే దినేశ్ కార్తిక్ కారణంగా! ఆర్సీబీ ఫైనల్‌కి చేరింది. వాళ్లు గెలిస్తే డీకే అసహనానికి గురి చేస్తాడు. ఒక్క సీజన్ కోచ్/మెంటార్‌గా ఉన్నాడంటే చాలు.. ట్రోఫీ గెలుచేస్తాడు! అని నాసెర్ హాస్యంగా కామెంట్ చేశాడు. ఇది స్కై స్పోర్ట్స్ పోడ్‌కాస్ట్‌లో జరిగిన హాస్య సంభాషణలో భాగంగా జరిగింది.

డబుల్ డోస్ డీకే? అథర్టన్ సెటైర్

“అతను ఎప్పుడూ అసహనంగా ఉంటాడు. ఇప్పుడు అయితే రెట్టింపు అవుతాడు. ట్రోఫీ ప్రెజెంటేషన్ సమయంలో, జాన్ టెర్రీలా ముందు నిలబడి కోహ్లీతో పాటు ట్రోఫీ పట్టుకుంటాడు! అని మైకేల్ అథర్టన్ జోక్ వేశాడు. డీకే గతంలో వీరితో కలిసి ప్రసార బృందంలో పనిచేసిన నేపథ్యంలో, ఈ వ్యాఖ్యలు పూర్తి వినోదపూర్వకమైనవేనని చెప్పాలి.

ఇక ఐపీఎల్ 2025 ఫైనల్‌లో ఆర్సీబీ ఎవరిని ఎదుర్కొంటుందో తెలియాల్సి ఉంది. ఆదివారం జరుగనున్న క్వాలిఫైయర్ 2లో పంజాబ్ కింగ్స్ మరియు ముంబై ఇండియన్స్ తలపడతాయి. గెలిచిన జట్టు జూన్ 5న అహ్మదాబాద్‌లో జరిగే ఫైనల్‌లో ఆర్సీబీని ఛాలెంజ్ చేస్తుంది. పంజాబ్ కూడా ఇప్పటివరకు ఒక్కసారి కూడా ఐపీఎల్ టైటిల్ గెలవలేదు. అయితే ఈసారి పరిస్థితులు మారే అవకాశముంది! అందుకే ప్రతి ఒక్కరు RCB జట్టుపై ఫోకస్ చేశారు.

ఐపీఎల్ 2025 ఫైనల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ప్రవేశించడం అభిమానులకు గర్వకారణం. 2016 తర్వాత తొలిసారిగా ఫైనల్‌కు చేరిన ఆర్సీబీ, ఇప్పుడు తమ తొలి టైటిల్‌ను గెలవాలనే ఆశతో ఉంది. ఈ మ్యాచ్ జూన్ 3న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఫైనల్‌లో ఆర్సీబీని ఎదుర్కొనే జట్టు తేలాల్సి ఉంది పంజాబ్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ మధ్య జరగనున్న క్వాలిఫయర్ 2 (జూన్ 1) ఫలితంపై ఆధారపడి ఉంటుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..