World Cup 2023: 12 మ్యాచ్‌లు 12 సెంచరీలు.. 13వ ఎడిషన్‌లో శతకాల జోరు.. లిస్టులో భారత్ నుంచి ఒక్కడే..
Hundred in World Cup 2023: 13వ ఎడిషన్ వరల్డ్ కప్‌లో 12 మ్యాచ్‌లు జరిగాయి. నేడు 13వ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరుగుతోంది. కాగా, ఈ మొత్తం 12 మ్యాచ్‌ల్లో 12 సెంచరీలను అభిమానులు చూశారు. అక్టోబర్ 5న జరిగిన ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్‌లో రెండు సెంచరీలు వచ్చాయి. ఆ తర్వాత సెంచరీల జోరు కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో అక్టోబర్ 10న జరిగిన పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇది ODI ప్రపంచ కప్‌లో ఏదైనా ఒక మ్యాచ్‌లో అత్యధిక సెంచరీల రికార్డుగా నిలిచింది.

Hundred in World Cup 2023: ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 అక్టోబర్ 5న భారతదేశంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ ఎడిషన్ ప్రారంభ మ్యాచ్‌లలో అనేక అద్భుతమైన రికార్డులు నమోదయ్యాయి. అలాగే ఇప్పటివరకు ఈ ఎడిషన్‌లో వన్డే ప్రపంచ కప్‌లో భారీ స్కోరు, అత్యధిక పరుగుల ఛేజింగ్, వేగవంతమైన సెంచరీ, అత్యధిక సెంచరీలతో సహా అనేక భారీ రికార్డులను ఇప్పటికే చూశాం. ఈ సమయంలో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం చెలాయించడంతో బౌలర్లు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రస్తుత ప్రపంచ కప్‌లో కూడా అనేక అద్భుతమైన సెంచరీలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈ 2023 ప్రపంచకప్ ( World Cup 2023)లో సెంచరీ చేసిన బ్యాట్స్‌మెన్స్ జాబితాలో చాలామందే చేరారు. మరింత మంది చేరుతున్నారు.
13వ ఎడిషన్ వరల్డ్ కప్‌లో 12 మ్యాచ్‌లు జరిగాయి. నేడు 13వ మ్యాచ్ ఇంగ్లండ్ వర్సెస్ ఆఫ్ఘానిస్తాన్ మధ్య జరుగుతోంది. కాగా, ఈ మొత్తం 12 మ్యాచ్‌ల్లో 12 సెంచరీలను అభిమానులు చూశారు. అక్టోబర్ 5న జరిగిన ప్రస్తుత ఎడిషన్ తొలి మ్యాచ్‌లో రెండు సెంచరీలు వచ్చాయి. ఆ తర్వాత సెంచరీల జోరు కొనసాగుతూనే ఉంది. అదే సమయంలో అక్టోబర్ 10న జరిగిన పాకిస్తాన్ vs శ్రీలంక మ్యాచ్‌లో నాలుగు సెంచరీలు నమోదయ్యాయి. ఇది ODI ప్రపంచ కప్‌లో ఏదైనా ఒక మ్యాచ్‌లో అత్యధిక సెంచరీల రికార్డుగా నిలిచింది.
భారత్‌లో జరుగుతున్న ఐసీసీ ప్రపంచకప్‌లో తొలి సెంచరీ న్యూజిలాండ్ ఓపెనర్ డెవాన్ కాన్వే చేశాడు. తన ప్రపంచకప్ అరంగేట్రం మ్యాచ్‌లోనే ఇంగ్లండ్‌పై తుఫాన్ ఇన్నింగ్స్ ఆడి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అదే సమయంలో చివరి సెంచరీని దక్షిణాఫ్రికా వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్ క్వింటన్ డి కాక్ నమోదు చేశాడు. అతను ఆస్ట్రేలియాపై సెంచరీ ఇన్నింగ్స్ ఆడాడు. ప్రస్తుత ప్రపంచ కప్‌లో వరుసగా రెండో సెంచరీని సాధించాడు.
రాబోయే మ్యాచ్‌ల్లో మరెన్నో సెంచరీ ఇన్నింగ్స్‌లు చూడొచ్చు. ప్రస్తుతం ప్రపంచ కప్ 2023లో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్‌లందరి జాబితాను ఓసారి చూద్దాం..
ప్రపంచ కప్ 2023లో సెంచరీలు సాధించిన బ్యాట్స్‌మెన్ల జాబితా ఇదే..
| క్రమసంఖ్య | ఆటగాడు | జట్టు | ప్రత్యర్థి జట్టు | పరుగులు |
| 1 | డెవాన్ కాన్వే | న్యూజిలాండ్ | ఇంగ్లండ్ | 152* |
| 2 | రచిన్ రవీంద్ర | న్యూజిలాండ్ | ఇంగ్లండ్ | 123* |
| 3 | క్వింటన్ డి కాక్ | దక్షిణ ఆఫ్రికా | శ్రీలంక | 100 |
| 4 | రాస్సీ వాన్ డెర్ డ్యూసెన్ | దక్షిణ ఆఫ్రికా | శ్రీలంక | 108 |
| 5 | ఐడెన్ మార్క్రామ్ | దక్షిణ ఆఫ్రికా | శ్రీలంక | 106 |
| 6 | డేవిడ్ మలన్ | ఇంగ్లండ్ | బంగ్లాదేశ్ | 140 |
| 7 | కుసాల్ మెండిస్ | శ్రీలంక | పాకిస్తాన్ | 122 |
| 8 | సదీర సమరవిక్రమ | శ్రీలంక | పాకిస్తాన్ | 108 |
| 9 | అబ్దుల్లా షఫీక్ | పాకిస్తాన్ | శ్రీలంక | 113 |
| 10 | మహ్మద్ రిజ్వాన్ | పాకిస్తాన్ | శ్రీలంక | 131* |
| 11 | రోహిత్ శర్మ | భారతదేశం | ఆఫ్ఘనిస్తాన్ | 131 |
| 12 | క్వింటన్ డి కాక్ | దక్షిణ ఆఫ్రికా | ఆస్ట్రేలియా | 109 |
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




