IPL 2024: ఐపీఎల్‌కు ముందు లక్నోకు శుభవార్త.. సెంచరీలతో బౌలర్ల తాటతీస్తోన్న యంగ్ ప్లేయర్.. రాహుల్ టీం కప్ కొట్టినట్టే?

Devdutt Padikkal Records: గత 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేవదత్ పడికల్ అద్భుత ప్రదర్శన చేశాడు. గత 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేవదత్ పడికల్ వరుసగా 193, 42, 31, 103, 65, 21, 150 పరుగులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా దేవదత్ పడికల్ 3 సార్లు సెంచరీ మార్కును దాటాడు. ఇటీవల, ఐపీఎల్ వేలానికి ముందు, దేవదత్ పడికల్ లక్నో సూపర్ జెయింట్‌లో భాగమయ్యాడు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన దేవదత్ పడిక్కల్‌ను ట్రేడ్ చేసింది. దీనికి ముందు, దేవదత్ పడికల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు.

IPL 2024: ఐపీఎల్‌కు ముందు లక్నోకు శుభవార్త.. సెంచరీలతో బౌలర్ల తాటతీస్తోన్న యంగ్ ప్లేయర్.. రాహుల్ టీం కప్ కొట్టినట్టే?
Devdutt Padikkal
Follow us
Venkata Chari

|

Updated on: Feb 10, 2024 | 12:20 PM

Lucknow Super Giants Payer Devdutt Padikkal Stats and Records: ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో దేవదత్ పడిక్కల్ బ్యాట్ మండుతోంది. ప్రత్యర్థి బౌలర్లకు ఈ యువ బ్యాట్స్‌మెన్ సమస్యగా మారాడు. ముఖ్యంగా గత 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేవదత్ పడికల్ అద్భుత ప్రదర్శన చేశాడు. గత 6 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో దేవదత్ పడికల్ వరుసగా 193, 42, 31, 103, 65, 21, 150 పరుగులు చేసినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ విధంగా దేవదత్ పడికల్ 3 సార్లు సెంచరీ మార్కును దాటాడు.

ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ప్రకంపనలు సృష్టించిన దేవదత్ పడికల్..

పంజాబ్‌పై దేవదత్ పడికల్ 193 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఆ తర్వాత అతను గుజరాత్‌పై 42, 31 పరుగులు చేశాడు. మళ్లీ గోవాపై సెంచరీ మార్కును దాటాడు. గోవాపై దేవదత్ పడికల్ 103 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇంగ్లండ్ లయన్స్‌పై 105 పరుగులు చేశాడు. ఇంగ్లండ్ లయన్స్‌తో జరిగిన రెండో మ్యాచ్‌లో వరుసగా 65, 21 పరుగులు అందించాడు. కానీ, దేవదత్ పడికల్ బ్యాట్ ఇక్కడితో ఆగలేదు. ఇప్పుడు తమిళనాడుపై 150 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ విధంగా, దేవదత్ పడికల్ నిరంతరం ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌లలో భారీ స్కోర్లు చేస్తున్నాడని గణాంకాలు ధృవీకరిస్తున్నాయి.

లక్నో సూపర్ జెయింట్స్‌కు శుభవార్త..

ఇటీవల, ఐపీఎల్ వేలానికి ముందు, దేవదత్ పడికల్ లక్నో సూపర్ జెయింట్‌లో భాగమయ్యాడు. కేఎల్ రాహుల్ నేతృత్వంలోని లక్నో సూపర్ జెయింట్స్ రాజస్థాన్ రాయల్స్‌కు చెందిన దేవదత్ పడిక్కల్‌ను ట్రేడ్ చేసింది. దీనికి ముందు, దేవదత్ పడికల్ ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో భాగంగా ఉన్నాడు. అయితే ఐపీఎల్‌కు ముందు లక్నో సూపర్ జెయింట్‌కు శుభవార్త అందించాడు. ఐపీఎల్‌లో దేవదత్ పడికల్ తన అద్భుతమైన ఫామ్‌ను కొనసాగిస్తే, కేఎల్ రాహుల్ జట్టు పని మరింత సులువుగా మారుతుంది. అదే సమయంలో, దేవదత్ పడికల్ ప్రత్యర్థి జట్లకు సమస్యలను సృష్టించవచ్చు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..