AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులకు ఎంపికైన కోహ్లీ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?

Akash Deep Profile: ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 3 టెస్ట్ మ్యాచ్‌లకు ఆకాష్ దీప్ టీమ్ ఇండియాలో భాగమయ్యాడు. ఐపీఎల్‌లో బెంగళూరు జట్టుతోపాటు, దేశవాళీలో ఆకాష్ దీప్ రెస్ట్ ఆఫ్ ఇండియా, బెంగాల్‌కు ప్రాతినిధ్యం వహించాడు. ఆకాష్ దీప్ లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 24.50 సగటు, 30.4 స్ట్రైక్ రేట్‌తో 42 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, 41 T20 మ్యాచ్‌లలో, అతను 7.52 ఎకానమీ, 18.1 స్ట్రైక్ రేట్‌తో 48 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తన బాధితులుగా మార్చాడు. ఇటీవల ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడ్డాడు. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ లయన్స్ తో ఆడిన 3 మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీశాడు.

IND vs ENG: ఇంగ్లండ్‌తో చివరి 3 టెస్టులకు ఎంపికైన కోహ్లీ ఫ్రెండ్.. ఎవరో తెలుసా?
Akash Deep Virat Kohli
Venkata Chari
|

Updated on: Feb 10, 2024 | 12:59 PM

Share

IND vs ENG Test Series, Akash Deep Stats and Records: ఫిబ్రవరి 15 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ మధ్య మూడో టెస్టు జరగనుంది. రాజ్‌కోట్‌లో ఇరు జట్లు తలపడనున్నాయి. ప్రస్తుతం ఈ టెస్టు సిరీస్‌ 1-1తో సమంగా ఉంది. హైదరాబాద్ టెస్టులో బ్రిటీష్ జట్టు భారత్‌ను ఓడించింది. ఆ తర్వాత విశాఖపట్నంలో బెన్ స్టోక్స్ సారథ్యంలోని బ్రిటీష్‌ టీంపై టీమిండియా ఘన విజయం సాధించింది. అయితే, ఇంగ్లండ్‌తో జరిగిన చివరి 3 టెస్ట్ మ్యాచ్‌లకు ఆకాష్ దీప్‌ను టీమ్ ఇండియాలో భాగంగా తీసుకున్నారు. అంటే, ఇంగ్లండ్‌తో జరగనున్న మిగిలిన 3 టెస్టు మ్యాచ్‌లలో టీమ్ ఇండియా ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆకాష్ దీప్ కూడా భాగం కావచ్చని తెలుస్తోంది.

ఐపీఎల్‌లో ఆకాశ్ దీప్..

IPLలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో పాటు, ఆకాష్ దీప్ రెస్ట్ ఆఫ్ ఇండియా, బెంగాల్ దేశవాళీ క్రికెట్‌కు ప్రాతినిధ్యం వహించాడు. 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో ఆకాశ్ దీప్ 3.04 ఎకానమీ, 23.18 సగటుతో 103 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తన బాధితులుగా మార్చాడని గణాంకాలు చెబుతున్నాయి. ఒక ఇన్నింగ్స్‌లో 5 వికెట్లు తీసిన ఫీట్‌ను ఈ యువ బౌలర్ 4 సార్లు సాధించాడు. కాగా, ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు తీసిన ఘనత ఒక్కసారి మాత్రమే తన పేరులో చేరింది. ఇది కాకుండా, ఆకాష్ దీప్ 28 లిస్ట్-ఏ మ్యాచ్‌లు ఆడాడు.

ఆకాష్ దీప్ కెరీర్..

ఆకాష్ దీప్ లిస్ట్-ఏ మ్యాచ్‌లలో 24.50 సగటు, 30.4 స్ట్రైక్ రేట్‌తో 42 వికెట్లు తీశాడు. ఇది కాకుండా, 41 T20 మ్యాచ్‌లలో, అతను 7.52 ఎకానమీ, 18.1 స్ట్రైక్ రేట్‌తో 48 మంది ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లను తన బాధితులుగా మార్చాడు. ఇటీవల ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ లయన్స్‌తో తలపడ్డాడు. ఆకాశ్ దీప్ ఇంగ్లండ్ లయన్స్ తో ఆడిన 3 మ్యాచ్ ల్లో 13 వికెట్లు తీశాడు. అయితే, ఇంగ్లండ్‌తో జరిగే ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆకాశ్ దీప్ చోటు దక్కించుకుంటాడా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.

చివరి మూడు టెస్టులకు భారత జట్టు..

రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభమన్ గిల్, కెఎల్ రాహుల్*, రజత్ పటీదార్, సర్ఫరాజ్ ఖాన్, ధ్రువ్ జురెల్ (కీపర్), కెఎస్ భరత్ (కీపర్), ఆర్ అశ్విన్, రవీంద్ర జడేజా*, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ముఖేష్ కుమార్, ఆకాష్ దీప్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..