AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

DC vs LSG Score: మరోసారి అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయ లక్ష్యం ఎంతంటే..

Delhi Capitals vs Lucknow Super Giants Score: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసి ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉందచింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (77), దీపక్‌ హుడా (52) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు...

DC vs LSG Score: మరోసారి అదరగొట్టిన కేఎల్‌ రాహుల్‌.. ఢిల్లీ క్యాపిటల్స్‌ విజయ లక్ష్యం ఎంతంటే..
Narender Vaitla
|

Updated on: May 01, 2022 | 5:39 PM

Share

Delhi Capitals vs Lucknow Super Giants Score: టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ తీసుకున్న లక్నో సూపర్ జెయింట్స్‌ రాణించింది. నిర్ణీత 20 ఓవర్లలో 195 పరుగులు చేసి ఢిల్లీ ముందు భారీ లక్ష్యాన్ని ఉందచింది. కెప్టెన్‌ కేఎల్‌ రాహుల్‌ (77), దీపక్‌ హుడా (52) హాఫ్‌ సెంచరీలతో చెలరేగారు. రాహుల్‌, దీపక్‌ హుడాలు కేవలం 61 బంతుల్లోనే 95 పరగులు సాధించి జట్టు స్కోర్ పెంచడంలో కీలక పాత్ర పోషించారు. తర్వాత ఓపెన్‌ డికాక్‌ 23 పరుగులు సాధించాడు. అయితే రాహుల్‌ అవుట్ అయిన తర్వాత స్కోర్‌ బోర్డ్‌ కాస్త నెమ్మదించింది. రాహుల్‌ క్రీజులో కొనసాగి ఉంటే స్కోర్‌ బోర్డ్‌ ఇంకా పెరిగి ఉండేది.

ఇక ఢిల్లీ క్యాపిటల్స్‌ బౌలింగ్ విషయానికొస్తే.. లక్నో సూపర్ జెయింట్స్‌ కోల్పోయిన మూడు వికెట్లను శార్దూల్‌ ఠాకూర్‌ ఒక్కడే తీసుకోవడం గమనార్హం. 4 ఓవర్లు వేసిన శార్దూల్‌ 40 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. ఇక మిగతా బౌలర్లు అంతా తేలి పోయారు. ఒక్క వికెట్‌ను కూడా తీసుకోలేకపోయారు. మరి లక్నో ఇచ్చిన 196 పరుగుల లక్ష్యాన్ని ఢిల్లీ ఛేదిస్తుందో లేదో చూడాలి.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం క్లిక్ చేయండి..

Also Read: TS Congress: రణ రంగంగా మారిన ఉస్మానియా.. రాహుల్ పర్యటనకు అనుమతి ఇవ్వాలంటూ ఆందోళన..

IPL 2022: ఔటివ్వలేదని అంపైర్‌పై అలిగిన చాహల్‌.. సూర్యకుమార్‌ ఎలా బుజ్జగించాడో మీరే చూడండి..

Summer Tips: మండుటెండల్లో బయటకు వెళ్తున్నారా..? ఈ 5 విషయాలను తప్పనిసరిగా గుర్తుంచుకోండి..