మరోసారి తెలుగులో వార్నర్ పోస్ట్.. ‘గుండెల్ని పిండేశావ్.. డేవిడ్ భాయ్’ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..

మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాదు.. కెమెరా ముందుకొచ్చి డైలాగులు చెప్పడంలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు ఆస్ట్రేలియా..

మరోసారి తెలుగులో వార్నర్ పోస్ట్.. 'గుండెల్ని పిండేశావ్.. డేవిడ్ భాయ్' అంటూ ఫ్యాన్స్ కామెంట్స్..
David Warner

మైదానంలో సిక్సర్ల వర్షం కురిపించడమే కాదు.. కెమెరా ముందుకొచ్చి డైలాగులు చెప్పడంలోనూ తనకు తిరుగులేదని నిరూపించాడు ఆస్ట్రేలియా విధ్వంసకర ఓపెనర్ డేవిడ్ వార్నర్. ఐపీఎల్‌లో సన్‌రైజర్స్ టీమ్‌కు కెప్టెన్‌గా వ్యవహరించిన వార్నర్‌కు తెలుగు అభిమానులు ఎంతోమంది ఉన్నారు. ‘బాహుబలి’ నుంచి ‘పోకిరి’ వరకు అన్ని సినిమాలను కవర్ చేసిన డేవిడ్ భాయ్.. తన ఇన్‌స్టాగ్రామ్‌ వీడియోలతో తెలుగు వారికి ఎంతగానో దగ్గరయ్యాడు. ఇక తాజాగా వార్నర్ తెలుగుపై ఉన్న అభిమానాన్ని మరోసారి చాటుకున్నాడు.

”నా రెండో ఇల్లు ఇండియా.. ఇంకా భారతదేశంలో నాకు నచ్చిన ప్రదేశం హైదరాబాద్” అంటూ వార్నర్ ఇన్‌స్టాలో పోస్ట్‌ పెట్టాడు. ఇక ఈ మెసేజ్‌‌లో భారతదేశం, హైదరాబాద్‌ పేర్లను అచ్చ తెలుగులో రాశాడు. ఈ పోస్ట్ చూసిన నెటిజన్లు ఫిదా అయిపోయారు. ‘గుండెల్ని పిండేశావ్’ డేవిడ్ భాయ్ అంటూ ఓ అభిమాని కామెంట్ చేస్తే.. మరొకరు ‘హైదరాబాద్ హార్ట్ బీట్ డేవిడ్ భాయ్’ అంటూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఇలా అభిమానులందరూ కూడా వార్నర్ పోస్టుపై కామెంట్స్‌తో హోరెత్తించారు. కాగా, ఈ ఏడాది వరుస వైఫల్యాలు ఎదుర్కున్న సన్‌రైజర్స్ జట్టు డేవిడ్ వార్నర్‌ను కెప్టెన్సీ నుంచి తప్పించి కేన్ విలియమ్సన్‌కు పగ్గాలు అప్పజెప్పిన సంగతి తెలిసిందే.

Also Read:

గంగా నదిలో కొట్టుకొచ్చిన చెక్కపెట్టె.. అందులో ఎర్రని వస్త్రంలో చిన్నారి.! ఎక్కడ నుంచి వచ్చిందంటే.!

మీ బ్యాంక్ ఖాతాలోకి ఎల్‌పీజీ సబ్సిడీ డబ్బు రాలేదా.? ఫిర్యాదు చేయండిలా.! వివరాలివే..

 పీఎఫ్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఆ సౌకర్యాన్ని ఉద్యోగం కోల్పోయినా పొందొచ్చు.!

కర్ఫ్యూపై సీఎం వైఎస్ జగన్ సంకేతాలు.. జూన్ 20 నుంచి మరిన్ని సడలింపులు..!

 

View this post on Instagram

 

A post shared by David Warner (@davidwarner31)

Click on your DTH Provider to Add TV9 Telugu