WTC Final 2021 IND vs NZ: డబ్ల్యూటీసీ ఫైనల్ కు అంతా సిద్ధం..! లైవ్ అందించే ఛానల్స్ ఇవే..!
WTC Final 2021 IND vs NZ Live Streaming: భారత్, న్యూజిలాండ్ టీంల మధ్య శుక్రవారం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు తెరలేవనుంది.
WTC Final 2021 India vs New Zealand live streaming: భారత్, న్యూజిలాండ్ టీంల మధ్య శుక్రవారం ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్ ఫైనల్‌కు అంతా సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఐదు రోజుల టెస్ట్ మ్యాచ్‌కు తెరలేవనుంది. క్రికెట్ ప్రపంచమంతా ఎంతో ఆసక్తిగా ఈ ఫైనల్ కోసం ఎదురుచూస్తోంది. తొలిసారి ఐసీసీ ట్రోఫీ అందుకోవాలని న్యూజిలాండ్ టీం ఆరాటపడుతుండగా.. అరంగేట్ర డబ్ల్యూటీసీ ఫైనల్ ట్రోఫీని అందుకోవాలని కోహ్లీ సేన ఉవ్విళ్లూరుతోంది. ఇరు జట్లు బలంగానే కనిపిస్తుండడంతో… డబ్ల్యూటీసీలో పోరు రసవత్తరంగా సాగనుందనడంలో సందేహం లేదు. ఇప్పటికే ఈ మ్యాచ్ లో గెలిచేందుకు ఇరుజట్లు సర్వశస్త్రాలను సిద్ధం చేసుకున్నాయి. విజయం ఎవరిని వరించనుందోనని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా, ఐసీసీ ఈవెంట్లలో న్యూజిలాండ్ జట్టుపై ఇప్పటి వరకు భారత్ విజయం సాధించలేదు. ఛాంపియన్‌షిప్ టోర్నీలో ఆడిన రెండు టెస్టు మ్యాచుల్లో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. మరి ఈ మ్యాచ్‌లో ఏం జరగనుందో చూడాలి.
వేదిక: ఐసీసీ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ సౌథాంప్టన్‌లోని ది రోస్ బౌల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది.
టైం: డబ్ల్యూటీసీ ఫైనల్ మనదేశం కాలమాన ప్రకారం మధ్యాహ్నం గం. 3.30 నిమిషాలకు ప్రారంభంకానుంది.
ప్రత్యక్ష ప్రసారం.. డబ్ల్యూటీసీ ఫైనల్ ను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. స్టార్ స్పోర్ట్స్ 1 ఇంగ్లీష్‌లో ప్రసారం చేయనుండగా, స్టార్ స్పోర్ట్స్ 1 హెచ్‌డీ ఛానల్ హిందీ, స్టార్ స్పోర్ట్స్ 1 కూడా హిందీ లో ప్రసారం చేయనున్నాయి. అలాగే లోకల్ భాషల్లో స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ స్పోర్ట్స్ 1 తమిళం, స్టార్ స్పోర్ట్స్ 1 కన్నడంలో ప్రత్యక్ష ప్రసారాలను అందించనున్నాయి. అయితే టెస్టు మ్యాచ్‌ను లోకల్ భాషల్లో తొలిసారి ప్రసారం చేయనుండడం విశేషం. డిజిటల్ ప్రసారాలను డిస్నీ హాట్‌స్టార్ అందిచనుంది.
టీంల వివరాలు: భారత్: విరాట్ కోహ్లీ (కెప్టెన్), రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్, చెతేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రిషభ్ పంత్ (కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా (కీపర్)
న్యూజిలాండ్: కేన్ విలియమ్సన్ (కెప్టెన్), టామ్ బ్లండెల్, ట్రెంట్ బౌల్ట్, డేవాన్ కాన్వే, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, మ్యాట్ హెన్రీ, కైల్ జేమీసన్, టామ్ లేథమ్, హెన్రీ నికోల్స్, అజాజ్ పటేల్, టిమ్ సౌథీ, రాస్ టేలర్, నీల్ వాగ్నర్, బీజే వాట్లింగ్, విల్ యంగ్
Also Read:
WTC Finals: డబ్ల్యూటీసీ ఫైనల్స్‌లో టీమిండియా ప్లేయింగ్ ఎలెవన్ ఇదే.. జట్టులో ఇద్దరు స్పిన్నర్లు.!