T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ వేదికలు ఫిక్స్.. అమెరికాలో మూడు.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?

ICC T20 World Cup 2024: ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో భాగంగా ట్రోఫీ కోసం 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ మేరకు మూడు USA వేదికలను ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం" అంటూ చెప్పుకొచ్చారు. USA వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్కెట్. ఈ వేదికలు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మార్కెట్‌లో ఒక ప్రకటన చేయడానికి మాకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

T20 World Cup 2024: టీ20 ప్రపంచ కప్ వేదికలు ఫిక్స్.. అమెరికాలో మూడు.. వాటి స్పెషాలిటీ ఏంటో తెలుసా?
Icc Men's T20 World Cup 2023
Image Credit source: ICC

Updated on: Sep 20, 2023 | 4:55 PM

ICC T20 World Cup 2024: ICC పురుషుల T20 ప్రపంచ కప్ 2024 కి ఆతిథ్యం ఇవ్వడానికి USA లోని మూడు వేదికలుగా డల్లాస్, ఫ్లోరిడా, న్యూయార్క్‌లను అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ ( ICC) బుధవారం ధృవీకరించింది. డల్లాస్‌లోని గ్రాండ్ ప్రైరీ, ఫ్లోరిడాలోని బ్రోవార్డ్ కౌంటీ, న్యూయార్క్‌లోని నాసావు కౌంటీలలో వచ్చే ఏడాది ఈవెంట్‌ను నిర్వహించనున్నారు.

ICC బోర్డ్ నవంబర్ 2021లో వెస్టిండీస్, USA లకు సంయుక్తంగా ఈవెంట్‌ని హోస్ట్ చేసేందుకు అవకాశం ఇచ్చింది. అనేక ఎంపికల తర్వాత వేదికలను ఫిక్స్ చేశారు. న్యూయార్క్‌లోని ఐసెన్‌హోవర్ పార్క్‌లో కొత్త 34,000-సీట్ల స్టేడియం నిర్మించనుండగా, డల్లాస్, ఫ్లోరిడాల్లో ప్రస్తుత నిర్మాణాలలో సీట్ల సంఖ్యను విస్తరించే పనిలో నిమగ్నమయ్యాయి.

ఇవి కూడా చదవండి

ఇంతకు ముందు నిర్వహించని దేశంలో..

ICC చీఫ్ ఎగ్జిక్యూటివ్ జియోఫ్ అల్లార్డిస్ మాట్లాడుతూ.. “ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ICC పురుషుల T20 ప్రపంచ కప్‌లో భాగంగా ట్రోఫీ కోసం 20 జట్లు పోటీపడుతున్నాయి. ఈ మేరకు మూడు USA వేదికలను ప్రకటించినందుకు మేం సంతోషిస్తున్నాం” అంటూ చెప్పుకొచ్చారు.

USA వ్యూహాత్మకంగా ముఖ్యమైన మార్కెట్. ఈ వేదికలు ప్రపంచంలోనే అతిపెద్ద క్రీడా మార్కెట్‌లో ఒక ప్రకటన చేయడానికి మాకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తాయని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.

“ఇంతకుముందు ICC గ్లోబల్ ఈవెంట్‌ను నిర్వహించని ప్రదేశంలో ప్రపంచ స్థాయి క్రికెట్‌ను ప్రదర్శించడానికి మాడ్యులర్ స్టేడియం సాంకేతికతను ఉపయోగించే అవకాశం ఉంది. ఇది USA క్రికెట్ అభిమానులకు ప్రపంచంలోని అత్యుత్తమ ఆటలను వారి ఇంటి గుమ్మంలో చూసే అవకాశాన్ని కల్పిస్తుంది” అని అన్నారు.

USA చుట్టూ ఉన్న అనేక ఇతర వేదికలు, వాషింగ్టన్‌లోని జార్జ్ మాసన్ విశ్వవిద్యాలయం కూడా ప్రీ-ఈవెంట్ మ్యాచ్‌లు, శిక్షణ కోసం వేదికలుగా గుర్తించారు.

వన్డే వరల్డ్ కప్ 2023 విశేషాలు..

కాగా, ప్రస్తుతం వన్డే వరల్డ్ 2023 నిర్వహణలో ఐసీసీ బిజీగా మారింది. భారత్ వేదికగా జరగబోయే ఈ మహా సంగ్రామానికి అంతా సిద్ధమైంది. ఇప్పటికే అన్ని జట్లు పూర్తి సన్నద్దతతో రెడీగా ఉన్నాయి. అన్ని జట్లు తమ స్వ్కాడ్‌లను ప్రకటించాయి. ఈ ప్రపంచకప్ కోసం 10 స్టేడియాలను బీసీసీఐ ప్రకటించింది. తొలి మ్యాచ్‌లో భాగంగా ఇంగ్లండ్, న్యూజిలాండ్ జట్లు తలపడనున్ాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..