IND vs PAK: పాక్‌ను భయపెట్టిన టీమిండియా బెస్ట్ ఫీల్డర్ అతనే.. మూడో బంగారు పతకం అందుకున్నదెవరంటే? వీడియో చూస్తే నవ్వులే..
Team India: ఆ తర్వాత, అతను రవీంద్ర జడేజాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా అభివర్ణించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని వేగం, కచ్చితత్వాన్ని ప్రశంసించాడు. దిలీప్ వికెట్ కీపింగ్ గురించి కూడా మాట్లాడాడు. ఆ సమయంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను ప్రశంసించాడు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ కూడా తన అద్భుత ఇన్నింగ్స్‌కు ప్రశంసలు అందుకున్నాడు.

ICC World Cup 2023: ప్రపంచకప్ 2023లో భారత జట్టు డ్రెస్సింగ్ రూమ్‌లో ప్రత్యేక ట్రెండ్ మొదలైంది. మ్యాచ్ ముగిసిన తర్వాత, డ్రెస్సింగ్ రూమ్‌లోని ఆటగాళ్లందరి సమక్షంలో, మ్యాచ్ సమయంలో అత్యుత్తమ ఫీల్డింగ్ చేసిన ఆటగాడిని ‘ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపిక చేసి పతకంతో సత్కరిస్తున్నారు. ఇండియా వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ తర్వాత కూడా ఈ ధోరణి కనిపించింది. ఈసారి వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ బంగారు పతకాన్ని దక్కించుకున్నాడు.
ఈమేరకు శార్దూల్ ఠాకూర్ ఈ పతకాన్ని రాహుల్‌కు అందించాడు. ఈ సమయంలో, భారత ఆటగాళ్లందరూ చాలా సరదాగా కనిపించారు. బిగ్గరగా అరుస్తూ నినాదాలు చేశారు. ఈ మొత్తం వేడుక వీడియోను బీసీసీఐ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది.
వీడియో ప్రారంభంలో, ఫీల్డింగ్ కోచ్ టి దిలీప్ ఫీల్డింగ్ గురించి ప్రస్తావించాడు. అలాగే బౌలింగ్ విభాగంలో మహ్మద్ సిరాజ్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రాలను ప్రత్యేకంగా ప్రస్తావించాడు.
ఆ తర్వాత, అతను రవీంద్ర జడేజాను ప్రపంచంలోనే అత్యుత్తమ ఫీల్డర్‌గా అభివర్ణించాడు. పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో అతని వేగం, కచ్చితత్వాన్ని ప్రశంసించాడు. దిలీప్ వికెట్ కీపింగ్ గురించి కూడా మాట్లాడాడు. ఆ సమయంలో అతను ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించి, భారత వికెట్ కీపర్ కేఎల్ రాహుల్‌ను ప్రశంసించాడు. అదే సమయంలో శ్రేయాస్ అయ్యర్ కూడా తన అద్భుత ఇన్నింగ్స్‌కు ప్రశంసలు అందుకున్నాడు.
పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో బెస్ట్ ఫీల్డర్‌గా కేఎల్ రాహుల్..
చివరికి, టీవీలో విజేతను ప్రకటించారు. కేఎల్ రాహుల్ వికెట్ కీపింగ్ క్లిప్ చూపించడంతో, విరాట్ కోహ్లితో సహా ఇతర ఆటగాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. ఫీల్డర్ ఆఫ్ ది మ్యాచ్ రాహుల్‌కి శార్దూల్ ఠాకూర్ బంగారు పతకాన్ని అందించాడు. మిగతా ఆటగాళ్లందరూ ఈ సందర్భంగా కేఎల్ రాహుల్‌ను అభినందించారు.
వీడియోను చూడండి:
View this post on Instagram
పాక్ బ్యాట్స్‌మెన్ ఇమామ్-ఉల్-హక్ (36)ను కేఎల్ రాహుల్ ఎడమవైపు డైవ్ చేయడం ద్వారా మంచి క్యాచ్ తీసుకున్నాడు.
భారత్ (ప్లేయింగ్ XI): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(కీపర్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.
పాకిస్థాన్ (ప్లేయింగ్ XI): అబ్దుల్లా షఫీక్, ఇమామ్-ఉల్-హక్, బాబర్ ఆజం(కెప్టెన్), మహ్మద్ రిజ్వాన్(కీపర్), సౌద్ షకీల్, ఇఫ్తీకర్ అహ్మద్, షాదాబ్ ఖాన్, మహ్మద్ నవాజ్, హసన్ అలీ, షాహీన్ అఫ్రిది, హరీస్ రవూఫ్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..