AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

World cup 2023: కేవలం 4 రోజులే.. టీమిండియా సెమీ ఫైనల్‌ చేరే లెక్కలు ఇవే..

Team India CWC 2023 Semi Final: ప్రపంచకప్-2023లో టీమిండియా అద్భుత ఫామ్‌లో ఉంది. టోర్నీలో రోహిత్ సేన ఇప్పటి వరకు 3 మ్యాచ్‌లు ఆడి అన్నింటిలో విజయం సాధించింది. పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. రోహిత్ శర్మ అద్భుత ఫామ్‌లో ఉండడమే పెద్ద విషయం. భారత కెప్టెన్ ఒక సెంచరీ, ఒక అర్ధ సెంచరీ సాధించాడు. పాకిస్థాన్‌పై 86 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

World cup 2023: కేవలం 4 రోజులే.. టీమిండియా సెమీ ఫైనల్‌ చేరే లెక్కలు ఇవే..
Team India
Venkata Chari
|

Updated on: Oct 15, 2023 | 3:56 PM

Share

Team India CWC 2023 Semi Final: ప్రపంచకప్-2023లో భారత క్రికెట్ జట్టు అద్భుతమైన ఫామ్ కొనసాగుతోంది. శనివారం అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌పై విజయం సాధించింది. ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌పై టీమిండియాకు ఇది 8వ విజయం. 1992లో టీమిండియా విజయాల పరంపర మొదలైంది. ప్రపంచకప్-2023లో టీమిండియాకు ఇది మూడో విజయం. పాయింట్ల పట్టికలో 6 పాయింట్లతో అగ్రస్థానంలో ఉంది. రోహిత్ సేన గత మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, ఆఫ్ఘనిస్థాన్‌లను ఓడించింది.

టీమ్ ఇండియా ఫామ్ చూస్తుంటే సెమీఫైనల్ చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ప్రస్తుతం భారత జట్టు ఏ ఒక్క ఆటగాడిపైనా ఆధారపడదు. ఆటగాళ్లందరూ తమ వంతు సహాయం చేస్తున్నారు. బౌలింగ్‌లో జస్ప్రీత్ బుమ్రా నుంచి కుల్దీప్ యాదవ్ వరకు ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌లకు దడ పుట్టిస్తు్న్నారు. బ్యాటింగ్‌లో రోహిత్ శర్మ ముందుండి నడిపిస్తున్నాడు. మొదట ఆఫ్ఘనిస్తాన్‌పై సెంచరీ చేసిన అతను ఇప్పుడు పాకిస్తాన్‌పై తుఫాను ఫిఫ్టీని సాధించాడు.

ఇవి కూడా చదవండి

లీగ్ దశలో టీమిండియా మరో 6 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. రోహిత్ సేన తదుపరి మ్యాచ్ అక్టోబర్ 19న బంగ్లాదేశ్‌తో జరుగుతుంది. అక్టోబర్ 22న ధర్మశాలలో న్యూజిలాండ్‌తో, 29న ఇంగ్లండ్‌తో తలపడనుంది. ఆ తర్వాత నవంబర్ 2న టీమిండియా మ్యాచ్ జరగనుంది. నవంబర్ 5, 11 తేదీల్లో రోహిత్ జట్టు తన లీగ్ దశలో దక్షిణాఫ్రికాతో తన చివరి మ్యాచ్ ఆడనుంది.

అయితే, టీమ్ ఇండియా తన ఫామ్‌ను కొనసాగిస్తే నవంబర్ 2న సెమీస్ బెర్త్‌ను ఖాయం చేసుకుంటుంది. అక్టోబర్ 19, 22 అక్టోబర్, 29 అక్టోబర్, నవంబర్ 2 తేదీల్లో రోహిత్ విజయాలను నమోదు చేస్తే, అది ఫైనల్ 4కు చేరుకుంటుంది. టీమ్ ఇండియా ఫామ్ చూస్తుంటే ఇది కూడా సాధ్యమే అనిపిస్తోంది.

ప్రపంచకప్‌లో సెమీ ఫైనల్ మ్యాచ్‌లు నవంబర్ 15, 16 తేదీల్లో జరగనున్నాయి. నవంబర్ 19న ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.

రోహిత్ ఏం చెప్పాడంటే?

పాకిస్థాన్‌పై విజయం సాధించిన అనంతరం భారత కెప్టెన్ రోహిత్ శర్మ మాట్లాడుతూ.. బౌలర్లే మా విజయానికి పునాది వేశారు. 190 పరుగులకే పాక్‌ను ఆలౌట్ చేయండం పెద్ద విషయం. ఈ పిచ్ 190 కాదు. ఓ దశలో 280 లేదా 290 పరుగులు చేస్తారని అనిపించినా మ్యాచ్‌ని గెలిపించే సత్తా ఉన్న ఆరుగురు బౌలర్లు మా వద్ద ఉన్నారు’ అంటూ తెలిపాడు.

ఈ విజయంతో మనం పెద్దగా రెచ్చిపోకూడదని రోహిత్ చెప్పుకొచ్చాడు. ఇది సుదీర్ఘ టోర్నీ. తొమ్మిది లీగ్ మ్యాచ్‌లు, ఆపై సెమీ-ఫైనల్, ఫైనల్. సమతుల్యతను కాపాడుకుంటూ ముందుకు సాగాలి. ఏ జట్టు ఎవరినైనా ఓడించగలదు. మ్యాచ్ రోజు మనం బాగా ఆడాలి. గతం, భవిష్యత్తు పట్టింపు లేదంటూ రోహిత్ ప్రకటించాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..