ENG vs AFG: టాస్ గెలిచిన ఇంగ్లండ్‌కు షాకిస్తోన్న ఆఫ్ఘనిస్తాన్.. ఇరుజట్లలో కీలక మార్పులు?
ICC Cricket World Cup 2023: ఓవరాల్ హెడ్-టు-హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొత్తం 2 ODIలు జరిగాయి. రెండింట్లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌లు 2015, 2019 ప్రపంచకప్‌లలో జరిగాయి. ఇది కాకుండా ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డే సిరీస్ జరగలేదు.

ICC Cricket World Cup 2023, ENG vs AFG: వన్డే ప్రపంచకప్ 2023లో ఈరోజు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్థాన్ మధ్య మ్యాచ్ జరుగుతోంది. ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో ఈ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన ఇంగ్లండ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ఆఫ్ఘనిస్థాన్ 11 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 86 పరుగులు చేసింది. రహ్మానుల్లా గుర్బాజ్, ఇబ్రహీం జద్రాన్ క్రీజులో ఉన్నారు. వీరిద్దరి మధ్య అర్ధ సెంచరీ భాగస్వామ్యం ఉంది.
రెండు జట్ల ప్లేయింగ్-11:
ఇంగ్లండ్: జోస్ బట్లర్ (కెప్టెన్, వికెట్ కీపర్), జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, జో రూట్, హ్యారీ బ్రూక్, లియామ్ లివింగ్‌స్టన్, మోయిన్ అలీ, సామ్ కర్రాన్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, రీస్ టోప్లీ, ఆదిల్ రషీద్.
ఆఫ్ఘనిస్థాన్: హష్మతుల్లా షాహిదీ (కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), ఇబ్రహీం జద్రాన్, రహమత్ షా, మహ్మద్ నబీ, అజ్మతుల్లా ఒమర్జాయ్, ఇక్రమ్ అలీఖిల్, రషీద్ ఖాన్, ముజీబ్ ఉర్ రెహ్మాన్, నవీన్-ఉల్-హక్, ఫజల్హా.
ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్..
View this post on Instagram
ఈ ప్రపంచకప్‌లో ఇరు జట్లకు ఇది మూడో మ్యాచ్. ప్రస్తుత ప్రపంచ ఛాంపియన్ ఇంగ్లండ్ తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో ఓడిపోగా, రెండో మ్యాచ్‌లో ఆ జట్టు బంగ్లాదేశ్‌ను ఓడించింది. బంగ్లాదేశ్, భారత్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల్లోనూ ఆఫ్ఘనిస్థాన్ ఓటమి చవిచూసింది.
హెడ్-టు-హెడ్ రికార్డులు:
ఓవరాల్ హెడ్-టు-హెడ్ గురించి మాట్లాడుకుంటే, ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆఫ్ఘనిస్తాన్ మధ్య మొత్తం 2 ODIలు జరిగాయి. రెండింట్లో ఇంగ్లండ్ గెలిచింది. ఈ రెండు మ్యాచ్‌లు 2015, 2019 ప్రపంచకప్‌లలో జరిగాయి. ఇది కాకుండా ఇరు జట్ల మధ్య ఎలాంటి వన్డే సిరీస్ జరగలేదు.
View this post on Instagram
ఇంగ్లండ్: గత 5 మ్యాచ్‌ల్లో 4 గెలిచిన ఇంగ్లండ్ జట్టు ఒక్కటి మాత్రమే ఓడిపోయింది.
ఆఫ్ఘనిస్తాన్: గత 7 మ్యాచ్‌ల్లో ఆఫ్ఘాన్ జట్టు వరుస పరాజయాలను చవిచూసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..