AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Team India: ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన.. కట్‌చేస్తే.. వన్డే, టెస్ట్‌లకు ధోని శిష్యుడు గుడ్‌ బై..?

Chennai Super Kings: ఐపీఎల్ 2025లో ధోని సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ దారుణంగా విఫలమైంది. ఇప్పటి వరకు 11 మ్యాచ్‌లు ఆడిన చెన్నై జట్టు కేవలం 2 మ్యాచ్‌ల్లోనే విజయం సాధించింది. 9 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. దీంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకుంది.

Team India: ఐపీఎల్‌లో చెత్త ప్రదర్శన.. కట్‌చేస్తే.. వన్డే, టెస్ట్‌లకు ధోని శిష్యుడు గుడ్‌ బై..?
Team India
Venkata Chari
|

Updated on: May 05, 2025 | 1:46 PM

Share

MS Dhoni: ఐపీఎల్ 2025 (IPL 2025) తర్వాత చాలా మంది దిగ్గజాల క్రికెట్ కెరీర్ క్లోజ్ అవ్వనుంది. ఈ లిస్ట్‌లో ధోని శిష్యుడి పేరు కూడా చేరింది. టీ20 తర్వాత అతను టెస్ట్, వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికే అవకాశం ఉంది. దీనికి కారణం ఐపీఎల్‌లో అతని గణాంకాలే. ఇది అతని మ్యాచ్ విన్నింగ్ సామర్థ్యంపై ప్రశ్నలను లేవనెత్తుతోంది. విమర్శలకు దారి తీస్తోంది. మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.

వన్డే, టెస్ట్‌ల నుంచి రిటైర్ కానున్న ఎంఎస్ ధోని శిష్యుడు..

గత సంవత్సరం టీ20 ప్రపంచ కప్ తర్వాత, విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా టీ20 క్రికెట్ నుంచి రిటైర్ అయ్యారు. ఐపీఎల్‌లో ఈ ముగ్గురి ప్రదర్శనను మనం పరిశీలిస్తే, ప్రస్తుతం రవీంద్ర జడేజా అత్యంత చెత్త ప్రదర్శనతో తేలిపోయాడు. అయితే, ఒకటి లేదా రెండు మ్యాచ్‌లలో అతని బ్యాట్ నుంచి పరుగులు వచ్చాయి. కానీ, చాలా నెమ్మదిగా, స్లో స్ట్రైక్ రేట్‌తో వచ్చాయి. ఓడిపోయిన మ్యాచ్‌ల్లో పరుగులు చేశాడు. కానీ, జడేజా వల్ల జట్టుకు ఎలాంటి ప్రయోజనం కలగలేదు.

పేలవమైన ప్రదర్శనతో ఎంఎస్ ధోనిని నిరాశపరిచిన జడేజా..

శనివారం 3వ తేదీన చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో రవీంద్ర జడేజా 45 బంతులు తీసుకుని 77 పరుగులు చేసిన విషయం తెలిసిందే. ఇందులో ఎనిమిది ఫోర్లు, రెండు సిక్సర్లు కనిపించాయి. మ్యాచ్ చివరి వరకు జడేజా మైదానంలోనే ఉన్నాడు. కానీ, చెన్నై మ్యాచ్ గెలవలేకపోయింది.

ఇవి కూడా చదవండి

ఈ మ్యాచ్‌లో ఎంఎస్ ధోని నాయకత్వంలోని జట్టు రెండు పరుగుల తేడాతో ఓడిపోయింది. ఇది మొదటిసారి కాదు, కానీ ఈ సీజన్‌లో జడేజా ఖచ్చితంగా పరుగులు చేయడంలో విఫలమయ్యాడు. ముఖ్యంగా మ్యాచ్‌ను పూర్తి చేయడంలో విఫలమయ్యాడు. ఈ కారణంగా అతన్ని టెస్ట్, వన్డే జట్టు నుంచి తప్పించవచ్చు.

రవీంద్ర జడేజా ఫామ్..

టెస్ట్, వన్డే జట్టులో చాలా మంది యువ, ప్రతిభావంతులైన ఆటగాళ్ళు ఉన్నారు. వీరితో రవీంద్ర జడేజా టీమ్ ఇండియాలో స్థానం సంపాదించడానికి పోటీ పడుతున్నారు. వీరిలో అక్షర్ పటేల్ పేరు బలంగా వినిపిస్తోంది. ప్రస్తుతం కెప్టెన్సీ, బ్యాటింగ్, బౌలింగ్ మొదలైన ప్రతిదానిలోనూ అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తున్న సంగతి తెలిసిందే.

జడేజాను టీం ఇండియా నుంచి తప్పించడానికి ఇదే కారణం కావచ్చు. అతని ఐపీఎల్ కెరీర్‌ను పరిశీలిస్తే, అతను 11 మ్యాచ్‌ల్లో 37 సగటు, 137 స్ట్రైక్ రేట్‌తో 260 పరుగులు చేశాడు. ఇందులో అతను 2 అర్ధ సెంచరీలు సాధించాడు, 11 మ్యాచ్‌ల్లో 35 సగటుతో 14 ఎకానమీతో 7 వికెట్లు పడగొట్టాడు.

మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..