Cricket: 45 ఫోర్లు, 3 సిక్స్‌లు.. 91కిపైగా స్ట్రైక్‌ రైట్‌తో 410 రన్స్.. బౌలర్లను ఉతికారేసింది ఎవరంటే?

Sam Northeast: ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో శనివారం (జూలై 23) ఓ గొప్ప రికార్డు నమోదైంది. గ్లామోర్గాన్ కౌంటీ జట్టు బ్యాటర్‌ సామ్ నార్త్ఈస్ట్ (Sam Northeast) ఏకంగా 410 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ఫస్ట్‌ క్రాస్ క్రికెట్‌లో 400 పైచిలుకు పరుగులు చేసిన ..

Cricket: 45 ఫోర్లు, 3 సిక్స్‌లు.. 91కిపైగా స్ట్రైక్‌ రైట్‌తో 410 రన్స్.. బౌలర్లను ఉతికారేసింది ఎవరంటే?
Sam Northeast
Follow us
Basha Shek

|

Updated on: Jul 24, 2022 | 5:10 PM

Sam Northeast: ఇంగ్లాండ్ కౌంటీ ఛాంపియన్‌షిప్‌లో శనివారం (జూలై 23) ఓ గొప్ప రికార్డు నమోదైంది. గ్లామోర్గాన్ కౌంటీ జట్టు బ్యాటర్‌ సామ్ నార్త్ఈస్ట్ (Sam Northeast) ఏకంగా 410 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. తద్వారా ఫస్ట్‌ క్రాస్ క్రికెట్‌లో 400 పైచిలుకు పరుగులు చేసిన తొమ్మిదో క్రికెటర్‌గా, మొట్టమొదటి ఇంగ్లాండ్ ఆటగాడిగా అరుదైన రికార్డులు తన ఖాతాలో వేసుకున్నాడు.అదేవిధంగా ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌లో అత్యధిక స్కోరు టాప్‌-10 ఆటగాళ్ల జాబితాలో సామ్ చోటు దక్కించుకున్నాడు. ఈ జాబితాలో వెస్టిండీస్‌ దిగ్గజం బ్రియన్‌ లారా మొదటి స్థానంలో ఉన్నాడు. 1994లో వార్విక్‌షైర్‌ తరఫున లారా ఏకంగా 501 పరుగులు చేశాడు. కాగా నార్త్ ఈస్ట్ కేవలం 450 బంతుల్లో 45 ఫోర్లు, మూడు సిక్సర్లతో ఈ 410 పరుగులు చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో చివరి వరకు నాటౌట్‌గా నిలిచాడు నార్త్‌. అయితే మ్యాచ్ చివరి రోజున ఫలితం వస్తుందనే ఆశతో కెప్టెన్‌ ఇన్నింగ్స్ డిక్లేర్ చేశాడు. దీంతో లారా 501 పరుగుల (నాటౌట్) ప్రపంచ రికార్డును అందుకోలేకపోయాడు.

18 ఏళ్ల తర్వాత..

ఇవి కూడా చదవండి

కాగా ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 400కి పైగా పరుగులు చేయడం 18 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి కావడం గమనార్హం. చివరిసారిగా 2004లో, ఆంటిగ్వా టెస్టులో ఇంగ్లండ్‌పై బ్రియాన్ లారా 400 పరుగుల అజేయ ఇన్నింగ్స్ ఆడాడు. ఇదే టెస్టులో అత్యధిక స్కోరు కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్‌కు ముందు సామ్‌ మొత్తం 191 ఫస్ట్‌ క్లాస్‌ క్రికెట్‌ మ్యాచ్‌లు ఆడాడు. 324 ఇన్నింగ్సుల్లో 39 సగటుతో 11, 556 రన్స్‌ చేశాడు. ఇందులో 26 సెంచరీలు, 61 హాఫ్‌ సెంచరీలు ఉన్నాయి. ఈ మ్యాచ్‌కు ముందు అతని కెరీర్‌ బెస్ట్ స్కోరు 191 నాటౌట్‌ మాత్రమే.

ఇక మ్యాచ్‌ విషయానికొస్తే.. మొదట బ్యాటింగ్‌ చేసిన లీసెష్టర్‌ షైర్‌ 584 పరుగులకు ఆలౌటైంది. ఆతర్వాత బ్యాటింగ్‌కు దిగిన గ్లామోర్గాన్‌ 795/5 పరుగులు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. సామ్‌తో పాటు కూక్‌ 191 పరుగులు చేశాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో లీసెష్టర్‌ షైర్‌ 183 పరుగులకు కుప్పకూలింది. తద్వారా ఇన్నింగ్స్‌ 28 పరుగుల తేడాతో గ్లామోర్గాన్ విజయం సాధించింది.

మరిన్ని క్రీడావార్తల కోసం క్లిక్ చేయండి..