India vs West Indies 2nd ODI: టాస్ గెలిచిన వెస్టిండీస్.. ప్లేయింగ్ XIలో కీలకమార్పు.. వరుసగా 12వ సిరీస్ విజయంపై కన్నేసిన భారత్..
భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది.
India vs West Indies 2nd ODI: భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్‌తో అవేష్ ఖాన్ తన వన్డే పార్మాట్‌లో అంతర్జాతీయ ఎంట్రీ ఇవ్వనున్నాడు. వన్డే తొలి మ్యాచ్‌లో మూడు పరుగుల తేడాతో విజయం సాధించిన భారత్ సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. రెండో మ్యాచ్‌లో వెస్టిండీస్‌ను ఓడించి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. ఈ మ్యాచ్‌లో భారత జట్టు గెలిస్తే వెస్టిండీస్‌పై వరుసగా 12 వన్డే సిరీస్‌లు గెలిచిన జట్టుగా రికార్డులకెక్కుతుంది. ఇప్పటి వరకు, వన్డేల్లో ఏ జట్టుపై ఏ జట్టు కూడా వరుసగా 12 సిరీస్‌లను గెలుచుకోలేదు. చివరిసారిగా 2006లో వెస్టిండీస్ టీమ్ ఇండియాను ఓడించింది.
ఇక్కడ 71 మ్యాచ్‌లు జరగ్గా, ముందుగా బ్యాటింగ్ చేసిన జట్లు 31 గెలిచాయి. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేసిన జట్లు 35 మ్యాచ్‌ల్లో విజయం సాధించాయి. ఇక్కడ భారత్ అత్యధిక జట్టు స్కోర్‌గా రికార్డు సృష్టించింది. 2007 ప్రపంచకప్‌లో బెర్ముడాపై భారత్ 413/7 పరుగులు చేసింది.
రెండు జట్ల ప్లేయింగ్ XI..
వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్
భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్