AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs WI: వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ స్నేహితుడు.. ఐపీఎల్‌ దూకుడు చూపించేనా?

భారత్, వెస్టిండీస్ మధ్య రెండో వన్డే మ్యాచ్ క్వీన్స్ పార్క్ ఓవల్‌లో జరుగుతోంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన వెస్టిండీస్ టీం బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో టీమిండియా తొలుత బౌలింగ్ చేయనుంది. కాగా, ఈ మ్యాచ్‌తో అవేష్ ఖాన్ తన వన్డే ఫార్మాట్‌లో అంతర్జాతీయ ఎంట్రీ ఇవ్వనున్నాడు.

IND vs WI: వన్డేల్లో ఎంట్రీ ఇచ్చిన కేఎల్ రాహుల్ స్నేహితుడు.. ఐపీఎల్‌ దూకుడు చూపించేనా?
India Vs West Indies, 2nd Odi Avesh Khan
Venkata Chari
|

Updated on: Jul 24, 2022 | 7:26 PM

Share

వెస్టిండీస్‌తో ఆదివారం జరిగిన రెండో వన్డేలో భారత జట్టు ఫాస్ట్ బౌలర్ అవేశ్ ఖాన్‌కు అవకాశం దక్కింది. ఈ మ్యాచ్‌తో అవేశ్ వన్డేల్లో అరంగేట్రం చేస్తున్నాడు. ఈ మేరకు బీసీసీఐ ట్వీట్‌ చేసింది. అవేష్ ఇప్పటి వరకు టీ20 మ్యాచ్‌లు ఆడాడు. కానీ, అంతర్జాతీయ స్థాయిలో తొలిసారిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఆడలేదు. మూడు వన్డేల సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో గెలిచి 1-0 ఆధిక్యంలో ఉన్న భారత్.. ప్రస్తుతం సిరీస్‌ను గెలుచుకోవడంపైనే ఫోకస్ పెంచింది. రెండో మ్యాచ్ గెలవడం ద్వారా వరుసగ విండీస్‌పై 12 సిరీస్‌లు గెలుచుకుని, సరికొత్త రికార్డ్ నెలకొల్పేందుకు సిద్ధమైంది. అదే సమయంలో, వెస్టిండీస్ సిరీస్‌లో ఈ మ్యాచ్‌లో గెలిచి మూడో మ్యాచ్‌ను నిర్ణయాత్మకంగా మార్చాలని ప్రయత్నిస్తుంది.

ఐపీఎల్‌తో మెరిసిన అవేష్ ఖాన్..

ఇవి కూడా చదవండి

ఇండియన్ ప్రీమియర్‌లో సత్తా చాటిన అవేష్ ఖాన్ తనదైన ముద్ర వేశాడు. ఐపీఎల్-2021లో అత్యధిక వికెట్లు తీసిన వారిలో అవేశ్ రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత రిషబ్ పంత్ కెప్టెన్సీలో ఢిల్లీ క్యాపిటల్స్ తరపున ఆడాడు. ఆ సీజన్‌లో అవేష్ 16 మ్యాచ్‌లు ఆడి 24 వికెట్లు పడగొట్టాడు. అయితే ఈ ఏడాది అతను ఢిల్లీ తరపున ఆడలేదు. కొత్త జట్టు లక్నో సూపర్‌జెయింట్స్ జట్టులో చేరాడు. ఐపీఎల్-2022లో లక్నో తరపున ఆడుతున్న అవేశ్ 13 మ్యాచ్‌ల్లో 18 వికెట్లు పడగొట్టాడు.

వెస్టిండీస్‌పైనే టీ20 అరంగేట్రం..

అవేశ్ టీ20 అరంగేట్రం వెస్టిండీస్‌పైనే చేశాడు. అతను 20 ఫిబ్రవరి 2022న కోల్‌కతాలో అరంగేట్రం చేశాడు. ఈ మ్యాచ్‌లో అవేశ్ నాలుగు ఓవర్లలో 42 పరుగులు ఇచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. మరి అవేశ్ టీ20 అరంగేట్రం విషయాన్ని రిపీట్ చేస్తాడా లేక ఈసారి అరంగేట్రం మ్యాచ్‌లోనే వికెట్లు తీస్తాడో చూడాలి.

రెండు జట్ల ప్లేయింగ్ XI..

వెస్టిండీస్ (ప్లేయింగ్ XI): షాయ్ హోప్(కీపర్), బ్రాండన్ కింగ్, షమర్ బ్రూక్స్, కైల్ మేయర్స్, నికోలస్ పూరన్(కెప్టెన్), రోవ్‌మన్ పావెల్, అకేల్ హోసేన్, రొమారియో షెపర్డ్, అల్జారీ జోసెఫ్, జేడెన్ సీల్స్, హేడెన్ వాల్ష్

భారత్ (ప్లేయింగ్ XI): శిఖర్ ధావన్(కెప్టెన్), శుభమన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, సూర్యకుమార్ యాదవ్, సంజు శాంసన్(కీపర్), దీపక్ హుడా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చాహల్, అవేష్ ఖాన్