AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Olympics 2028: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ.. కీలక పాత్ర పోషించిన కోహ్లీ?

Olympics 2028 Los Angle: ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన తర్వాత, ఇప్పుడు భారత్‌కు మరో ఒలింపిక్ స్వర్ణం లభించే అవకాశం పెరిగింది. నిజానికి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు భారత క్రికెట్ జట్టు పెద్ద పోటీదారుగా నిలవనుంది. దీనికి కారణం టీమిండియా బెంచ్ బలం. ప్రస్తుత యుగంలోని అన్ని జట్లలో భారతదేశం అత్యంత బలమైన బెంచ్ బలంతో పరిగణిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు ఒలింపిక్స్‌లో తమ బి టీమ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీమ్ ఇండియా విజయానికి పెద్దపీట వేయనుంది.

Olympics 2028: క్రికెట్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో క్రికెట్ ఎంట్రీ.. కీలక పాత్ర పోషించిన కోహ్లీ?
Virat Kohli Olympics La28Image Credit source: ICC Twitter
Venkata Chari
|

Updated on: Oct 16, 2023 | 2:39 PM

Share

Olympics 2028 Los Angle: కోట్లాది మంది క్రికెట్ అభిమానులకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ఈ క్రీడల మహాకుంభ్‌లో క్రికెట్‌ను చేర్చింది. 2028లో లాస్ ఏంజెల్స్‌లో జరిగే ఒలింపిక్స్‌లో క్రికెట్ కూడా ఆడనున్నారు. దీనిపై అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ ముంబైలో ఓటింగ్ నిర్వహించగా అందులో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే వ్యతిరేకంగా ఓటు వేశారు. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో టీ20 ఫార్మాట్‌లో క్రికెట్ ఆడనుంది. ఇటీవల ఈ గేమ్‌ను ఆసియా క్రీడల్లో కూడా చేర్చగా అందులో భారత్‌ బంగారు పతకాన్ని కైవసం చేసుకుంది. ఒలింపిక్స్ 2028లో క్రికెట్‌ను చేర్చడంలో విరాట్ కోహ్లి పాత్ర చాలా పెద్దదని మీకు తెలుసా?

నిజానికి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ నిర్వాహకులు విరాట్ కోహ్లి పేరును కీలకంగా తీసుకున్నారంట. 2028 ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన తర్వాత, విరాట్ కోహ్లీకి సోషల్ మీడియాలో 340 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారని తెలుసుకున్నారంట. ప్రపంచంలో అత్యధికంగా ఫాలో అవుతున్న అథ్లెట్ల జాబితాలో వికాట్ మూడో స్థానంలో ఉన్నాడు. అభిమానుల ఫాలోయింగ్ పరంగా, విరాట్ అమెరికాలోని ముగ్గురు సూపర్ స్టార్లు లెబ్రాన్ జేమ్స్, టామ్ బ్రాడీ, టైగర్ వుడ్స్ కంటే చాలా ముందున్నాడు. ఇది క్రికెట్‌కు అనుకూలంగా మారింది.

ఇవి కూడా చదవండి

క్రికెట్‌లో స్వర్ణం సాధిస్తాం..

ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేర్చిన తర్వాత, ఇప్పుడు భారత్‌కు మరో ఒలింపిక్ స్వర్ణం లభించే అవకాశం పెరిగింది. నిజానికి లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించేందుకు భారత క్రికెట్ జట్టు పెద్ద పోటీదారుగా నిలవనుంది. దీనికి కారణం టీమిండియా బెంచ్ బలం. ప్రస్తుత యుగంలోని అన్ని జట్లలో భారతదేశం అత్యంత బలమైన బెంచ్ బలంతో పరిగణిస్తున్నారు. ప్రపంచంలోని అన్ని క్రికెట్ జట్లు ఒలింపిక్స్‌లో తమ బి టీమ్‌ను బరిలోకి దించే అవకాశం ఉంది. ఇదే జరిగితే టీమ్ ఇండియా విజయానికి పెద్దపీట వేయనుంది. అదే సమయంలో సీనియర్ జట్లన్నీ లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు వెళ్లినా.. టీమ్‌ఇండియా స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకోవచ్చు.

అయితే, విరాట్ కోహ్లీ 2028 నాటికి క్రికెట్ ఆడతాడా అనేది పెద్ద ప్రశ్నగా మారింది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్‌కు ఇంకా ఐదేళ్ల సమయం ఉంది. అప్పటికి విరాట్ క్రికెట్ లేదా దానిలోని ఒకటి లేదా రెండు ఫార్మాట్లను విడిచిపెట్టే అవకాశం ఉంది. అయితే విరాట్ లాస్ ఏంజెల్స్ వెళ్లినా వెళ్లకపోయినా.. జూనియర్ ఆటగాళ్లు మాత్రం దేశం కోసం పతకాలు సాధించేందుకు సిద్ధంగా ఉంటారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..