World Cup 2023: ప్రపంచకప్ కోసం ఆస్ట్రేలియా జట్టు ఇదే.. ప్రత్యర్థులకు వణుకు తెప్పించే ఆల్‌రౌండర్లకు ప్లేస్
భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 కోసం స్టార్ పేసర్ ప్యాట్రిక్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది . అయితే ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్ జట్టులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్, అలాగే బ్యాటింగ్‌లో జట్టుకు వెన్నెముకగా ఉన్న మార్నస్ లబుషేన్‌లకు వరల్డ్‌కప్ టీంలో స్థానం దక్కలేదు. అయినా నిఖార్సౌన ఆల్‌రౌండర్‌లతో కంగారూల జట్టు బలంగానే కనిపిస్తోంది.

భారత్‌లో జరగనున్న వన్డే ప్రపంచకప్ 2023 కోసం స్టార్ పేసర్ ప్యాట్రిక్ కమిన్స్ నేతృత్వంలోని 15 మంది సభ్యులతో కూడిన జట్టును క్రికెట్ ఆస్ట్రేలియా ప్రకటించింది . అయితే ఆస్ట్రేలియన్ వరల్డ్ కప్ జట్టులో గమనించాల్సిన విషయం ఏమిటంటే.. ఆ జట్టు స్టార్ ఆల్ రౌండర్ టిమ్ డేవిడ్, అలాగే బ్యాటింగ్‌లో జట్టుకు వెన్నెముకగా ఉన్న మార్నస్ లబుషేన్‌లకు వరల్డ్‌కప్ టీంలో స్థానం దక్కలేదు. అయినా నిఖార్సౌన ఆల్‌రౌండర్‌లతో కంగారూల జట్టు బలంగానే కనిపిస్తోంది. ఊహించినట్లుగానే, మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్, గ్లెన్ మాక్స్‌వెల్, సీన్ అబాట్, అష్టన్ అగర్‌లతో సహా చాలా మంది ఆల్ రౌండర్లు జట్టులో ఉన్నారు. ఇదిలా ఉంటే దక్షిణాఫ్రికాతో జరగనున్న ఐదు వన్డేల సిరీస్‌కు జట్టులో లబుషేన్, టిమ్ డేవిడ్‌లు చోటు దక్కించుకున్నారు. అయితే ఈ సిరీస్‌లో రాణిస్తే వారికి వరల్డ్‌కప్ జట్టులో స్థానం దక్కే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఎందుకంటే ప్రపంచ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్లు గాయపడితే తమ జట్టులో మార్పులు చేసేందుకు జట్లకు ఇంకా సెప్టెంబర్ 28 వరకు గడువు ఉంది. తద్వారా లబుషేన్‌కు ప్రపంచకప్ జట్టు తలుపులు మూసుకుపోలేదని స్పష్టమవుతోంది.
ఆల్ రౌండర్లతో నిండిపోయిన ఆసీస్..
ఆసీస్ ప్రపంచ కప్ జట్టులో ప్రధాన ప్లస్ పాయింట్ ఏమిటంటే, జట్టులోకి ఎక్కువ మంది ఆల్ రౌండర్లను తీసుకోవడం. గ్లెన్ మాక్స్‌వెల్, అష్టన్ అగర్ వంటి స్పిన్-బౌలింగ్ ఆల్-రౌండ్ ఎంపికల నుండి జట్టులోని మిచెల్ మార్ష్, కామెరాన్ గ్రీన్ వంటి పేస్-బౌలింగ్ ఆల్-రౌండర్ల వరకు, ఆసీస్ జట్టులో ఉన్నారు. అలాగే, ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో కెప్టెన్ కమిన్స్‌తో పాటు జోష్ హేజిల్‌వుడ్, మిచెల్ స్టార్క్‌లకు చోటు దక్కింది. ఐదుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన కంగారూల టీంలో జోష్ ఇంగ్లిస్, అలెక్స్ కారీ రూపంలోఇద్దరు వికెట్ కీపర్లు కూడా ఉన్నారు. వీరిలో కారీకే జట్టులో స్థానం పొందే అవకాశం ఉంది.
భారత్‌తో వన్డే సిరీస్
సెప్టెంబర్ 7న ప్రోటీస్‌తో ప్రారంభమయ్యే ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్ తర్వాత ఆస్ట్రేలియా జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ కోసం భారత్‌కు వస్తుంది. ఆ తర్వాత అక్టోబర్ 8న చెన్నైలోనే రోహిత్ సేనతో వరల్డ్ కప్ పోరాటాన్ని ప్రారంభించనున్నారు.
ఆస్ట్రేలియా ప్రపంచ కప్ జట్టు:
Presenting your 15-player men’s provisional squad for the 2023 World Cup!
The final 15-player squad will be confirmed later this month 🇦🇺 #CWC23 pic.twitter.com/wO0gBbadKi
— Cricket Australia (@CricketAus) September 6, 2023
పాట్ కమిన్స్ (కెప్టెన్), స్టీవ్ స్మిత్, అలెక్స్ కారీ, జోష్ ఇంగ్లిస్, సీన్ అబాట్, అష్టన్ అగర్, కామెరాన్ గ్రీన్, జోష్ హేజిల్‌వుడ్, ట్రావిస్ హెడ్, మిచ్ మార్ష్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, డేవిడ్ వార్నర్, ఆడమ్ జంపా, మిచెల్ స్టార్క్.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..








