AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

CSK IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ సేన ఆడబోయే మ్యాచ్‌లు.. తేదీలు,వేదికలను ఇక్కడ చూడొచ్చు!

IPL 2021: క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. అదివారం రోజున బీసీసీఐ ఐపీఎల్‌-2021 షెడ్యూల్‌‌ను విడుదల..

CSK IPL 2021: చెన్నై సూపర్ కింగ్స్.. ధోనీ సేన ఆడబోయే మ్యాచ్‌లు.. తేదీలు,వేదికలను ఇక్కడ చూడొచ్చు!
Chennai Super Kings in IPL 2021
Follow us
Sanjay Kasula

|

Updated on: Mar 08, 2021 | 7:33 PM

Chennai Super Kings in IPL 2021:క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ పండుగ ఏప్రిల్‌ 9 నుంచి ప్రారంభం కానుంది. అదివారం రోజున బీసీసీఐ ఐపీఎల్‌-2021 షెడ్యూల్‌‌ను విడుదల చేసింది. తొలి మ్యాచ్‌ ముంబై ఇండియన్స్‌-రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు జట్ల మధ్య చెన్నై వేదికగా జరగనుంది. ఫైనల్ మ్యాచ్ మే30వ తేదీన నిర్వహించనున్నారు. చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీ నగరాలలో మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఐపీఎల్‌-14 మ్యాచ్‌లు ప్రేక్షకులు లేకుండానే జరుగనున్నాయి. మధ్యాహ్నం మ్యాచ్‌లు 3.30 గంటలనకు మెుదలవుతాయి. రాత్రి మ్యాచ్‌లు గం. 7.30లకు ప్రారంభం కానున్నాయి. అయితే ధోనీ నేతృత్వంలో కొనసాగుతున్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఆడబోయే మ్యాచ్‌లు.. తేదిలు,వేదికలను ఓసారి పరిశీలిద్దాం…

ఏప్రిల్ 10, శనివారం, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: ముంబై

ఏప్రిల్ 16, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్

వేదిక: ముంబై

ఏప్రిల్ 19, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్ వేదిక: ముంబై

ఏప్రిల్ 21, 2021, 07:30 PM: కోల్‌కతా నైట్ రైడర్స్ vs చెన్నై సూపర్ కింగ్స్ వేదిక: ముంబై

ఏప్రిల్ 25, 2021, 03:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs రాయల్ ఛాలెంజర్స్ వేదిక: ముంబై

ఏప్రిల్ 28, 2021 బుధవారం, 07:30 PM చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదిక: ఢిల్లీ

మే 01, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ వేదిక: ఢిల్లీ

మే 5, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs రాజస్తాన్ రాయల్స్ వేదిక: ఢిల్లీ

మే 7, 2021, 03:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ వేదిక: ఢిల్లీ

మే 9, 2021, 03:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs పంజాబ్ కింగ్స్ వేదిక: బెంగళూరు

12 మే, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs కేకేఆర్ వేదిక: బెంగళూరు

మే 16, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs ముంబై ఇండియన్స్ వేదిక: బెంగళూరు

మే 21, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs ఢిల్లీ క్యాపిటల్స్ వేదిక: కోల్‌కతా

మే 23, 2021, 07:30 PM: చెన్నై సూపర్ కింగ్స్ vs కోల్‌కతా నైట్ రైడర్స్ వేదిక: కోల్‌కతా

ఐపీఎల్ 2021 షెడ్యూల్‌ను బీసీసీఐ ప్రకటించింది. ఏ టీమ్‌లు ఎప్పుడు ఆడనున్నాయి? మ్యాచ్‌లు ఎక్కడ జరగనున్నాయి? అనే వివరాలను వెల్లడించింది. గతంలో ప్రతి టీమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న అన్ని నగరాల్లో మ్యాచ్‌‌లు నిర్వహించేవారు. మొత్తం 8 జట్లు ఉండడంతో 8 స్టేడియాల్లో మ్యాచ్‌లు జరిగేవి. కానీ ఈసారి కోవిడ్ నేపథ్యంలో వేదికలను కుదించింది. కేవలం 6 స్టేడియాల్లో మ్యాచ్‌లను నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

Women Reservation Bill: ఎట్టకేలకు మహిళా బిల్లుకు మోక్షం.. ఎంపీల డిమాండ్‌కు మోదీ ఓకే.. వర్షాకాలంలో గుడ్‌న్యూస్

ప్రజలు వారే, ప్రభువులు వారే.. మగవారు లేని మహిళా రాజ్యం… ఇదెక్కడో తెలుసా..?

Telangana: తెలంగాణలోని ఆ ప్రాంతంలో చేపలు విషపూరితం.. తిన్నారో అంతే సంగతులు