Washington Sundar: టీమిండియా ఆల్ రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై ప్రశంసలు కురిపించిన హెడ్ కోచ్ రవిశాస్త్రి.. ఏకంగా..
Team India Head Coach Ravi Shastri: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. సుందర్ సహజమైన..
Team India Head Coach Ravi Shastri: టీమిండియా ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్‌పై హెడ్ కోచ్ రవిశాస్త్రి ప్రశంసలు కురిపించాడు. సుందర్ సహజమైన సామర్థ్యం కలిగి ఉన్నాడని కితాబిచ్చాడు. తనకంటే కూడా ఎంతో సమర్థుడు అని అన్నాడు. ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యుటిసి)లో టీమిండియా ఇంగ్లండ్‌తో జరిగిన నాలుగు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో 3-1తో సిరీస్‌ను కైవసం చేసుకున్న విషయం తెలిసిందే. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో మూడు, నాలుగో టెస్ట్ మ్యాచ్‌ల్లో ఇంగ్లండ్‌ను దారుణంగా ఓడించిన కోహ్లీ సే.. జూన్ 18 నుండి 22 వరకు జరగబోయే డబ్ల్యుటిసి ఫైనల్‌లో న్యూజిలాండ్‌తో తలపడనుంది.
ఇదిలాఉంటే.. నాలుగో టెస్టు మ్యాచ్‌లో ఆతిథ్య జట్టు ఇంగ్లండ్‌పై 160 పరుగుల ఆధిక్యంలోకి రావడంతో సుందర్ పాత్ర కీలకం. సుందర్ తొలి ఇన్నింగ్స్‌లో 96 పరుగులు చేయడం వల్లే ఇది సాధ్యమయ్యిందని చెప్పాలి. ఈ నేపథ్యంలో సుందర్ ఆట తీరుపై స్పందించిన టీమిండియా హెడ్ కోచ్ రవిశాస్త్రి.. “వాషింగ్టన్ సుందర్ నాకన్నా సహజ సామర్థ్యాన్ని కలిగి ఉన్నాడు. సుందర్ టాప్-ఫోర్లో బ్యాటింగ్ చేయాలి అని నేను అనుకుంటున్నాను. ఈ విషయంలో అతని సమర్థతపై ఎలాంటి సందేహం లేదు. సుందర్ తన బౌలింగ్ పై కూడా దృష్టి పెట్టగలిగితే, భవిష్యత్తులో భారతదేశం చాలా మంచి బౌలర్‌ను కలిగి ఉన్నట్లు అవుతుంది. నా ప్లేస్ కూడా ఆరవ స్థానంలో ఉండేది. అతను కూడా ఇదే నెంబర్‌లో రాణిస్తాడని, నా కంటే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తాడని భావిస్తున్నాను’ అని రవిశాస్త్రి చెప్పుకొచ్చాడు.
Also read:
Nikhil Siddharth : వరుస సినిమాలతో జోరుమీదున్న యంగ్ హీరో… మెగాహీరో కథతో సినిమా చేస్తున్న నిఖిల్..