AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: ‘కోహ్లీ.. అకాడమీకి వచ్చి బేసిక్స్‌ నేర్చుకో.. అప్పుడే ఫాంలోకి వస్తావ్’

శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో విరాట్ భారీ స్కోరు చేస్తాడని భావించారు. కానీ అతను రెండు టెస్ట్ మ్యాచ్‌లలో పెద్దగా రాణించలేకపోయాడు.

Virat Kohli: 'కోహ్లీ.. అకాడమీకి వచ్చి బేసిక్స్‌ నేర్చుకో.. అప్పుడే ఫాంలోకి వస్తావ్'
Virat Kohli
Follow us
Venkata Chari

|

Updated on: Mar 16, 2022 | 9:19 PM

విరాట్ కోహ్లీ(Virat Kohli) పేలవమైన ఫామ్‌ను చూసి అతని చిన్ననాటి కోచ్, మాజీ రంజీ ప్లేయర్ రాజ్‌కుమార్ శర్మ అతనికి ఒక సలహా ఇచ్చాడు. విరాట్ కొన్ని రోజులు అకాడమీకి వచ్చి బేసిక్స్‌పై వర్క్ చేయాలని సలహా ఇచ్చాడు. ‘విరాట్ తన పాత ఫాంలోకి రావాలంటే, అకాడమీకి తిరిగి రావాలి. దీని గురించి ఆయనతో కూడా మాట్లాడతాను. అకాడమీకి రావడం వల్ల అతనికి ప్రస్తుతం కావాల్సిన ఆత్మవిశ్వాసం కలుగుతుంది’ అని చెప్పుకొచ్చాడు. పోడ్‌కాస్ట్ షోలో మాట్లాడుతూ, విరాట్ బ్యాటింగ్‌లో అదనపు జాగ్రత్తలు తీసుకుంటున్నాడని, ఇది అవసరం లేదని రాజ్‌కుమార్ శర్మ అన్నారు. అతను బాగా బ్యాటింగ్ చేస్తున్నాడు. కానీ, కొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. కెరీర్‌ తొలినాళ్లలో చేస్తున్నట్టుగా కాస్త ఎక్కువ స్వేచ్ఛతో బ్యాటింగ్ చేస్తే, త్వరలోనే మళ్లీ అత్యుత్తమ స్థాయికి చేరుకుంటాడు. రిషబ్ పంత్(Rishabh Pant), శ్రేయాస్ అయ్యర్(Shreyas Iyer) వంటివారు రాణించిన వికెట్లపై విరాట్ మరిన్ని అవకాశాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాజ్‌కుమార్ శర్మ పేర్కొన్నారు.

విశేషమేమిటంటే, శ్రీలంకతో స్వదేశంలో జరిగిన టెస్ట్ సిరీస్‌లో, విరాట్ భారీ ఇన్నింగ్స్ ఆడతాడని భావించారు. అయితే గత రెండున్నరేళ్ల మాదిరిగానే, ఈసారి కూడా అతని బ్యాట్‌ ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. అతను మొహాలీలో ఒకసారి బ్యాటింగ్ చేసే అవకాశం పొందాడు. అలాగే బెంగుళూరు టెస్ట్ రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ తక్కువ పరుగులకే ఎల్బీడబ్ల్యూ అవుట్ అయ్యాడు. గత రెండున్నరేళ్లుగా క్రికెట్‌లో ఏ ఫార్మాట్‌లోనైనా విరాట్ సెంచరీ చేయలేకపోయాడు. ఈ సమయంలో అతని పరుగుల సగటు కూడా గణనీయంగా పడిపోయింది.

Also Read: Pak vs Aus: డబుల్ సెంచరీ మిస్సయినా.. ప్రత్యేక జాబితాలో చేరిన పాక్ సారథి.. టాప్ 5లో టీమిండియా దిగ్గజ ప్లేయర్ కూడా..

IPL 2022: ఫిట్‌నెస్ టెస్టులో పాసైన హార్దిక్.. విఫలమైన ఢిల్లీ ఓపెనర్..