Video: లైవ్ మ్యాచ్‌లో కపుల్ ‘దేశీ రొమాన్స్’.. ఆట ఆపేసి మరీ స్క్రీన్‌పై కల్లార్పకుండా చూసిన క్రికెటర్లు..
Couple Private Moment: ఈ జంట ప్రైవేట్ మూమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెమెరామెన్ మొదట మ్యాచ్‌పై ఫోకస్ చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే, అకస్మాత్తుగా కెమెరా ప్రేక్షకుల వైపునకు కదులుతుంది. అక్కడ ఒక జంట కూర్చుని ఉన్నారు. కెమెరాను చూసిన తర్వాత జంట పూర్తిగా భయాందోళనకు గురవడం చూడొచ్చు. అబ్బాయి తన ముఖాన్ని దాచుకోవడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి కూడా చాలా అసౌకర్యంగా కనిపించింది.

Couple Private Moment In AUS vs PAK Live Cricket Match: మెల్‌బోర్న్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ పాకిస్తాన్ మధ్య రెండవ టెస్ట్ జరుగుతోంది. మూడు రోజులు ముగిశాయి. ప్రస్తుతం నేడు నాలుగో రోజు మ్యాచ్ కొనసాగుతోంది. అయితే, రెండవ ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ చేస్తున్న ఆతిథ్య ఆస్ట్రేలియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఈ మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఓ రోమాన్స్ సీన్ కెమెరాలో చూపించారు. దీని కారణంగా స్టాండ్‌లో ఉన్న ఒక జంట భయపడి, కనిపించకుండా అక్కడి నుంచి జారుకున్నాడు. కెమెరా యాంగిల్ కారణంగా, ఒక జంట ప్రైవేట్ మూమెంట్ క్యాప్చర్ అయింది. ఇది బిగ్ స్క్రీన్‌పై కనిపించడంతో అంతా ఆశ్చర్యపోయారు.
ఈ జంట ప్రైవేట్ మూమెంట్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కెమెరామెన్ మొదట మ్యాచ్‌పై ఫోకస్ చేయడం వీడియోలో చూడొచ్చు. అయితే, అకస్మాత్తుగా కెమెరా ప్రేక్షకుల వైపునకు కదులుతుంది. అక్కడ ఒక జంట కూర్చుని ఉన్నారు. కెమెరాను చూసిన తర్వాత జంట పూర్తిగా భయాందోళనకు గురవడం చూడొచ్చు. అబ్బాయి తన ముఖాన్ని దాచుకోవడం ప్రారంభించాడు. ఆ అమ్మాయి కూడా చాలా అసౌకర్యంగా కనిపించింది.
రొమాన్స్‌లో ముగినిపోయిన ప్రేమ జంట వీడియో..
Wait a minute what did we all just see? Yet you are complaining about missed catches? 🤷🏻♀️🤡#PAKvsAUS pic.twitter.com/8yA6pCagXv
— Kinza Tariq (@Kinnzayyy) December 28, 2023
ఇదీ నాలుగో రోజు పరిస్థితి..
ఇక టెస్టు విషయానికి వస్తే మూడో రోజు ఆట ముగిసే వరకు ఆతిథ్య ఆస్ట్రేలియా ఈ మ్యాచ్‌లో 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే, రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా 187 పరుగులకే 6 వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో ఆస్ట్రేలియా 16 పరుగుల స్కోరు వద్ద నాలుగు వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత మిచెల్ మార్ష్, స్టీవ్ స్మిత్ జట్టును ఆదుకున్నారు. మార్ష్ 13 ఫోర్ల సాయంతో 96 పరుగులు, స్టీవ్ స్మిత్ 3 ఫోర్లతో 50 పరుగులు చేసి ఆస్ట్రేలియాను ఈ మ్యాచ్ లో నిలబెట్టారు.
ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కోసం, పాకిస్తాన్ మొదటి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియాను 318 పరుగులకు పరిమితం చేసింది. దానికి సమాధానంగా విజిటింగ్ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 264 పరుగులు మాత్రమే చేయగలిగింది. పాకిస్థాన్ తరపున అబ్దుల్లా షఫీక్ 5 ఫోర్ల సాయంతో 62 పరుగులు చేశాడు. ఇది కాకుండా, కెప్టెన్ షాన్ మసూద్ 3 ఫోర్లు; 1 సిక్స్‌తో 54 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మూడో రోజు ముగిసే సమయానికి 6 వికెట్లకు 187 పరుగులు చేసింది. దీంతో ఆస్ట్రేలియా 241 పరుగుల ఆధిక్యంలో ఉంది. ఇక నాలుగో రోజు ఆస్ట్రేలియా జట్టు 262 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో పాకిస్తాన్ టార్గెట్ 317 పరుగులుగా మారింది. ప్రస్తుతం వార్త రాసే సమయానికి పాక్ జట్టు 4 వికెట్లు కోల్పోయి 160 పరుగులు చేసింది. రిజ్వాన్, షకీల్ క్రీజులో ఉన్నారు. మసూద్ 60, బాబర్ 41 పరుగులు చేసి పెవిలియన్ చేరారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




