Border-Gavaskar trophy: IND vs AUS టెస్ట్ సిరీస్ ఎలా చూడాలంటే?
IND vs AUS టెస్ట్ సిరీస్ హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్ ఛానెల్‌లలో మాత్రమే ప్రసారం అవుతోంది. ఇంతకముందులా జియోసినిమాలో ఫ్రీ ప్రసారం అందుబాటులో లేదు. అయితే, కేంద్ర ప్రభుత్వ డీడీ స్పోర్ట్స్ ఛానెల్‌లో అభిమానులు సిరీస్‌ను ఉచితంగా చూడొచ్చు.
భారత క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఆస్ట్రేలియాతో ఐదు టెస్ట్‌ల బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ తొలి టెస్ట్ ఈ రోజు పెర్త్ లో ప్రారంభమయింది. తొలి టెస్ట్ లో టాస్ గెలిచిన టీమిండియా బ్యాటింగ్ ఎంచుకుంది.
న్యూజిలాండ్‌తో ఇటీవల జరిగిన టెస్ట్ సిరీస్‌లో వైట్‌వాష్ అయిన టీమిండియాకు ఈ సిరీస్ గెలవడం అత్యంత కీలకం. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ భారత క్రికెట్ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి కీలకంగా మారింది. అంతేకాకుండా, వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ చేరేందుకు ఈ సిరీస్‌ను 4-0తో గెలవడం తప్పనిసరి.
2016 నుండి బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో టీమిండియా విజయకేతనం ఎగురవేస్తోంది. గత రెండు ఆస్ట్రేలియా పర్యటనల్లోనూ టీమిండియా విజయం సాధించింది. ఇప్పుడు మరో విజయాన్ని అందుకోవాలని భారత జట్టు పట్టుదలతో ఉంది.
ఈ సిరీస్‌ను స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్ ప్రసారం చేస్తోంది.
స్టార్ స్పోర్ట్స్ SD/HD ఛానెల్స్ స్టార్ స్పోర్ట్స్ 4 (తెలుగు, మలయాళం, కన్నడ) హాట్‌స్టార్ (ఓటీటీ ప్లాట్‌ఫామ్) అయితే, ఈ ఛానెల్స్, హాట్‌స్టార్‌ను చూడటానికి సబ్‌స్క్రిప్షన్ తప్పనిసరి. గతంలో జియోసినిమా ఫ్రీగా మ్యాచ్‌లు ప్రసారం చేసినప్పటికీ, ఇప్పుడు హాట్‌స్టార్ ఫ్రీ సర్వీసును నిలిపివేసింది.
కేంద్ర ప్రభుత్వం క్రికెట్ అభిమానుల కోసం గుడ్ న్యూస్ ను తెలిసింది. ఈ సిరీస్‌ను డీడీ స్పోర్ట్స్ ఛానల్‌లో ఫ్రీగా ప్రత్యక్ష ప్రసారం చేయనుంది. ఇది డబ్బులు చెల్లించకుండా అందరికీ అందుబాటులో ఉంటుంది.
సిరీస్ షెడ్యూల్
నవంబర్ 22-26: తొలి టెస్టు – పెర్త్ (ఉదయం 7:30) డిసెంబర్ 06-10: రెండో టెస్టు (డే/నైట్) – అడిలైడ్ (ఉదయం 9:30) డిసెంబర్ 14-18: మూడో టెస్టు – బ్రిస్బేన్ (ఉదయం 5:50) డిసెంబర్ 26-31: నాలుగో టెస్టు – మెల్‌బోర్న్ (ఉదయం 5:00) జనవరి 03-08: అయిదో టెస్టు – సిడ్నీ (ఉదయం 5:00) భారత క్రికెట్ అభిమానులకు ఉత్సాహభరితమైన సిరీస్ కావడంతో డీడీ స్పోర్ట్స్ లైవ్ ప్రసారాన్ని ఉపయోగించి మ్యాచ్‌లు ఆస్వాదించండి!