Pink Ball Test: కోహ్లీ కెరీర్‌కే మాయని మచ్చ.. ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సై.. 4 ఏళ్ల పగ తీరేనా?

IND vs AUS Pink Ball Test Records: పింక్ బాల్ టెస్టులో భారత్, ఆస్ట్రేలియాలు ఒక్కో ఓటమిని చవిచూశాయి. అయితే, ఆస్ట్రేలియా గణాంకాలు భారతదేశం కంటే చాలా బలంగా ఉన్నాయి. పింక్ బాల్ టెస్టులో ఇప్పటి వరకు ఇరు జట్లు ఎలా రాణించాయో ఇప్పుడు తెలుసుకుందాం..

Pink Ball Test: కోహ్లీ కెరీర్‌కే మాయని మచ్చ.. ప్రతీకారం తీర్చుకునేందుకు రోహిత్ సై.. 4 ఏళ్ల పగ తీరేనా?
Ind Vs Aus Pink Ball Test R
Follow us
Venkata Chari

|

Updated on: Dec 03, 2024 | 3:21 PM

IND vs AUS Pink Ball Test Records: బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ 2024-25లో భారత జట్టు అద్భుతంగా ప్రారంభమైంది. రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ లేకపోవడంతో, ఫాస్ట్ బౌలర్, వైస్ కెప్టెన్ జస్ప్రీత్ బుమ్రా జట్టుకు నాయకత్వం వహించాడు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియాలోని పెర్త్‌లో జరిగిన ఐదు టెస్టుల సిరీస్‌లో మొదటి మ్యాచ్‌లో భారత్ విజయం సాధించి, 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఇప్పుడు అందరి చూపు డిసెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న రెండో టెస్టు మ్యాచ్‌పైనే ఉంది.

బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ రెండో మ్యాచ్ అడిలైడ్ ఓవల్‌లో జరగనుంది. పింక్ బాల్‌తో జరిగే డే నైట్ టెస్ట్ మ్యాచ్ ఇది. పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా గణాంకాలు భారతదేశం కంటే చాలా బలంగా ఉంది. అడిలైడ్ టెస్టుకు ముందు గణాంకాలు భారతదేశానికి ఇబ్బందిగా మారాయి. పింక్ బాల్ టెస్టులో ఇప్పటి వరకు ఇరు జట్ల ఆటతీరు ఎలా ఉందో ఓసారి చూద్దాం..

4 పింక్ బాల్ టెస్టులు ఆడిన భారత్..

పింక్ బాల్ టెస్టు చరిత్రకు 9 ఏళ్లు కావడం గమనార్హం. 2015లో ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా విజయం సాధించింది. భారత్ ఇప్పటివరకు మొత్తం నాలుగు పింక్ బాల్ టెస్టులు ఆడింది. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, బంగ్లాదేశ్, శ్రీలంక జట్లతో టీమిండియా ఒక్కో పింక్ బాల్ టెస్టు ఆడింది. నాలుగు మ్యాచ్‌ల్లో భారత్‌కు ఏకైక ఓటమి ఆస్ట్రేలియా చేతిలోనే కావడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

36 పరుగులకే కుప్పకూలిన భారత్..

భారత్, ఆస్ట్రేలియా మధ్య పింక్ బాల్ టెస్టు జరిగింది. ఈ మ్యాచ్‌లో భారత్ తన టెస్టు చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఓటమిని చవిచూసింది. డిసెంబర్ 2020లో అడిలైడ్ ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో భారత జట్టు రెండో ఇన్నింగ్స్‌లో కేవలం 36 పరుగులకే కుప్పకూలింది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అడిలైడ్ ఓవల్‌లోనే మరోసారి పింక్ బాల్ టెస్టులో భారత్, ఆస్ట్రేలియాలు తలపడటం గమనార్హం.

పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా రికార్డ్..

పింక్ బాల్ టెస్ట్‌లో ఆస్ట్రేలియా కూడా ఒకే ఒక్క ఓటమిని చవిచూసింది, అయితే, భారత్ కంటే ఎనిమిది మ్యాచ్‌లు ఎక్కువగా ఆడింది. కంగారూ జట్టు ఇప్పటి వరకు 12 పింక్ బాల్ టెస్టులు ఆడింది. ఇందులో 11 మ్యాచ్‌లు గెలిచింది. 2024లో వెస్టిండీస్‌పై ఆస్ట్రేలియా ఏకైక ఓటమి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..