IPL 2023: తండ్రి కాబోతున్న స్టార్ ప్లేయర్ .. ధనాధన్ లీగ్‌కు దూరం.. కేఎల్ రాహుల్ టీంకు కష్టాలు తప్పవా?
ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణిస్తోన్న లక్నోసూపర్ జెయింట్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కూ దూరం కానున్నాడని వారర్తలు వస్తున్నాయి. త్వరలోనే వుడ్ తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు.
ఐపీఎల్ 2023లో అద్భుతంగా రాణిస్తోన్న లక్నోసూపర్ జెయింట్స్ జట్టుకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సీజన్‌లో ఆ జట్టు తరఫున అత్యధిక వికెట్లు తీసిన ఫాస్ట్ బౌలర్ మార్క్ వుడ్ ఐపీఎల్‌కూ దూరం కానున్నాడని వారర్తలు వస్తున్నాయి. త్వరలోనే వుడ్ తండ్రిగా ప్రమోషన్ పొందనున్నాడు. ప్రస్తుతం అతని భార్య నెలలు నిండిన గర్భంతో ఉంది. ఈసమయంలో భార్యకు తోడుగా ఉండాలనుకుంటున్నాడు మార్క్ వుడ్. దీంతో త్వరలోనే అతను ఇంగ్లండ్‌కు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. దీంతో మార్క్ వుడ్ లేకుండానే లక్నో ఐపీఎల్ మ్యాచ్‌లు ఆడాల్సి రావచ్చని తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంతో కేఎల్ రాహుల్ టీంకు కష్టాలు తెప్పవని తెలుస్తోంది. ఎందుకంటే మార్క్ వుడ్ IPL 2023లో లక్నో సూపర్‌జెయింట్స్‌లో అత్యంత విజయవంతమైన బౌలర్. ఈ రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్ 4 మ్యాచ్ ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఇప్పుడు వచ్చే లీగ్ మ్యాచ్‌ల్లో మార్క్ వుడ్ ఆడకపోతే ఆ జట్టుకు పెద్ద ఎదురుదెబ్బే. ఎందుకంటే ఐపీఎల్ లీగ్ ప్రస్తుతం కీలక దశలో ఉంది. లక్నో జట్టు 7 మ్యాచ్‌ల్లో 4 గెలిచి పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది.
అయితే కేఎల్ రాహుల్ జట్టు ప్లే ఆఫ్ బెర్తు ఇంకా ఖరారు కాలేదు. ఆ జట్టు మిగిలిన 7 మ్యాచ్‌ల్లో కనీసం 4 మ్యాచ్‌లు గెలవాలి. ఇలాంటి సమయాల్లో వుడ్ లేకపోతే లక్నో బౌలింగ్ విభాగం బలహీనపడటం ఖాయం. కాగా అనారోగ్యం కారణంగా గత రెండు మ్యాచ్‌లు ఆడలేదు మార్క్‌వుడ్. అతని గైర్హాజరీలో, ఆఫ్ఘన్ సీమర్ నవీన్-ఉల్-హక్ బాగానే ఆడాడు. అయితే అతను మార్క్ వుడ్ లాగా వికెట్ టేకర్ కాదు. మార్క్ వుడ్ ఈ సీజన్‌లో తొలి మ్యాచ్‌లోనే ఢిల్లీపై ఐదు వికెట్లు తీసి సంచలనం సృష్టించాడు. పైగా వుడ్ పేస్ ఇండియన్ పిచ్‌లకు సరిగ్గా సరిపోతాయి. కాగా లక్నో తన తదుపరి మ్యాచ్‌ని పంజాబ్ కింగ్స్‌తో ఏప్రిల్ 28న ఆడాల్సి ఉంది. ఈ సీజన్‌లో మార్క్ వుడ్‌కి ఇదే చివరి మ్యాచ్ కావచ్చు. ఈ మ్యాచ్ తర్వాత చెన్నై, బెంగళూరు వంటి బలమైన జట్లతో లక్నో తలపడాల్సి ఉంది. ఇక్కడ వుడ్ లేకపోతే రాహుల్ టీంకు కష్టాలు తప్పవు. ఒకవేళ లక్నో ప్లేఆఫ్‌కు చేరినా, మార్క్ వుడ్ జట్టులోకి రాడనే వార్తలు ఆజట్టును కలవరపరస్తున్నాయి. మార్క్ వుడ్ ఇంగ్లండ్‌కు వెళితే ఐపీఎల్‌లోకి తిరిగి రావడం కష్టమని తెలుస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కెప్టెన్ కేఎల్ రాహుల్ వుడ్ కు ప్రత్యామ్నాయంగా ఎవరిని తుది జట్టులోకి తీసుకుంటాడో ఆసక్తికరంగా మారింది.
From Avesh’s alternate career to Mark’s nickname ?, here is team LSG answering some more interesting questions! ?@My11Circle | #My11CirclexLSG | #My11Circle | #LucknowSuperGiants | #LSG pic.twitter.com/rBgNFTiT1p
— Lucknow Super Giants (@LucknowIPL) April 25, 2023
మరిన్ని క్రికెట్ వార్తల కోసం క్లిక్ చేయండి..