WTC Final: డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆంధ్రా ప్లేయర్‌కి చోటు దక్కేనా.? ప్లేయింగ్ ఎలెవన్ ఇలా!!
యువ ఆటగాళ్లు, అటు సీనియర్ ప్లేయర్లతో కూడిన బలమైన జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలబడనుంది టీమిండియా. అజింక్య రహనే, కెఎల్ రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో భాగం కావడం..
ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ కోసం భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. యువ ఆటగాళ్లు, అటు సీనియర్ ప్లేయర్లతో కూడిన బలమైన జట్టు డబ్ల్యూటీసీ ఫైనల్‌లో ఆస్ట్రేలియాతో తలబడనుంది టీమిండియా. అజింక్య రహనే, కెఎల్ రాహుల్ మిడిలార్డర్ బ్యాటింగ్‌లో భాగం కావడం.. ఈసారి సూర్యకుమార్ యాదవ్‌కు చోటు దక్కపోవడం ఆశ్చర్యపరుస్తోంది. ఆసక్తికరమైన విషయమేంటంటే.. వికెట్ కీపర్ బ్యాట్స్‌మెన్‌గా కెఎస్ భరత్ ఎంపికయ్యాడు. ఇక ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవన్‌లో ఎవరెవరుంటారన్నది ప్రశ్న. జూన్ 7-11 మధ్య లండన్‌లోని ఓవల్ స్టేడియంలో భారత్, ఆస్ట్రేలియా మధ్య డబ్ల్యూటీసీ ఫైనల్ జరగనుంది. మరి ఇక్కడి గ్రౌండ్ రికార్డుల బట్టి చూస్తే.. టీమిండియా నుంచి ఏయే ఆటగాళ్లు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కించుకోనున్నారో ఇప్పుడు తెలుసుకుందామా..!
ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్ బరిలోకి దిగే అవకాశం ఉంది. వన్‌డౌన్ ఛటేశ్వర్ పుజారా ఉండగా.. మిడిలార్డర్‌ను విరాట్ కోహ్లీ, అజింక్య రహనే చూసుకోనున్నారు. ఇక ఆల్‌రౌండర్లుగా రవీంద్ర జడేజా, ఆర్ అశ్విన్ జట్టులో ఉన్నారు. అదే సమయంలో ఫాస్ట్ బౌలింగ్‌లో మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్, శార్దూల్ ఠాకూర్‌లకు స్థానం ఖాయమని భావిస్తున్నారు. జట్టులో ఉమేష్ యాదవ్ కూడా ఉన్నాడు. అయితే శార్దూల్ ఠాకూర్ బౌలింగ్ ఇంగ్లాండ్ పరిస్థితులకు బాగా సరిపోతుంది. అతడి బ్యాటింగ్ కూడా చేయగలడు.
వికెట్ కీపర్ భరత్ లేదా రాహుల్.?
డబ్ల్యూటీసీ ఫైనల్‌లో టీమిండియా ఓపెనర్‌గా కెఎల్ రాహుల్‌కు అవకాశం ఇవ్వకపోతే వికెట్ కీపర్‌గా ఛాన్స్ ఇవ్వొచ్చు. అటు కెఎస్ భరత్ వికెట్ కీపర్‌గా ఎంపికైనప్పటికీ.. గతంలో ఇంగ్లాండ్ గడ్డపై రాహుల్ మంచి గణాంకాలు నమోదు చేశాడు. కాబట్టి మరోసారి టీమిండియా రిస్క్ తీసుకుని మరీ భరత్ కంటే రాహుల్‌కే ఛాన్స్ ఇవ్వొచ్చు.
భారత్(ప్లేయింగ్ XI, అంచనా):
శుభ్‌మన్ గిల్, రోహిత్ శర్మ, ఛటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లీ, అజింక్యా రహానే, రవీంద్ర జడేజా, కెఎస్ భరత్ / కెఎల్ రాహుల్, ఆర్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్
KL Rahul is one of the few rare Indian players to have Test Hundreds at Lord’s – He has 3rd highest score at Lord’s by an Indian.
One of the finest batters of this generation, Class KL Rahul.pic.twitter.com/X7a1T3w3X4
— CricketMAN2 (@ImTanujSingh) April 18, 2023