Cricket: 35 ఫోర్లు, 19 సిక్సర్లతో 414 పరుగులు.. 5గురి బ్యాటర్ల వీరవిహారం.. టీ20ల్లో మరో రికార్డు.!

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌, మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో..

Cricket: 35 ఫోర్లు, 19 సిక్సర్లతో 414 పరుగులు.. 5గురి బ్యాటర్ల వీరవిహారం.. టీ20ల్లో మరో రికార్డు.!
Perth Vs Melbourne
Follow us
Ravi Kiran

|

Updated on: Jan 24, 2023 | 7:10 PM

ఆస్ట్రేలియాలో జరుగుతోన్న బిగ్ బాష్ లీగ్ 2022-23 సీజన్‌లో భాగంగా పెర్త్ స్కార్చర్స్‌, మెల్‌బోర్న్ రెనిగెడ్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారీ స్కోర్ నమోదైంది. ఇరువైపులా బ్యాటర్లు బౌండరీలతో వీరవిహారం సృష్టించారు. స్కార్చర్స్ నిర్దేశించిన 213 పరుగుల విజయలక్ష్యాన్ని చేధించేందుకు మెల్‌బోర్న్ రెనిగెడ్స్ చివరి వరకు ప్రయత్నించింది. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్ ఫించ్ 35 బంతుల్లో 76 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. కానీ ఆఖర్లో 11 పరుగుల దూరంలో నిలిచిపోయింది. అయితేనేం రెండు సైడ్స్ కలిపి 414 పరుగుల వరద పారింది.

ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన పెర్త్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ సాధించింది. ఓపెనర్లు స్టీవ్ ఎస్కినాజీ(54), బాన్‌క్రాఫ్ట్‌(95 నాటౌట్‌) టాప్ స్కోరర్లుగా నిలిచారు. ఇక 213 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన మెల్‌బోర్న్ రెనిగెడ్స్‌ను విజయం వైపు.. ఆ జట్టు కెప్టెన్ ఆరోన్‌ ఫించ్‌(76 నాటౌట్) తీసుకెళ్లాడు. 35 బంతుల్లో తుఫాన్ ఇన్నింగ్స్‌తో చెలరేగిపోయాడు. అంతేకాదు ఏకంగా ఒక ఓవర్‌లో 31 పరుగులు సాధించాడు. అలాగే ఫించ్‌కు జతగా షాన్‌ మార్ష్‌(54), విల్‌ సదర్‌లాండ్‌(30) మెరుపులు మెరిపించినప్పటికీ.. లక్ష్యానికి 11 పరుగుల దూరంలో మెల్‌బోర్న్ జట్టు నిలిచిపోయింది. ఏదైతేనేం.. క్రికెట్ ఫ్యాన్స్‌కు మాత్రం ఈ మ్యాచ్ రన్ ఫీస్ట్ ఇచ్చింది. బౌలర్లు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. బ్యాటర్లు ఆకాశమే హద్దుగా చెలరేగిపోయారు.

ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
ఈ నీరు పవర్‌ఫుల్.. పరగడుపున తాగితే గుట్టయినా కరగాల్సిందే..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
పుష్ప ఎపిసోడ్‌.. ఇదో యాక్షన్‌ థ్రిల్లర్‌ సెంటిమెంట్ సినిమా..
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
తక్కువ ఇంధనం.. ఎక్కువ దూరం.. అత్యధిక మైలేజీని ఇచ్చే 5 కార్లు!
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
డయాబెటిస్‌ ఉన్నవాళ్లు ఈ నీళ్లు రోజూ తాగితే.. షుగర్‌ కంట్రోల్‌లో
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
సన్‌రైజర్స్‌ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్..ఫామ్‌లోకి ఆ ప్లేయర్
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
మారేడు పండుతో శరీరానికి ఎన్ని ప్రయోజనాలున్నాయో తెలుసా..?
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పెళ్లి తర్వాతే హీరోయిన్లకు పెరుగుతున్న క్రేజ్
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
పొదుపు ఖాతాలో రూ.10 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తే ఏమవుతుంది?
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
వినోద్ కాంబ్లీ ఆరోగ్యంపై కీలక అప్డేట్
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే
'ఇదేందయ్యా ఇది- ఎప్పుడూ చూడలే' విమానంలో చాయ్‌వాలా..!వీడియో చూస్తే