Cricket News: మెరుపు వేగంతో హాఫ్ సెంచరీ బాదినా.. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాలేదు..?
Cricket News: ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 24 పరుగుల
Cricket News: ఆస్ట్రేలియా టీ20 లీగ్ బిగ్ బాష్‌లో భాగంగా హోబర్ట్ హరికేన్స్, మెల్‌బోర్న్ స్టార్స్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో హరికేన్స్ 24 పరుగుల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన హరికేన్స్ ఆరు వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. ఈ లక్ష్యాన్ని సాధించడం మెల్‌బోర్న్ జట్టుకు కష్టతరంగా మారింది 20 ఓవర్లు ఆడి తొమ్మిది వికెట్ల నష్టానికి 156 పరుగులు మాత్రమే చేయగలిగింది. హరికేన్స్ నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకోవడానికి మెల్‌బోర్న్ జట్టు శాయశక్తులా ప్రయత్నించినా విజయం సాధించలేకపోయింది. హరికేన్స్ జట్టు ఓపెనర్ బాన్ మెక్‌డెర్మాట్ అద్భుతమైన అర్ధ సెంచరీని సాధించాడు. దీని కారణంగా జట్టు బలమైన స్కోరు చేయగలిగింది.
బాన్ మెక్‌డెర్మాట్, మాథ్యూ వేడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించి తుఫాను ఇన్నింగ్స్ ఆడాడు. 43 బంతుల్లో నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్ల సాయంతో 67 పరుగులు చేశాడు. చివరి వరకు పరుగుల వర్షం కురిపించాడు. అతను 155.81 స్ట్రైక్ రేట్‌తో పరుగులు చేశాడు. తొలి వికెట్‌కు వేడ్‌తో కలిసి 93 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. 10వ ఓవర్ మూడో బంతికి వేడ్ ఔటయ్యాడు. వేడ్ 27 బంతుల్లో 39 పరుగులు చేశాడు. వేడ్ నిష్క్రమణ తర్వాత మెక్‌డెర్మాట్ కూడా ఔట్ అయ్యాడు.
ఈ ఇద్దరు ఓపెనర్లు అవుటైన తర్వాత, డి’ఆర్సీ 22 బంతుల్లో 24 పరుగులు చేశాడు. పీటర్ హ్యాండ్‌కాంబ్ 12 బంతుల్లో 12 పరుగులు చేశాడు. టిమ్ డేవిడ్ తుఫాను శైలిని కనబరిచాడు. 12 బంతుల్లో 22 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో ఒక ఫోర్, ఒక సిక్స్ ఉన్నాయి. జట్టు లోయర్ ఆర్డర్ విఫలమైంది. హ్యారీ బ్రూక్ ఖాతా కూడా తెరవలేకపోయాడు. థాంప్సన్ మూడు పరుగులు చేశాడు. అయితే మెక్‌డెర్మాట్ అద్భుతమైన ఇన్నింగ్స్ తర్వాత కూడా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపిక కాలేదు.
నాథన్ ఎల్లిస్ ఈ అవార్డును అందుకున్నాడు. నాథన్ నాలుగు ఓవర్లలో 27 పరుగులిచ్చి రెండు వికెట్లు తీశాడు. ఎల్లిస్‌కు జో బర్న్స్, ఆండ్రీ రస్సెల్‌ల వికెట్లు దక్కాయి. బర్న్స్ 17 బంతుల్లో 22 పరుగులు, రస్సెల్ 13 బంతుల్లో 12 పరుగులు చేయగా.. మెల్ బోర్న్ తరఫున జో క్లార్క్ 52 పరుగులు చేశాడు. ఇందుకోసం 40 బంతులు ఎదుర్కొని రెండు ఫోర్లు, మూడు సిక్సర్లు బాదాడు. చివర్లో హిల్టన్ కార్ట్‌రైట్ 18 బంతుల్లో రెండు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 26 పరుగులు చేశాడు.