AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

WTC Final: కొత్త వేదికలో డబ్ల్యూటీసీ ఫైనల్.. గత 2 ఓటములతో అలర్టైన బీసీసీఐ?

WTC చివరి రెండు ఫైనల్‌లు ఇంగ్లాండ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు ఫైనల్స్ జూన్ నెలలో జరగ్గా, రెండింటిలోనూ ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2021లో సౌతాంప్టన్ మైదానంలో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అదే సమయంలో, 2023లో లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది. ఐసీసీ తన ఆదాయాన్ని బీసీసీఐ సహాయంతో సంపాదిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, ICC చాలా టోర్నమెంట్‌ల సమయాన్ని భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సెట్ చేస్తుంది.

WTC Final: కొత్త వేదికలో డబ్ల్యూటీసీ ఫైనల్.. గత 2 ఓటములతో అలర్టైన బీసీసీఐ?
Jay Shah
Venkata Chari
|

Updated on: May 11, 2024 | 1:40 PM

Share

ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) 2025-27 ఫైనల్ కొత్త వేదికలో నిర్వహించే అవకాశం ఉంది. శుక్రవారం, బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా (బీసీసీఐ) కార్యదర్శి జైషా మాట్లాడుతూ, ఐసీసీతో బోర్డు కొత్త వేదికలపై చర్చించిందని తెలిపారు. WTC ఫైనల్‌ను నిర్వహించడానికి వేరే టైమ్ స్లాట్ లేదా మరొక వేదికను కనుగొనడం కష్టమని షా తెలిపారు. అయితే 2023-25 ​​WTC ఫైనల్ ఇంగ్లాండ్‌లో మాత్రమే జరుగుతుందని ఆయన అన్నారు.

గత సీజన్ నుంచి IPLలో అమలు చేస్తోన్న ఇంపాక్ట్ ప్లేయర్ నియమం గురించి కూడా షా మాట్లాడాడు- ‘ఇంపాక్ట్ ప్లేయర్ టెస్ట్ కేస్ లాంటిది. మేం దానిని క్రమంగా అమలు చేశాం. ఒక మ్యాచ్‌లో ఒకే జట్టు నుంచి ఇద్దరు భారతీయ ఆటగాళ్లకు అవకాశం లభించడం దీని అతిపెద్ద ప్రయోజనం అంటూ చెప్పుకొచ్చాడు.

షా మాట్లాడుతూ- ‘ప్లేయర్‌లు, ఫ్రాంచైజీ యజమానులతో మాట్లాడిన తర్వాత, దానిని కొనసాగించాలా వద్దా అని ఆలోచిస్తాం. అయితే, ఇంపాక్ట్ ప్లేయర్ నియమం ముందుకు సాగదని చెప్పలేదు. ప్లేయర్ నియమావళిపై ఆటగాళ్ళు రోహిత్ శర్మ, మిచెల్ స్టార్క్ ఆందోళన వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

డబ్ల్యూటీపీ ఫైనల్..

WTC చివరి రెండు ఫైనల్‌లు ఇంగ్లాండ్‌లో నిర్వహించిన సంగతి తెలిసిందే. రెండు ఫైనల్స్ జూన్ నెలలో జరగ్గా, రెండింటిలోనూ ఫైనల్స్‌కు చేరుకున్న భారత్.. రెండుసార్లు ఓటమిని చవిచూడాల్సి వచ్చింది. 2021లో సౌతాంప్టన్ మైదానంలో న్యూజిలాండ్ జట్టు విజయం సాధించింది. అదే సమయంలో, 2023లో లండన్‌లోని ఓవల్‌లో ఆస్ట్రేలియా ప్రపంచ టెస్టు ఛాంపియన్‌గా నిలిచింది.

ఐసీసీ తన ఆదాయాన్ని బీసీసీఐ సహాయంతో సంపాదిస్తుంది. ఇటువంటి పరిస్థితిలో, ICC చాలా టోర్నమెంట్‌ల సమయాన్ని భారత ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకుని సెట్ చేస్తుంది.

ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణంగా ఎక్కువ పరుగులు..

ఈ సీజన్‌లో లీగ్‌లో అత్యధిక స్కోరు నమోదు కావడానికి ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ప్రధాన కారణంగా పరిగణిస్తున్నారు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనను తొలగించాలని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొద్దిరోజుల క్రితం చెప్పాడు. దీని కారణంగా శివమ్ దూబే, అభిషేక్ శర్మ వంటి ఆల్ రౌండర్లకు బౌలింగ్ చేసే అవకాశం లేదు.

ఫించ్ మాట్లాడుతూ.. అంతర్జాతీయ క్రికెట్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ నియమం లేదని చెప్పాడు. దీని కారణంగా, కెప్టెన్లు వ్యూహాలు రూపొందించడంలో సమస్యలను ఎదుర్కొంటారని తెలిపాడు.

బౌలర్ల పేలవ ప్రదర్శనకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ కారణం – స్టార్క్

కోల్‌కతా నైట్ రైడర్స్ ఫాస్ట్ బౌలర్ మిచెల్ స్టార్క్ కూడా ప్రస్తుత IPL 2024 సీజన్‌లో బౌలర్ల పేలవ ప్రదర్శనకు ఇంపాక్ట్ ప్లేయర్ రూల్ ఒక ప్రధాన కారణమని అభిప్రాయపడ్డాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నియమం విషయాలను మారుస్తుంది. బ్యాట్స్‌మెన్ నంబర్-8 లేదా నంబర్-9 వరకు వస్తే అప్పుడు పెద్ద స్కోరు చేసే అవకాశం ఉందని తెలిపాడు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..