BCCIలో ఉద్యోగాలు.. లక్షల్లో జీతం! మంచి ఛాన్స్.. ఇప్పుడే అప్లై చేసుకోండి!
బీసీసీఐ బెంగళూరులోని ఎక్సలెన్స్ సెంటర్, భారత మహిళల జట్టు కోసం హెడ్ ఫిజియోథెరపిస్ట్ , S&C కోచ్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతలు, బాధ్యతలు నోటిఫికేషన్‌లో తెలిపారు. అనుభవం, సర్టిఫికేషన్లు ముఖ్యమైన అర్హతలు. ఏప్రిల్ 30, 2025 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ చదవండి..

బీసీసీఐ పలు పోస్టులకు అర్హుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌తో పాటు ఇండియన్ ఉమెన్స్ టీమ్‌తో కలిసి పనిచేసేందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్, అలాగే S&C కోచ్(స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్) కోసం బీసీసీఐ దరఖాస్తులను ఆహ్వానిస్తుంది. ఏప్రిల్ 16న విడుదల చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. బెంగళూరులోని అత్యాధునిక BCCI సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (COE)లో అలాగే ఇండియన్ సీనియర్ ఉమెన్స్ టీమ్ ఆడే మ్యాచ్‌లకు పని చేసేందుకు హెడ్ ఫిజియోథెరపిస్ట్, స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ పోస్టులకు అప్లై చేసుకోవాల్సిందిగా కోరింది. ఈ పోస్టులు స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్ (SSM) టీమ్‌తో లింకై ఉంటాయి.
హెడ్ ఫిజియోథెరపిస్ట్ పోస్టులుకు అర్హతలు, బాధ్యతలు..
- మ్యాచ్ డే ఫిజియోథెరపీ సేవలు, రోజువారీ గాయాల నిర్వహణ
- గాయాలను నిర్ధారించడం, నిర్వహణ ప్రణాళికలను రూపొందించాలి
- ఆటగాళ్లతో వన్-ఆన్-వన్ చికిత్స సెషన్లను నిర్వహించాలి
- అత్యుత్తమ ఆటగాళ్ల సంరక్షణ కోసం వైద్య నిపుణులతో సహకరించాలి
- గాయం నిర్వహణ, నివారణ కార్యక్రమాలను అందించడానికి హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్, S&C నిపుణులతో కలిసి పనిచేయాల్సి ఉంటుంది
- అథ్లెట్ల శిక్షణ పనిభారాన్ని పర్యవేక్షించాలి, సమీక్షించాలి
- గాయాల నివారణ వ్యూహాలను అభివృద్ధి చేయాలి
- SSM బృందం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలి
- స్పోర్ట్స్ లేదా మస్క్యులోస్కెలెటల్ ఫిజియోథెరపీ/స్పోర్ట్స్ అండ్ ఎక్సర్సైజ్ మెడిసిన్/స్పోర్ట్స్ రిహాబిలిటేషన్‌లో ప్రత్యేకత కలిగిన పోస్ట్ గ్రాడ్యుయేట్లు అర్హులు
- ఫిజియోథెరపీ సేవల్లో కనీసం 10 సంవత్సరాల అనుభవం ఉండాలి
- ఉన్నత స్థాయి అథ్లెట్లు/జట్లతో పనిచేసిన అనుభవం
- మస్క్యులోస్కెలెటల్/క్రీడా గాయాల నిర్ధారణ, నిర్వహణలో విస్తృతమైన అనుభవం
- అడ్వాన్స్‌డ్ లైఫ్ సపోర్ట్ అండ్ ట్రామా మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్ (గత 2 సంవత్సరాలలోపు)
స్ట్రెంత్ అండ్ కండిషనింగ్ కోచ్ – బాధ్యతలు, అర్హతలు
- మ్యాచ్ డే S&C సేవలను అందించాలి, వార్మప్, ప్రీ-గేమ్ సన్నాహాలను నిర్వహించాలి
- ఆటగాళ్ల కోసం అనుకూలీకరించిన ఫిట్‌నెస్ ప్రోగ్రామ్‌లను రూపొందించాలి
- క్రమం తప్పకుండా ఫిట్‌నెస్ పరీక్షా కార్యక్రమాలను అమలు చేయాలి
- వ్యక్తిగత అథ్లెట్ల శిక్షణ పనిభారాలను పర్యవేక్షించాలి
- తగిన గాయం నివారణ వ్యూహాలను అభివృద్ధి చేయాలి
- శిక్షణ, మ్యాచ్‌ల కోసం ఆటగాళ్ల ఫిట్‌నెస్ స్థితి నివేదికలను అందించాలి
- ఆటగాడి పనితీరును మెరుగుపరచడానికి ప్రభావవంతమైన రికవరీ వ్యూహాలను అమలు చేయాలి
- SSM బృందం పరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలకు సహకరించాలి
- S&C లేదా స్పోర్ట్స్ ఫిజియాలజీ/సైన్స్‌లో స్పెషలైజేషన్ కలిగి ఉండాలి
- S&C సేవలలో కనీసం 7 సంవత్సరాల అనుభవం
- ఉన్నత స్థాయి అథ్లెట్లు/జట్లతో పనిచేసిన అనుభవం
- S&C కార్యక్రమాల రూపకల్పన, అమలు, పర్యవేక్షణలో అనుభవం
- క్రీడా గాయాల నిర్వహణలో పునరావాస నిపుణులతో కలిసి పనిచేసిన అనుభవం
- బేసిక్ లైఫ్ సపోర్ట్ & ట్రామా మేనేజ్‌మెంట్ సర్టిఫికేషన్ (గత 2 సంవత్సరాలలోపు)
ఈ రెండు పోస్టులు బెంగళూరులోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లోని హెడ్ స్పోర్ట్స్ సైన్స్ అండ్ మెడిసిన్, హెడ్ కోచ్ – టీమ్ ఇండియా (సీనియర్ ఉమెన్) కు నివేదించాలి. రెండు పోస్టుల పదవీకాలం 2 సంవత్సరాలు. అర్హతగల అభ్యర్థులు ఏప్రిల్ 30, 2025న సాయంత్రం 5:00 గంటలలోపు ఈ క్రింది లింక్‌ల ద్వారా తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది. హెడ్ ఫిజియోథెరపిస్ట్ స్ట్రెంత్ & కండిషనింగ్ కోచ్, (లింక్ కోసం పోస్టు పేరుపై క్లిక్ చేయండి). దరఖాస్తుల స్క్రీనింగ్/షార్ట్‌లిస్ట్ చేసిన తర్వాత, అభ్యర్థులను పర్సనల్ ఇంటర్వ్యూలకు పిలుస్తారు.
మరిన్ని కెరీర్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




