Team India: కెప్టెన్‌గా ట్రోఫీ గెలిచినా వీడని బ్యాడ్‌లక్.. టీమిండియా టెస్ట్ జట్టులోకి డోర్స్ క్లోజ్

Shreyas Iyer: టీమిండియా టెస్టు జట్టులో శ్రేయాస్ అయ్యర్ భవిష్యత్తు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. టెస్టు జట్టులోకి తిరిగి రావడం ప్రస్తుతానికి సుదూర కలగా మారింది. ఈ మాట అన్నది మేంకాదండోయ్.. బయటకు వచ్చిన రిపోర్టుతో ఈ విషయం తెలుస్తోంది. టెలిగ్రాఫ్ ప్రచురించిన ఓ నివేదికలో, శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ జట్టులోకి తిరిగి రావడానికి సంబంధించిన సూచనలు ఇచ్చింది.

Team India: కెప్టెన్‌గా ట్రోఫీ గెలిచినా వీడని బ్యాడ్‌లక్.. టీమిండియా టెస్ట్ జట్టులోకి డోర్స్ క్లోజ్
Ind Vs Ban Shreyas Iyer
Follow us

|

Updated on: Sep 17, 2024 | 6:31 PM

Shreyas Iyer: టీమిండియా టెస్టు జట్టులో శ్రేయాస్ అయ్యర్ భవిష్యత్తు ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. టెస్టు జట్టులోకి తిరిగి రావడం ప్రస్తుతానికి సుదూర కలగా మారింది. ఈ మాట అన్నది మేంకాదండోయ్.. బయటకు వచ్చిన రిపోర్టుతో ఈ విషయం తెలుస్తోంది. టెలిగ్రాఫ్ ప్రచురించిన ఓ నివేదికలో, శ్రేయాస్ అయ్యర్ టెస్ట్ జట్టులోకి తిరిగి రావడానికి సంబంధించిన సూచనలు ఇచ్చింది. నివేదిక ప్రకారం, బంగ్లాదేశ్‌కు దూరంగా ఉన్న శ్రేయాస్ అయ్యర్‌కు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ జట్టులో చోటు దక్కేలా కనిపించడం లేదని అనిపిస్తోంది.

దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ ఫ్లాప్ షో..

శ్రేయాస్ అయ్యర్‌కి సంబంధించి ఇటువంటి నివేదికలు, సూచనల వెనుక అతని స్వంత ప్రదర్శన కూడా ఒక పెద్ద అంశం. దులీప్ ట్రోఫీలో శ్రేయాస్ అయ్యర్ ఆటతీరు బాగాలేదు. దులీప్ ట్రోఫీలో ఆడిన 2 మ్యాచ్‌ల్లో 4 ఇన్నింగ్స్‌ల్లో 104 పరుగులు మాత్రమే చేశాడు. ఈ సమయంలో అతను కేవలం ఒక అర్ధ సెంచరీ మాత్రమే చేశాడు. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, శ్రేయాస్ అయ్యర్ వికెట్‌పై స్థిరపడిన తర్వాత తన వికెట్‌ను కోల్పోవడం కనిపించింది.

ప్రస్తుతం టెస్టు జట్టులో చోటు లేదు- బీసీసీఐ అధికారి..

శ్రేయాస్ అయ్యర్ ఈ ప్రదర్శనను చూసిన తరువాత, BCCI అధికారి టెలిగ్రాఫ్‌తో మాట్లాడుతూ, ప్రస్తుతానికి టెస్ట్ జట్టులో శ్రేయాస్ అయ్యర్‌కు స్థానం లేదు. దులీప్ ట్రోఫీలో అతని షాట్ ఎంపిక ఆశ్చర్యపరిచింది. సెట్ చేసిన తర్వాత, అతను బ్యాడ్ షాట్లు ఆడుతూ తన వికెట్‌ను సమర్పించుకున్న విధానం చాలా నిరాశపరిచింది. ఈ టోర్నమెంట్ అయ్యర్‌కు ఒక అవకాశం. అతను దానిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమయ్యాడు.

ఇవి కూడా చదవండి

తనను తాను నిరూపించుకునే ఛాన్స్..

అయితే, శ్రేయాస్ అయ్యర్ తనని తాను నిరూపించుకునే అవకాశాలు ఇప్పట్లో తీరేలా లేవు. అతని ముందు దులీప్ ట్రోఫీలో ఒకే ఒక మ్యాచ్ ఉంది. అక్కడ సెంచరీ చేయడం ద్వారా తన ఫామ్‌ను తిరిగి పొందగలడు. ఆ తర్వాత, ఇరానీ కప్ అక్టోబర్ 1 నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో పరుగులు చేసే అవకాశం ఉంటుంది. బంగ్లాదేశ్‌తో జరిగే టీ20 సిరీస్‌కు ఎంపికైనందున అతను అక్కడ ఆడకపోయినా, అతనికి రంజీ ట్రోఫీ మ్యాచ్‌లు ఉన్నాయి. అక్కడ అతను పరుగులు చేయడం ద్వారా పునరాగమనం చేయవచ్చు.

షార్ట్ బాల్ బలహీనత..

అయితే, షార్ట్ బాల్‌తో బలహీనత కారణంగా శ్రేయాస్ అయ్యర్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ ఆడేందుకు ఆస్ట్రేలియా వెళ్లకపోవచ్చని బీసీసీఐ అధికారి తెలిపారు. రాబోయే దేశవాళీ టోర్నీల్లో అతను పరుగులు సాధిస్తే, అతని పేరు దేశవాళీ సిరీస్‌కు పరగణిస్తారని తెలుస్తోంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..