- Telugu News Photo Gallery Business photos Ambani Family Wedding Celebrations Start with a Mass Wedding (Samuhik Vivah) for Underprivileged Couples
Mukesh Ambani: అంబానీ ఫ్యామిలీనా మజాకా.. పేద జంటలకు పెళ్లిళ్లు చేసి ఏం ఇచ్చారో తెలుసా? ఏడాది కూర్చొని తినొచ్చు
రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12న జరుగనుంది. వీరి వివాహం అంశం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముంబైలో జరగనున్న ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కు ముందు చాలా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లు జరిగాయి. ఇదిలావుండగా, మంగళవారం అనంత్-రాధికల వివాహానికి ముందు అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని థానేలో బడుగు,.
Updated on: Jul 02, 2024 | 6:30 PM

రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ - రాధిక మర్చంట్‌ల వివాహం జూలై 12న జరుగనుంది. వీరి వివాహం అంశం ప్రతి రోజు వార్తల్లో నిలుస్తూనే ఉంది. ముంబైలో జరగనున్న ఈ హై ప్రొఫైల్ వెడ్డింగ్‌కు ముందు చాలా ప్రీ వెడ్డింగ్ ఈవెంట్‌లు జరిగాయి. ఇదిలావుండగా, మంగళవారం అనంత్-రాధికల వివాహానికి ముందు అంబానీ కుటుంబం మహారాష్ట్రలోని థానేలో బడుగు, బలహీన వర్గాల ప్రజల కోసం గ్రాండ్‌గా సామూహిక వివాహాలను నిర్వహించింది. ముంబైకి 100 కిలోమీటర్ల దూరంలోని పాల్ఘర్ ప్రాంతానికి చెందిన 50 మందికి పైగా నిరుపేద జంటలకు అంబానీ కుటుంబం సామూహిక వివాహం కార్యక్రమాన్ని నిర్వహించింది అంబానీ కుటుంబం. థానేలోని రిలయన్స్ కార్పొరేట్ పార్క్‌లో వివాహ వేడుక జరిగింది.

ఈ వేడుకకు జంటల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న సుమారు 800 మంది హాజరయ్యారు. ఈ వేడుకతో ప్రారంభించి రాబోయే పెళ్లిళ్ల సీజన్‌లో దేశవ్యాప్తంగా ఇలాంటి వందలాది వివాహాలకు మద్దతుగా కొనసాగిస్తామని అంబానీ కుటుంబం ప్రతిజ్ఞ చేసింది. ఈ వేడుకలో స్వయంగా ముఖేష్ అంబానీ తన భార్య నీతా కూడా పాల్గొన్నారు. దీనికి సంబంధించి అంబానీ కుటుంబం నుంచి ఓ కార్డు కూడా జారీ అయింది. పాల్ఘర్‌లోని స్వామి వివేకానంద విద్యామందిర్‌లో తొలుత నిర్వహించిన ఈ సామూహిక వివాహాల తర్వాత థానేకి మార్చారు.

ఈ వేడుక సజావుగా ఎలాంటి అంతరాయం కలగకుండా జరిగేలా వేదికలో ఈ మార్పు చేశారు. ఈ సామూహిక వివాహ వేడుకకు ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరయ్యారు. నీతా అంబానీ - ముఖేష్ అంబానీ తమ కుటుంబ సభ్యులతో వివాహ వేడుకకు హాజరై దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి జంటకు మంగళసూత్రం, పెళ్లి ఉంగరం, ముక్కుపుడకతో సహా బంగారు ఆభరణాలను బహుమతిగా అందజేశారు. వధువులకు కాలి ఉంగరాలు, వెండి ఆభరణాలు అందజేశారు.

అంతేకాకుండా అదనంగా, ప్రతి వధువుకు రూ. 1.01 లక్షల చెక్కును అందించారు. ప్రతి జంటకు సంవత్సరానికి సరిపడా కిరాణా సామాగ్రి, గృహోపకరణాలు బహుమతిగా అందించారు. ఇందులో 36 రకాల నిత్యావసర వస్తువులు, పాత్రలు, గ్యాస్ స్టవ్, మిక్సర్, ఫ్యాన్ వంటి విద్యుత్ వస్తువులు ఉన్నాయి.

ఇదిలా ఉండగా, జూలై 12, 2024న ముంబైలో అంగరంగ వైభవంగా జరిగే వేడుకలో అనంత్ అంబానీ రాధికా మర్చంట్‌ను వివాహం చేసుకోనున్నారు. జూన్ 29న యాంటిలియాలోని అంబానీ ఇంట్లో ప్రైవేట్ పూజ కార్యక్రమంతో వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ జంట వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వివాహానికి భారతదేశం, విదేశాల నుండి చాలా మంది ప్రముఖులు హాజరు కానున్నారు.




