BCCI Central Contract: సెంట్రల్ కాంట్రాక్టులో 34 మంది.. రీఎంట్రీ ఇచ్చిన ఆ ఇద్దరు
భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఒప్పందంలో మొత్తం 34 మంది ఆటగాళ్లకు చోటు లభించింది. కీలక విషయం ఏమిటంటే ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ కాంట్రాక్టులోకి తిరిగి వచ్చారు. అదే సమయంలో, చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారిగా ఇందులో స్థానం లభించింది. భారత పురుష క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 1 అక్టోబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది.

BCCI Announces Annual Player Retainer Ship: భారత ఆటగాళ్ల సెంట్రల్ కాంట్రాక్టును బీసీసీఐ ప్రకటించింది. కొత్త ఒప్పందంలో మొత్తం 34 మంది ఆటగాళ్లకు చోటు లభించింది. కీలక విషయం ఏమిటంటే ఇషాన్ కిషన్, శ్రేయాస్ అయ్యర్ మళ్ళీ కాంట్రాక్టులోకి తిరిగి వచ్చారు. అదే సమయంలో, చాలా మంది ఆటగాళ్లకు మొదటిసారిగా ఇందులో స్థానం లభించింది. భారత పురుష క్రికెటర్ల సెంట్రల్ కాంట్రాక్ట్ 1 అక్టోబర్ 2024 నుంచి 30 సెప్టెంబర్ 2025 వరకు ఉంటుంది.
34 మంది ఆటగాళ్ళు, 4 గ్రేడ్స్..
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో 34 మంది ఆటగాళ్లను 4 గ్రేడ్‌లుగా విభజించారు. ప్రతి ఆటగాడికి అతని గ్రేడ్ ప్రకారం బీసీసీఐ వార్షిక మొత్తాన్ని ఇస్తుంది. A+ గ్రేడ్ ఆటగాళ్లకు గరిష్టంగా రూ. 7 కోట్లు ఇస్తారు. కాగా, ఎ గ్రేడ్ వన్‌లో రూ. 5 కోట్లు పొందుతారు. బి గ్రేడ్ ఆటగాళ్లకు రూ. 3 కోట్లు లభిస్తాయి. సి గ్రేడ్‌లో చేరిన ఆటగాళ్లకు ఏటా ఒక్కొక్కరికి రూ. 1 కోటి లభిస్తుంది.
A+, A గ్రేడ్‌లలో ఎవరున్నారంటే?
బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టులో A+ గ్రేడ్‌లో నలుగురు ఆటగాళ్లకు స్థానం కల్పించింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, జస్‌ప్రీత్ బుమ్రా, రవీంద్ర జడేజాలను ఈ గ్రేడ్‌లో ఉండగా, ఆరుగురు ఆటగాళ్లను A గ్రేడ్‌లో చేర్చారు. ఇందులో మహ్మద్ సిరాజ్, కేఎల్ రాహుల్, శుభ్‌మాన్ గిల్, హార్దిక్ పాండ్యా, మహ్మద్ షమీ, రిషబ్ పంత్ ఉన్నారు.
తిరిగొచ్చిన శ్రేయాస్ అయ్యర్, ఇషాన్ కిషన్..
🚨 𝗡𝗘𝗪𝗦 🚨
BCCI announces annual player retainership 2024-25 – Team India (Senior Men)#TeamIndia
Details 🔽https://t.co/lMjl2Ici3P pic.twitter.com/CsJHaLSeho
— BCCI (@BCCI) April 21, 2025
కొత్త సెంట్రల్ కాంట్రాక్టులో శ్రేయాస్ అయ్యర్ బి గ్రేడ్‌లో రీఎంట్రీ ఇచ్చాడు. కాగా, శ్రేయాస్‌తో పాటు, ఈ గ్రేడ్‌లో చేర్చబడిన మరో నలుగురు ఆటగాళ్ళు సూర్యకుమార్ యాదవ్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యశస్వి జైస్వాల్ చోటు దక్కించుకున్నారు.
సి గ్రేడ్‌లో మొత్తం 19 మంది ఆటగాళ్ళు..
ఇక సి గ్రేడ్‌లో మొత్తం 19 మంది ఆటగాళ్లు చోటు దక్కించుకున్నారు. వీరిలో ఇషాన్ కిషన్ ఒకడు. ఇషాన్ కిషన్‌తో పాటు రింకూ సింగ్, తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, శివమ్ దూబే, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ముఖేష్ కుమార్, సంజు శాంసన్, అర్ష్‌దీప్ సింగ్, ప్రసిద్ధ్ కృష్ణ, రజత్ పాటిదార్, ధ్రువ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, అభిషేక్ శర్మ, ఆకాశ్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా ఉన్నారు.
ఇన్: ధృవ్ జురెల్, సర్ఫరాజ్ ఖాన్, నితీష్ కుమార్ రెడ్డి, ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ, ఆకాష్ దీప్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా, శ్రేయాస్ అయ్యర్.
ఔట్: శార్దూల్ ఠాకూర్, జితేష్ శర్మ, కేఎస్ భరత్, అవేశ్ ఖాన్
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
