Video: లైవ్ మ్యాచ్‌లో జెర్సీ విప్పిన పాక్ సారథి.. ‘స్పోర్ట్స్ బ్రా’ చూసి షాకైన ఫ్యాన్స్.. అసలు కారణం ఏంటో తెలుసా?
Babar Azam: కొలంబో వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆతిథ్య శ్రీలంకపై పాకిస్థాన్ ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ అనంతరం పాక్ కెప్టెన్ బాబర్ ఆజం ఓ అభిమానికి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు.
బాబర్ అజామ్ సారథ్యంలోని పాకిస్థాన్ క్రికెట్ జట్టు ప్రస్తుతం శ్రీలంక పర్యటనలో ఉంది. టెస్టు మ్యాచ్‌ల్లో ఆతిథ్య జట్టును ఈ జట్టు ఘోరంగా ఓడించింది. తొలి టెస్టులో నాలుగు వికెట్ల తేడాతో గెలుపొందిన పాకిస్థాన్.. రెండో టెస్టులో శ్రీలంకను ఇన్నింగ్స్ 222 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ అనంతరం పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఓ అభిమానికి తన జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అయితే దీని తర్వాత కనిపించిన విషయాలు చాలా మందిని ఆశ్చర్యపరుస్తున్నాయి.
బాబర్ తన జెర్సీని తీసిన వెంటనే అంతా షాక్ అయ్యారు. సాధారణంగా కనిపించే బనీయన్ లేదా ట్రక్ కనిపించలేదు. వాటి స్థానంలో స్పోర్ట్స్ బ్రా కనిపించింది. దీంతో అంతా అవాక్కయ్యారు. ఇది స్పోర్ట్స్ బ్రాలా కనిపించే వెస్ట్. చాలా తక్కువ మంది ఆటగాళ్లు దీన్ని ధరించడం కనిపించింది. ఇంతకుముందు ప్లేయర్స్ ధరించలేదు. కానీ, ఇప్పుడు దాని ట్రెండ్ పెరుగుతోంది.
ధరించడానికి కారణమేంటంటే..
దీనిని స్పోర్ట్స్ బ్రా లాగా ఉండే కంప్రెషన్ వెస్ట్ అంటారు. ఇది భుజాల మధ్య వెనుక భాగాన్ని ఫిట్‌గా ఉంచేందుకు వాడుతుంటారు. ఇది చాలా తేలికగా ఉంటుంది. ఇది ధరించిన వ్యక్తి కూడా దానిని గుర్తించలేనంత తేలికగా ఉంటుంది. ఈ పరికరంలో GPS ట్రాకర్ ఉంటుంది. ఇది ప్లేయర్ తన రన్నింగ్ స్పీడ్‌ని లెక్కించుకునేందుకు వాడుతుంటారు. ఇందులో గైరోస్కోప్, మాగ్నెటోమీటర్ ఉన్నాయి. ఇది ఆటగాళ్ల కదలికలను 3Dలో కొలుస్తూ.. వారి స్థానాలను ట్రాక్ చేస్తుంది. ఇందులో హార్ట్ రేట్ మానిటర్ కూడా ఉంది.
దీని నుంచి అందుకున్న సమాచారంతో సెంట్రల్ డేటాబేస్ అనుసంధానిస్తుంటారు. ఇది విశ్లేషకులు పరిశీలన చేసి, ప్లేయర్ ఫిట్‌నెస్‌ను అంచనా వేస్తుంటారు. టీమిండియా ఆటగాళ్లు కూడా వీటిని ఉపయోగిస్తుంటారు. 2018లో భారత కండిషనింగ్ కోచ్ శంకర్ బసు దీనిని టీమిండియాకు తీసుకువచ్చాడు.
True Champion #BabarAzam𓃵 Gifted his Test Jersey to a Young Fan. So Cute🇵🇰💯. #PAKvsSL pic.twitter.com/c6tllleScb
— Abu Zayan Awan (@Its_AbuZee) July 27, 2023
దీని వల్ల ప్రయోజనం ఏంటంటే?
హిందూస్తాన్ టైమ్స్ నివేదిక ప్రకారం, శంకర్ బసు 2019లో దీని గురించి ఈ GPS పరికరాన్ని ఉపయోగించడం ద్వారా ప్లేయర్ గురించి సరైన సమాచారాన్ని పొందుతారని చెప్పుకొచ్చాడు. ఒక ఆటగాడు ఒక మ్యాచ్‌లో 2000 మీటర్లు పరిగెత్తితే, అది ఆందోళన కలిగించే విషయంగా పరిగణిస్తుంటారు. మరుసటి రోజు ఆ ఆటగాడికి విశ్రాంతి ఇవ్వాలని సిఫార్స్ చేస్తుంటారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..