Pakistan: ప్రపంచకప్‌లో పాకిస్తాన్ పేలవ ప్రదర్శన.. కట్‌చేస్తే.. కెప్టెన్‌గా బాబర్ ఔట్.. నిర్ణయం ఎప్పుడంటే?
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు (శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడుతోంది. అయితే, 38 బంతుల్లో 338 పరుగులు చేయాలి. కానీ, ఇది అసాధ్యం కావడంతో సెమీఫైనల్‌కు చేరుకునే పాకిస్థాన్ మార్గం మూసుకుపోయింది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా 4 మాత్రమే గెలవగలిగింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి కూడా ఓటమి చవిచూసింది.

Babar Azam Captaincy: వన్డే ప్రపంచకప్ తర్వాత టీ-20, వన్డే కెప్టెన్సీ నుంచి పాకిస్థాన్ (Pakistan Cricket Team) కెప్టెన్ బాబర్ ఆజం (Babar Azam) తప్పుకోవచ్చు. ప్రపంచకప్ సమయంలో ఈ విషయాన్ని ప్రకటించబోతున్నాడని మందుగా తెలిసింది. అయితే, ఇప్పుడు స్వదేశానికి తిరిగి వచ్చిన తర్వాత దీనిపై నిర్ణయం తీసుకుంటాడని వినిపిస్తోంది. జియో న్యూస్ సోర్సెస్ ఈ వార్తను అందించింది.
భారత్ వేదికగా జరుగుతున్న వన్డే ప్రపంచకప్‌లో ఈరోజు (శనివారం) కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో పాకిస్థాన్ తన చివరి లీగ్ మ్యాచ్‌ని ఇంగ్లాండ్‌తో ఆడుతోంది. అయితే, 38 బంతుల్లో 338 పరుగులు చేయాలి. కానీ, ఇది అసాధ్యం కావడంతో సెమీఫైనల్‌కు చేరుకునే పాకిస్థాన్ మార్గం మూసుకుపోయింది. వన్డే ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్‌లు ఆడగా 4 మాత్రమే గెలవగలిగింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి కూడా ఓటమి చవిచూసింది.
జియో న్యూస్ ప్రకారం, వైట్ బాల్ కెప్టెన్సీ నుంచి వైదొలగాలని బాబర్ ఆజం మాజీ పీసీబీ చైర్మన్ రమీజ్ రాజా, అతని సన్నిహితుల నుంచి సలహా కోరాడు. శుక్రవారం కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో రమీజ్ రాజా, బాబర్ మధ్య చర్చ కూడా జరిగింది.
వారి కుటుంబ సభ్యులతో కూడా చర్చించనున్నారు. తన తండ్రితో పాటు మాజీ క్రికెటర్లు మొయిన్ ఖాన్, షోయబ్ మాలిక్‌లను కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలని బాబర్ అడిగాడు.
పీసీబీ, మాజీ క్రికెటర్ల వ్యాఖ్యల తర్వాత మూడు ఫార్మాట్ల కెప్టెన్సీ నుంచి వైదొలగాలని చాలామంది సన్నిహితులు కోరారు.
ప్రపంచకప్‌లో సెంచరీ చేయలేకపోయిన బాబర్..
బాబర్ ఈ ప్రపంచకప్‌లో ఎనిమిది మ్యాచ్‌ల్లో 40.28 సగటుతో 282 పరుగులు మాత్రమే చేశాడు. అతను ఒక్క సెంచరీ కూడా చేయలేదు. 951 రోజుల పాటు ఐసీసీ ర్యాంకింగ్స్‌లో నంబర్-1 స్థానంలో ఉన్న బాబర్ ఇప్పుడు రెండో స్థానానికి పడిపోయాడు. ఇప్పుడు భారత ఆటగాడు శుభ్‌మన్ గిల్ అగ్రస్థానానికి చేరుకున్నాడు.
పాకిస్థాన్‌కు చేరుకున్న తర్వాత బాబర్ ఆజం కెప్టెన్సీపై నిర్ణయం..
View this post on Instagram
పాకిస్తాన్ జియో సూపర్ ప్రకారం, బాబర్ ఆజం పాకిస్తాన్ జట్టు మాజీ ఆటగాడు రమీజ్ రాజా నుంచి సలహా కోరాడు. ఈడెన్ గార్డెన్‌లో శిక్షణ తర్వాత వ్యాఖ్యానం కోసం భారతదేశంలో ఉన్న రమీజ్ రాజాతో బాబర్ ఆజం మాట్లాడుతూ కనిపించాడు. ఈ విషయంలో బాబర్ ఆజం తన తండ్రి సలహా కూడా తీసుకుంటాడని, అతను పాకిస్తాన్‌కు తిరిగి వచ్చిన తర్వాత నిర్ణయం తీసుకుంటాడని వార్తలు వినిపిస్తున్నాయి. ఇంతకుముందు భారత్‌లోనే ఈ నిర్ణయం తీసుకుందామనుకున్నా.. ఆయన ఇప్పుడు పాకిస్థాన్‌కు చేరుకున్న తర్వాతే ఏదైనా ప్రకటన చేస్తారని చెబుతున్నారు.
జట్టు ప్రదర్శనకు సంబంధించి నిరంతరం ప్రకటనలు ఇస్తున్న క్రికెట్ దిగ్గజాలకు బాబర్ అజామ్ తగిన సమాధానం ఇచ్చాడు. ఇలా ఉండాలి, ఇలా ఆడాలి అని ఒక్కొక్కరు ఒక్కోలా మాట్లాడుతున్నారని, ఎవరైనా నాకు ఏదైనా సలహా ఇవ్వాలనుకుంటే, అందరి వద్ద నంబర్ ఉందని, టీవీ చూస్తున్నప్పుడు సలహా ఇవ్వడం సులభం. మీకు కావాలంటే, మీరు నాకు మెసేజ్ కూడా చేయవచ్చు అంటూ కౌంటరిచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..




