155 బంతుల్లో 22 ఫోర్లు.. డబుల్ సెంచరీతో వన్డేల్లో తొలి షాకింగ్ స్కోర్.. సచిన్ కంటే ముందే హిస్టరీలో నిలిచిన ప్లేయర్..

On This Day: క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండవచ్చు. కానీ, ప్రపంచంలోనే వన్డే ఇంటర్నేషనల్‌లో మొదటి డబుల్ సెంచరీ ఎవరు చేశారో తెలుసా?

155 బంతుల్లో 22 ఫోర్లు.. డబుల్ సెంచరీతో వన్డేల్లో తొలి షాకింగ్ స్కోర్.. సచిన్ కంటే ముందే హిస్టరీలో నిలిచిన ప్లేయర్..
Odi Centuries
Follow us
Venkata Chari

|

Updated on: Dec 16, 2022 | 8:49 AM

155 బంతులు.. 181 నిమిషాలు.. 229 పరుగులు.. ఒక బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ చేస్తే.. జట్టు స్కోరు ఎలా ఉంటుందో వేరే చెప్పాల్సిన పనిలేదు. ముఖ్యంగా 363 పరుగుల తేడాతో విజయం సాధించడం మరో అద్భుతం. మన మాట్లాడుకుంటుంది ఇటీవలి మ్యాచ్‌ గురించి మాత్రం కాదండోయ్.. కొన్ని సంవత్సరాల క్రితం జరిగిన మ్యాచ్‌ గురించి. 1997 మహిళల వన్డే ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియా వర్సెస్ డెన్మార్క్ మ్యాచ్ గురించి మాట్లాడుతున్నాం. ఆ మ్యాచ్ ద్వారా, ఒక బ్యాట్స్‌మెన్ డబుల్ సెంచరీ చేయడం ప్రపంచం మొదటిసారి చూసింది. ఆస్ట్రేలియా బ్యాట్స్‌మెన్ బెలిండా క్లార్క్ ఈ అద్భుతం చేసి, ఆనాడు సంచలనం చేసింది.

పురుషుల క్రికెట్‌లో తొలి డబుల్ సెంచరీ రికార్డు సచిన్ టెండూల్కర్ పేరిట ఉండవచ్చు. కానీ, ప్రపంచలంలో వన్డే ఇంటర్నేషనల్‌లో మొదటి డబుల్ సెంచరీని బెలిండా క్లార్క్ నమోదు చేసింది. 1997లో ముంబై మైదానంలో జరిగిన ప్రపంచకప్ మ్యాచ్‌లో డెన్మార్క్ బౌలర్ల తంతు తెరిచాడు.

బెలిండా క్లార్క్ తొలి డబుల్ సెంచరీ..

Belinda Clarke

ఇవి కూడా చదవండి

బెలిండా క్లార్క్ 155 బంతుల్లో 22 ఫోర్ల సాయంతో 229 పరుగులు చేసింది. వన్డే క్రికెట్ చరిత్రలో, 1997లో చేసిన ఈ స్కోరు 2014 సంవత్సరం వరకు అతిపెద్ద స్కోర్‌గా నమోదైంది. 17 ఏళ్ల తర్వాత, రోహిత్ శర్మ 264 పరుగులు చేయడంతో వన్డేల్లో అత్యధిక స్కోరు సాధించిన ఈ రికార్డు బద్దలైంది.

16 డిసెంబర్ 1997న..

అయితే 25 ఏళ్ల క్రితం సాధించిన బెలిండా క్లార్క్ డబుల్ సెంచరీ ఈరోజు ఎందుకు చర్చనీయాంశమైంది? అనే ప్రశ్న మీలో మొదలై ఉండొచ్చు. 1997లో డిసెంబర్ 16వ తేదీన ఈ అద్భుతమైన ఫీట్ చేసింది. వన్డేల్లో బెలిండా తొలి డబుల్ సెంచరీ కారణంగా, ఆస్ట్రేలియా డెన్మార్క్‌పై తొలుత ఆడుతున్నప్పుడు 3 వికెట్లకు 412 పరుగులు చేసింది. డెన్మార్క్ 49 పరుగులకు ఆలౌట్ కాగా, 363 పరుగుల తేడాతో ఓడిపోయింది. డెన్మార్క్ ముందు 413 పరుగుల లక్ష్యం ఉంది. కానీ, ఈ సవాల్‌ ముందు డెన్మార్క్ ఇన్నింగ్స్‌ కేవలం 49 పరుగులకే కుప్పకూలింది. దీంతో ఆ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 363 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..