AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2024: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న విరాట్ కోహ్లీ కొత్త టీంమేట్.. ఎవరంటే?

Royal Challengers Bengaluru Player Cameron Green: ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడితే.. గత ఐపీఎల్ వేలంలో ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, ఈ ఎడిషన్‌లో ముంబైకి చెందిన RCB జట్టు గ్రీన్‌ని దక్కించుకుంది. ఐపీఎల్ 2023లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 50.22 సగటు, 160.28 స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

IPL 2024: ప్రాణాంతక వ్యాధితో బాధపడుతోన్న విరాట్ కోహ్లీ కొత్త టీంమేట్.. ఎవరంటే?
Cameron Green Rcb Team
Venkata Chari
|

Updated on: Dec 15, 2023 | 12:44 PM

Share

Royal Challengers Bengaluru Player Cameron Green: ఆస్ట్రేలియా యువ ఆల్‌రౌండర్, ఈ ఐపీఎల్ నుంచి RCB జట్టులో కనిపించనున్న అత్యంత ఖరీదైన ఆటగాడు, కామెరాన్ గ్రీన్.. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ‘7 క్రికెట్’ కి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో గ్రీన్ మాట్లాడుతూ, తాను పుట్టినప్పటి నుంచి తీవ్రమైన కిడ్నీ వ్యాధితో బాధపడుతున్నానని పేర్కొన్నాడు. మా అమ్మ 19వ వారం ప్రెగ్నెన్సీ స్కాన్ సమయంలో నాకు ఈ వ్యాధి ఉన్నట్లు నిర్ధారణ అయింది’ అంటూ తెలిపాడు.

‘నాకు ఈ వ్యాధి లక్షణాలు లేవు. కానీ, నేను అల్ట్రాసౌండ్ ద్వారా ఈ వ్యాధిని గుర్తించాను. నేను 12 ఏళ్లు మాత్రమే జీవించగలనని వైద్యులు మొదట్లో చెప్పారు. కానీ, నేను నా ఆహారాన్ని అలాగే నా కెరీర్‌ను మార్చుకున్నాను. ఇది నా జీవితాన్ని మరింత పొడిగించింది’ అంటూ షాక్ ఇచ్చాడు.

‘నా కిడ్నీలు ఇతర కిడ్నీల మాదిరిగా శరీరంలో రక్తాన్ని ఫిల్టర్ చేయవు. ఇవి 60 శాతం రక్తాన్ని మాత్రమే ఫిల్టర్ చేయగలవు. ప్రస్తుతం ఈ వ్యాధి రెండో దశలో ఉంది. ఇది ఐదవ దశకు చేరుకున్నప్పుడు, నేను కిడ్నీ మార్పిడి లేదా డయాలసిస్ చేయించుకోవలసి ఉంటుంది’ అంటూ తెలిపాడు.

గ్రీన్ ఐపీఎల్ కెరీర్ గురించి మాట్లాడితే.. గత ఐపీఎల్ వేలంలో గ్రీన్‌ను ముంబై ఇండియన్స్ ఫ్రాంచైజీ రూ.17.50 కోట్లకు కొనుగోలు చేసింది. కానీ, ఈ ఎడిషన్‌లో ముంబైకి చెందిన RCB జట్టు గ్రీన్‌ని దక్కించుకుంది.

కాగా, గ్రీన్ ఐపీఎల్ 2023లో 16 మ్యాచ్‌లు ఆడాడు. ఇందులో అతను 50.22 సగటు, 160.28 స్ట్రైక్ రేట్‌తో 452 పరుగులు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, రెండు అర్ధ సెంచరీలు ఉన్నాయి.

IPL 2024కి ముందు RCB రిటైన్, రిలీజ్ చేసిన ఆటగాళ్ల జాబితా..

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ చేసిన ఆటగాళ్లు..

ఫాఫ్ డు ప్లెసిస్ (కెప్టెన్), గ్లెన్ మాక్స్‌వెల్, విరాట్ కోహ్లీ, రజత్ పాటిదార్, అనుజ్ రావత్, దినేష్ కార్తీక్, సుయాష్ ప్రభుదేసాయి, విల్ జాక్స్, మహిపాల్ లోమ్రోర్, కర్ణ్ శర్మ, మనోజ్ భాండాగే, మయాంక్ డాగర్ (SRH నుంచి), విజయ్‌కుమార్ వైషాక్, ఆకాష్ దీప్, మహమ్మద్ సిరాజ్, రీస్ టాప్లీ, హిమాన్షు శర్మ, రాజన్ కుమార్, కామెరాన్ గ్రీన్ (MI నుంచి).

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టీం విడుదల చేసిన ఆటగాళ్లు..

వనిందు హసరంగా, హర్షల్ పటేల్, జోష్ హేజిల్‌వుడ్, ఫిన్ అలెన్, మైకేల్ బ్రేస్‌వెల్, డేవిడ్ విల్లీ, వేన్ పార్నెల్, సోనూ యాదవ్, అవినాష్ సింగ్, సిద్ధార్థ్ కౌల్, కేదార్ జాదవ్.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్క క్లిక్ చేయండి..