IND vs PAK: కేఎల్ రాహుల్ ఔట్, కోహ్లీ ‘స్థానం’పై సస్పెన్స్.. పాక్ మ్యాచ్‌ ముందు అదే జరిగే నష్టపోవాల్సిందేనా..?

IND vs PAK: కేఎల్ రాహుల్ జట్టులోని ప్రధాన వికెట్ కీపర్, ఇంకా మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అయితే 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో రాహుల్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ ఈ యువ ప్లేయర్ ఓపెనర్. ఇదే ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా మారి రోహిత్ శర్మకు జోడి అయితే.. శుభమాన్ గిల్ మూడో స్థానంలోకి, అలాగే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్..

IND vs PAK: కేఎల్ రాహుల్ ఔట్, కోహ్లీ ‘స్థానం’పై సస్పెన్స్.. పాక్ మ్యాచ్‌ ముందు అదే జరిగే నష్టపోవాల్సిందేనా..?
IND vs PAK
Follow us
శివలీల గోపి తుల్వా

|

Updated on: Aug 29, 2023 | 7:58 PM

IND vs PAK: ప్రతిష్టాత్మక ఆసియా కప్ ప్రారంభం కాక ముందే టీమిండియా కష్టాల్లో పడింది. కేఎల్ రాహుల్ తొలి రెండు మ్యాచ్‌లకు దూరం కావడమే ఈ సమస్యకు ప్రధాన కారణమని చెప్పుకోవాలి. కేఎల్ రాహుల్ జట్టులోని ప్రధాన వికెట్ కీపర్, ఇంకా మిడిల్ ఆర్డర్ ప్లేయర్. అయితే 17 మంది సభ్యులతో కూడిన భారత జట్టులో రాహుల్‌కి ప్రత్యామ్నాయ వికెట్ కీపర్‌గా ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ ఈ యువ ప్లేయర్ ఓపెనర్. ఇదే ఇప్పుడు పెద్ద చిక్కుముడిగా మారింది. ఇషాన్ కిషన్ ఓపెనర్‌గా మారి రోహిత్ శర్మకు జోడి అయితే.. శుభమాన్ గిల్ మూడో స్థానంలోకి, అలాగే విరాట్ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయాల్సి వస్తుంది.

శుభమాన్ గిల్ మూడో స్థానంలో బ్యాటింగ్‌కి దిగితే టీమిండియా కోహ్లీ పరుగులను మిస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే కోహ్లీ ఏ స్థానంలో అయినా బ్యాటింగ్ చేయగల సత్తా కలిగినప్పటికీ.. మూడో స్థానంలో బరిలోకి దిగితే ఎక్కువ పరుగులు చేసేందుకు అవకాశం ఉంటుంది. అంటే మూడో స్థానంలో గిల్ కంటే కోహ్లీ బెస్ట్ ఆప్షన్, కానీ కేఎల్ రాహుల్ గాయం కారణంగా భారత్ జట్టు బ్యాటింగ్ ఆర్డర్‌లో అనూహ్య మార్పులు చేయాల్సి వస్తోంది. ఇవేం కాకుండా కోహ్లీ మూడో స్థానంలో, గిల్ నాలుగో స్థానంలో ఆడితే ఎలాంటి నష్టం జరగకపోవచ్చు.

ఇవి కూడా చదవండి

రాహుల్ దూరం..

ఇదిలా ఉండగా.. బోర్డర్ గవాస్కర్ టెస్ట్ ట్రోఫీ సమయంలో గాయపడిన శ్రేయాస్ అయ్యర్ పునరాగమనం చేసేందుకు పూర్తిగా సిద్ధమయ్యాడు. పాకిస్తాన్‌తో జరిగే తొలి మ్యాచ్‌లోనే అతను బరిలోకి దిగే అవకాశం ఉన్నా, ఏ స్థానంలో బరిలోకి దిగుతాడనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.

అయ్యర్ ఆగయా..

రేపే ప్రారంభం..

కాగా, ఆసియా కప్ రేపటి నుంచి ప్రారంభం కానుండగా.. తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్, నేపాల్ జట్లు తలపడనున్నాయి. భారత జట్టు సెప్టెంబర్ 2న పాకిస్తాన్‌తో, సెప్టెంబర్ 4న నేపాల్‌తో ఆడుతుంది. అలాగే టోర్నీ ఫైనల్ సెప్టెంబర్ 27న జరగనుంది.

పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో భారత్ ప్రాబబుల్ ప్లేయింగ్ XI..

రోహిత్ శర్మ (కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ , శ్రేయాస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్, మహ్మద్ షమీ.

ఆసియా కప్‌కు భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), తిలక్ వర్మ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా (వైస్ కెప్టెన్), రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, పర్దీష్ కృష్ణ, సంజు శాంసన్ (రిజర్వ్ ప్లేయర్).

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
జామ ఆకే కదా అని తీసిపారేయకండి.. అది చేసే మేలు అంతా ఇంతా కాదు.!
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
పూనకాలు లోడింగ్.. పుష్ప వైల్డ్ ఫైర్ ఈవెంట్ మామూలుగా ఉండదు మరి..
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
చెర్రీ,వెంకీ,బాలయ్య ఎవరిది ఈ సంక్రాంతి.? అగ్ర తాంబూలం ఆ హీరోకేనా?
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
ఓటీటీ ఫీల్డ్‌లో.. కింగ్ మాదిరిగా మారిన ఐకాన్ స్టార్.! దద్దరిల్లిన
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
కిస్సిక్ అదిరింది.! ఇక బాడీలు ఊగడమే తరువాయి | చెర్రీ నయా రికార్డ్
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
పుష్ప దెబ్బతో టూరిస్ట్‌ స్పాట్‌గా మారిన ఆ గ్రామం.! వీడియో..
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
గుర్తు పట్టలేనంతగా మారిపోయిన స్టార్ హీరోయిన్.ఇలా మారిపోయింది ఏంటి
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
పుష్ప2 పై తప్పుడు ప్రచారం.. అవేమీ నమ్మకండి.! మూవీ టీం క్లారిటీ..
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇస్తున్న స్టార్ క్రికెటర్ భార్య.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.
దిమ్మ తిరిగి బొమ్మ కనిపించిందట.! SJ సూర్య మాటలు వింటే గూస్బంప్స్.