AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ashes Series 2023: 141 ఏళ్లుగా యాషెస్‌ పోరు.. ఇవాళ్టి నుంచి టెస్ట్ సమరం.. గెలుపు నీదా నాదా..

యాషెస్ సిరీస్ 2023 శుక్రవారం నుంచి ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ మధ్య ప్రారంభం కానుంది. ఈ సిరీస్‌లో తొలి మ్యాచ్ బర్మింగ్‌హామ్‌లో జరగనుంది.

Ashes Series 2023: 141 ఏళ్లుగా యాషెస్‌ పోరు.. ఇవాళ్టి నుంచి టెస్ట్ సమరం.. గెలుపు నీదా నాదా..
Ashes Trophy
Sanjay Kasula
| Edited By: Ravi Kiran|

Updated on: Jun 16, 2023 | 1:28 PM

Share

England vs Australia Ashes Series 2023: క్రికెట్ యుద్దం మొదలు కానుంది. క్రికెట్ చరిత్రలో ప్రతిష్టాత్మకమైన యాషెస్ సిరీస్ శుక్రవారం నుండి మొదలు కానుంది. ఇంగ్లాండ్ – ఆస్ట్రేలియా మధ్య యాషెస్ సిరీస్ ప్రారంభమవుతుంది. యాషెస్ 2023 తొలి మ్యాచ్ జూన్ 16 నుంచి బర్మింగ్‌హామ్‌లో జరగనుంది. ఇందుకోసం ఇరు జట్లు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యాయి. ఆస్ట్రేలియా ఇటీవల వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ 2023 ఫైనల్‌ను గెలుచుకుంది. భారత్‌ను ఓడించిన ఆస్ట్రేలియా జట్టు.. మంచి ఫామ్‌లో ఉంది. గత యాషెస్‌లో ఇంగ్లండ్‌ను ఘోరంగా ఓడించింది. ఈసారి కూడా ఆస్ట్రేలియాదే పైచేయి కనిపిస్తోంది.

2021-2022 యాషెస్‌ను ఆస్ట్రేలియా 4-0 తేడాతో గెలుచుకుంది. తొలి మ్యాచ్‌లో ఆ జట్టు 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. రెండో మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 275 పరుగుల తేడాతో విజయం సాధించింది. రెండో ఇన్నింగ్స్‌లో 230 పరుగులకు ఆలౌటైంది. దీనికి సమాధానంగా ఇంగ్లండ్ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 236 పరుగులకు ఆలౌటైంది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌లోనూ 192 పరుగులు మాత్రమే చేయగలిగింది. 3 టెస్టులో ఆస్ట్రేలియా 14 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది. నాలుగో టెస్టు డ్రా అయింది. ఆ తర్వాత ఐదో టెస్టులో 146 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఇక ఇంగ్లండ్ గురించి చెప్పాలంటే.. గత కొన్ని టెస్టు మ్యాచ్‌ల్లో మంచి ప్రదర్శనతో విజయం సాధించింది. ఇటీవల జరిగిన మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఐర్లాండ్‌ను ఓడించింది. అంతకుముందు న్యూజిలాండ్‌తో జరిగిన రెండు మ్యాచ్‌ల సిరీస్‌ డ్రాగా ముగిసింది. ఇందులో ఒక మ్యాచ్‌లో ఇంగ్లండ్‌, ఒక మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ విజయం సాధించాయి. అంతకుముందు ఇంగ్లండ్ 3-0తో పాకిస్థాన్‌ను ఓడించింది. 2022-23లో ఈ సిరీస్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లోనూ ఇంగ్లండ్ విజయం సాధించింది.

2021-22 యాషెస్ సిరీస్‌కు ముందు, 2019లో ఆడిన సిరీస్ 2-2తో డ్రా అయినట్లు మీకు తెలియజేద్దాం. అదే సమయంలో, ఇంతకు ముందు ఆస్ట్రేలియా విజయం సాధించింది. 2017–18లో ఆస్ట్రేలియా 4–0తో గెలిచింది.

యాషెస్ చరిత్ర ఇది..

బర్మింగ్‌హామ్‌లోని ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో శుక్రవారం నుంచి యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ప్రతి క్రికెట్ ప్రేమికుడు ఎదురుచూసే సిరీస్. ఈ సిరీస్ క్రికెట్‌లోని పురాతన సిరీస్‌లలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే ఐదు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌ను యాషెస్ అంటారు. ఇది ప్రతి రెండేళ్లకోసారి జరుగుతుంది. ఒకసారి దాని ఆతిథ్యం ఇంగ్లండ్.. ఆ తర్వాత ఆస్ట్రేలియా.. అయితే ఈ సిరీస్‌లో అత్యంత ఆకర్షణీయమైన అంశం యాషెస్ ట్రోఫీ.. అది చాలా చిన్నది. యాషెస్ అనేది ఇంగ్లండ్- ఆస్ట్రేలియా మధ్య జరిగే టెస్ట్ క్రికెట్ సిరీస్ . 1882లో ది ఓవల్‌లో ఆస్ట్రేలియా విజయం సాధించిన వెంటనే, ఇంగ్లీష్ గడ్డపై తొలి టెస్టు విజయం సాధించిన వెంటనే బ్రిటిష్ వార్తాపత్రిక..’ ది స్పోర్టింగ్ టైమ్స్‌’లో ప్రచురించబడిన వ్యంగ్య కథనంలో ఈ పదం ఉద్భవించింది.

యాషెస్ ట్రోఫీ ఎందుకు చిన్నది, దాని పరిమాణం ఎంత అనే ప్రశ్న చాలా మందికి ఉంటుంది. సహజంగానే నేటి క్రికెట్ ప్రపంచంలో గెలిచినందుకు పెద్ద ట్రోఫీలు ఇస్తారు. ఇంత పెద్ద సిరీస్ గెలిచినందుకు చిన్న ట్రోఫీ ఎందుకు..? ఈ ప్రశ్న అందరి మదిలో మెదులుతోంది.

ఇది కారణం..

ముందుగా ఈ యాషెస్ ట్రోఫీ సైజు ఏంటో తెలుసుకోండి.. ఈ చిన్న బ్రౌన్ కలర్ ట్రోఫీ పరిమాణం 4.1 అంగుళాలు.. ఈ ట్రోఫీని ఇవ్వడం వెనుక ఓ కథ ఉంది.. 1882లో ఓవల్ మైదానంలో జరిగిన టెస్టు మ్యాచ్‌లో ఇంగ్లండ్ ఓడిపోయింది. స్వదేశంలో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి. దీని తర్వాత ది స్పోర్టింగ్ టైమ్స్ అనే ఆంగ్ల దినపత్రిక దీనిపై సంతాప సందేశం రాస్తూ.. ఇంగ్లండ్ క్రికెట్‌కు ఇది చావు అని పేర్కొంటూ.. ఇంగ్లండ్ క్రికెట్ డెడ్ బాడీని కాల్చివేసి బూడిదను ఆస్ట్రేలియాకు తరలించినట్లు రాసింది. యాషెస్ అంటే ఆంగ్లంలో యాషెస్ అని అర్థం. ఇక్కడ నుండి ఈ సిరీస్ పేరు వచ్చింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం