IND vs NZ: ఆ ప్లేయర్ ఉంటే ఈ పరిస్థితి రాకపోవు.. టీమిండియా ప్రదర్శనపై కుంబ్లే సంచలన వ్యాఖ్యలు

న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో ఛతేశ్వర్‌ పుజారా ఉంటే భారత్‌కు లాభం ఉండేదని మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే పేర్కొన్నారు. విరాట్ నెంబర్ 4లో వచ్చి, ఛతేశ్వర్‌ పుజారా నెంబర్ 3లో వస్తే బాగుండేదన్నారు. . ఛతేశ్వర్‌ పుజారా హిట్టింగ్‌కు వెళ్లకుండా బంతిని చూసుకుంటూ ఆడుతాడని చెప్పారు.

IND vs NZ: ఆ ప్లేయర్ ఉంటే ఈ పరిస్థితి రాకపోవు.. టీమిండియా ప్రదర్శనపై కుంబ్లే సంచలన వ్యాఖ్యలు
Anil Kumble
Follow us

|

Updated on: Oct 17, 2024 | 5:02 PM

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో వెటరన్ బ్యాటర్ ఛతేశ్వర్‌ పుజారా ఉండటం వల్ల భారత్‌కు ఎంతో లాభం ఉండేదని మాజీ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. “రోహిత్ శర్మ 46 పరుగులకే ఔటయ్యాడు.. ఇది అత్యల్ప ఇన్నింగ్స్.. పుజారా గతంలో చాలా సందర్భాలలో భారతదేశాన్ని ఓటమి నుంచి గట్టెక్కాడు. అయితే ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ముగిసిన తర్వాత నెంబర్ 3 స్థానాన్ని శుభ్‌మాన్ గిల్‌కు ఇచ్చారు. విరాట్ కోహ్లి నం. 4లో బ్యాటింగ్ చేసి ఉండాల్సింది, నెంబర్ 3 స్థానం కోసం ఛటేశ్వర్ పుజారా లాంటి వ్యక్తి అక్కడ చాలా సంవత్సరాలు ఆడాడు. ఛతేశ్వర్‌ పుజారా హిట్టింగ్‌కు వెళ్లకుండా బంతిని చూసుకుంటూ ఆడుతాడు. తను డిఫెన్స్‌ ఆడుతూ భారత్‌ను గెలిపించినా సందర్భాలు ఎన్నో ఉన్నాయి” అని అనిల్‌ కుంబ్లే పేర్కొన్నాడు.

బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో భారత్‌తో జరిగిన మొదటి టెస్ట్‌ మ్యాచ్‌లో మాట్ హెన్రీ, విల్ ఓ’రూర్క్ కొత్త బంతితో విధ్వంసం సృష్టించారు. స్వదేశంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో తమ అత్యల్ప స్కోరుకు భారత్‌ను కీవీస్ ఆలౌట్ చేసింది. బెంగుళూరులోని చిన్నస్వామి స్టేడియంలో న్యూజిలాండ్‌తో జరిగిన మొదటి టెస్ట్‌లో భాగంగా మొదటి రోజు ఒక బంతి కూడా వేయకుండా అసలు వాష్ అవుట్ అయింది. చిభారత్ 2వ రోజు 46 పరుగులకే ఆలౌటైంది. గురువారం ఓ’రూర్క్ మరియు హెన్రీ మేఘావృతమైన మరియు తేమతో కూడిన పరిస్థితులను ఉపయోగించుకోవడంతో భారత్ 31.2 ఓవర్లు మాత్రమే బ్యాటింగ్ చేసింది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి