AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!

SRH Pitch Controversy: సొంత జట్టు గెలవాలనే రాయుడి ఆరాటాన్ని తప్పుబట్టలేము కానీ, క్రికెట్ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండటం కూడా అంతే ముఖ్యం. అంబటి రాయుడు ఇచ్చిన ఈ హామీపై బీసీసీఐ ఎలా స్పందిస్తుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఏదేమైనా, నిబంధనల వివాదాలను పక్కనబెడితే, ప్రస్తుతం అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆరెంజ్ ఆర్మీ ఈ ఏడాది కప్ కొట్టడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది.

SRH కోసం బీసీసీఐ రూల్స్‌ను తొక్కిపడేసిన అంబటి రాయుడు.. ఉప్పల్ పిచ్‌పై సంచలన నిర్ణయం..!
Srh Pitch Controversy
Venkata Chari
|

Updated on: May 24, 2026 | 3:11 PM

Share

SRH Pitch Controversy: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL 2026)లో సన్‌రైజర్స్ హైదరాబాద్ అద్భుత ప్రదర్శనతో ప్లేఆఫ్స్‌కు దూసుకెళ్లిన వేళ, టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు తీసుకున్న ఒక నిర్ణయం ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో తీవ్ర సంచలనంగా మారింది. వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ కోసం భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) నిబంధనలను పక్కనబెట్టి, హైదరాబాద్ రాజీవ్ గాంధీ స్టేడియంలో సన్‌రైజర్స్ జట్టుకు అనుకూలమైన పిచ్‌లను సిద్ధం చేస్తామని రాయుడు హామీ ఇవ్వడం పెద్ద చర్చకు దారితీసింది.

ఆరెంజ్ ఆర్మీకి సొంతగడ్డపై తిరుగులేని ఆధిక్యం..!

పాట్ కమిన్స్ సారథ్యంలోని సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఈ ఏడాది ఐపీఎల్ 2026లో అద్భుత విజయాలతో దూసుకుపోతోంది. లీగ్ దశలో ఆడిన 14 మ్యాచుల్లో 9 విజయాలు నమోదు చేసి ఘనంగా ప్లేఆఫ్స్‌కు అర్హత సాధించింది. తమ చివరి లీగ్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుపై ఘన విజయం సాధించిన హైదరాబాద్ జట్టు, మే 27న జరగబోయే ఎలిమినేటర్ పోరుకు సిద్ధమవుతోంది. ఈ విజయ ఉత్సాహంలో ఉన్న సన్‌రైజర్స్ అభిమానులకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (HCA) క్రికెట్ ఆపరేషన్స్ హెడ్‌గా ఉన్న అంబటి రాయుడు మరింత జోష్ ఇచ్చే ప్రకటన చేశారు.

ఇది కూడా చదవండి: కావ్య మారన్, అనిరుధ్ పెళ్లి..? వీరిద్దరి ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే అవాక్కే..

ఇవి కూడా చదవండి

బ్యాటర్లకు పండగే.. హైదరాబాద్ పిచ్‌లపై రాయుడు కీలక వ్యాఖ్యలు..

సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులో ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్ వంటి విధ్వంసకర బ్యాటర్లు ఉన్నారు. వీరితో పాటు నితీష్ కుమార్ రెడ్డి, సలిల్ అరోరా, అనికేత్ వర్మ వంటి యువ ఆటగాళ్లతో జట్టు బ్యాటింగ్ విభాగం ఎంతో బలంగా ఉంది. ఈ నేపథ్యంలో, వచ్చే సీజన్‌లో ఆరెంజ్ ఆర్మీకి సొంత మైదానంలో వంద శాతం ప్రయోజనం చేకూరేలా పిచ్‌లను రూపొందిస్తామని రాయుడు స్పష్టం చేశారు. ఒక క్రీడా ఛానెల్ చర్చా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. “సన్‌రైజర్స్ జట్టుకు ఎలాంటి పిచ్‌లు కావాలో, వారు ఏం కోరుకుంటున్నారో వాటన్నింటినీ మేం సమకూరుస్తాము. ఈ సీజన్ ముగిసిన తర్వాత వారితో సమావేశమై, వారి అవసరాలకు తగ్గట్టుగా పిచ్‌లను ప్రత్యేకంగా తయారు చేయిస్తాం. హైదరాబాద్ జట్టు మళ్లీ ఛాంపియన్‌గా నిలవడమే మా లక్ష్యం” అని రాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇది కూడా చదవండి: ఐపీఎల్‌లో మరో కొత్త ఫ్రాంచైజీ.. ఒకే టీంలోకి ఇషాన్ కిషన్, వైభవ్ సూర్యవంశీ? రంగంలోకి భారతీయ బిలియనీర్!

బీసీసీఐ నిబంధనలను ఉల్లంఘించారా? అసలు రూల్స్ ఏం చెబుతున్నాయి?

అయితే, అంబటి రాయుడు చేసిన ఈ వ్యాఖ్యలు బీసీసీఐ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ నిబంధనల ప్రకారం.. ఏ ఫ్రాంచైజీకి కూడా తమ సొంత మైదానంలోని పిచ్ తయారీలో జోక్యం చేసుకునే హక్కు లేదు. పిచ్‌లు నిష్పక్షపాతంగా ఉండటం కోసం బీసీసీఐ స్వతంత్ర క్యూరేటర్లను నియమిస్తుంది. స్టేడియం ప్రధాన పిచ్‌పై కేవలం మైదాన సిబ్బంది, అంపైర్లు, ఐపీఎల్ అధికారులకు మాత్రమే అనుమతి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Video: తూచ్.. వాడిదసలు బౌలింగేనా.. స్టాండ్స్‌లో శివాలెత్తిన కావ్యపాప..

బోర్డు మార్గదర్శకాల ప్రకారం.. పిచ్‌లపై బౌలర్లకు కనీస సహాయం మాత్రమే ఉండాలి, స్థానిక క్యూరేటర్ల జోక్యం లేకుండా బీసీసీఐ ప్రతినిధి పర్యవేక్షించాలి, అలాగే పిచ్‌పై సమానంగా పచ్చిక ఉంచాలి. ఇలాంటి కఠినమైన రూల్స్ ఉన్న తరుణంలో, రాయుడు సన్‌రైజర్స్ కోసం ప్రత్యేకంగా పిచ్‌లు తయారు చేయిస్తానని చెప్పడం బీసీసీఐ విధానాలకు సవాల్ విసిరినట్లయింది.

సన్‌రైజర్స్‌కు అసలు అడ్డదారి పిచ్‌ల అవసరం ఉందా?

నిజానికి, ఎలాంటి అదనపు ప్రయోజనాలు లేకపోయినా ఈ సీజన్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ సొంతగడ్డపై అద్భుత రికార్డును నమోదు చేసింది. హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో ఆడిన 7 మ్యాచుల్లో ఏకంగా 5 విజయాలు సాధించి సత్తా చాటింది. ఒకవైపు అభిషేక్, ఇషాన్, క్లాసెన్ పరుగుల వరద పారిస్తుంటే.. మరోవైపు బౌలింగ్‌లో సాకిబ్ హుస్సేన్, పాట్ కమిన్స్, శివాంగ్ కుమార్, ప్రఫుల్ హింగే ప్రత్యర్థులను వణికిస్తున్నారు. ఇంతటి సమతుల్యమైన జట్టు ఉన్నప్పుడు సన్‌రైజర్స్‌కు ప్రత్యేకంగా పిచ్‌లను మార్చాల్సిన అవసరం లేదని, వారు ఏ పరిస్థితుల్లోనైనా గెలవగలరని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
తెలుగు రాష్ట్రాల్లో బంగారం, వెండి ధరలు ఇవే.. తగ్గిందా? పెరిగిందా?
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
Horoscope Today: ఆ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తికి ఛాన్స్..
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
రోజంతా యాక్టివ్‌గా ఉండాలంటే ఉదయం ఈ 5 తప్పులు అస్సలు చేయొద్దు!
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
పుట్టుకతోనే దైవ అనుగ్రహం పొందిన రాశులు ఇవే.. మీ రాశి కూడా ఈ జాబిత
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
ఇంట్లో నేలపై పాకుతూ బల్లి కనిపిస్తే శుభమా? అశుభమా? శాస్త్రం..
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తున్నారా?
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి–మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
రాత్రిపూట గోళ్లు కత్తిరించుకోవద్దని ఎందుకు చెబుతారు? మూఢనమ్మకం..
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
బుధుడి తిరోగమనం.. వీరి జీవితంలో ఊహించని మార్పులు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు
ఘుమఘుమలాడే పక్కా పల్లెటూరి స్టైల్ చేపల పులుసు